అన్వేషించండి

Mahindra Thar On Road Price Hyderabad: హైదరాబాద్‌లో మహీంద్రా థార్ ఆన్‌రోడ్‌ ధర ఎంత? నెల వారీ EMI వివరాలు ఏంటీ?  

Mahindra Thar On Road Price: హైదరాబాద్‌లో మహీంద్రా థార్ RWD ఆన్‌రోడ్‌ ధర 13.80 లక్షల నుంచి ప్రారంభం కాగా 4X4 మోడల్‌ ఆన్‌రోడ్‌ ధర 18.90 వరకు ఉంటుంది.  ఇరవై శాతం డౌన్‌పేమెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహీంద్రా థార్ RWD, 4X4 వేరియంట్లు హైదరాబాద్ ఆన్‌రోడ్ ధరలు.
  • కారు కొనుగోలుకు 10-20 శాతం డౌన్‌పేమెంట్, EMI వివరాలు.
  • థార్ కొనుగోలుకు అవసరమైన జీతం, బ్యాంక్ లోన్ చిట్కాలు.

Mahindra Thar On Road Price Hyderabad: రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించే ఏకైక రఫ్‌ టఫ్‌ ఎస్‌యూవీ మహీంద్రా థార్. నేటి జెన్‌జీ, మిలియనియల్స్‌ డ్రీమ్ కార్ల లిస్ట్‌లో థార్‌దే అగ్రస్థానం. సిటీ రోడ్లపై దర్జాగా వెళ్లడమే కాకుండా, టఫ్‌ రోడ్లపైకూడా దూసుకెళ్లే ఈ వెహికల్‌ కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరంలో ఉన్న వారు ఈ కారు కొనాలి అంటే మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. నెల నెల ఈఎంఐ ద్వారా చెల్లించి తీసుకోవచ్చు. అయితే ఇలా ఈఎంఐపై కారు కొనాలి అంటే డౌన్‌పేమెంట్ ఎంత చెల్లించాలి? ఆన్‌రోడ్ ప్రైస్ ఎంతో చూద్దాం.

మహీంద్రా థార్ కొనుగోలు చేసే ముందు ఆన్‌రోడ్ ప్రైస్, వేరియంట్లు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ థార్ లైనప్‌లో రియల్ వీల్ డ్రైవ్, ఫోర్‌ వీల్ డ్రైవ్ అనే రెండు ప్రధాన కేటగిరీలు ఉన్నాయి. నగరంలో మాత్రమే డ్రైవ్ చేస్తూ, లుక్స్ మాత్రమే కావాలనుకునే వారికి RWD మోడల్స్‌ బెస్ట్‌ బడ్జెట్ ఆప్షన్. అదే సమయంలో ఆఫ్‌ రోడింగ్‌, అడ్వెంచర్ ఇష్టపడే వారికి 4X4 వేరియంట్లు పర్ఫెక్ట్‌. 

మహీంద్రా థార్ ఆన్‌రోడ్‌ ప్రైస్ ఎంత?

హైదరాబాద్‌లో తెలంగాణ లైఫ్‌ టైమ్ రోడ్ టాక్స్‌, ఇన్సూరెన్స్‌, ఫాస్టగ్, టీసీఎస్‌ కలుపుకొని ఆన్‌రోడ‌ ధరలు ఇలా ఉన్నాయి. మహీద్రా థార్ RWD AX(O) హార్డ్‌ టాప్ డీజిల్‌ ఎక్స్‌ షోరూమ‌ ధర సుమారు 11.35 లక్షలు కాగా, హైదరాబాద్‌లో అన్ని పన్నులతో కలిపి ఆన‌రోడ్‌ ధర దాదాపు 13.80 లక్షలు ఉంటుంది. 

మహీంద్రా థార్‌ RWD LX హార్డ్‌ టాప్ డీజిల్‌  కారు బెస్ట్ సెల్లింగ్ వెర్షన్. ఎక్స్‌ షోరూమ్‌ ధర 12.85 లక్షలు ఉండగా, హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ధర 15. 55 లక్షల వరకు ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ కోరుకునే వారి కోసం మహీంద్రా థార్ 4X4 LX హార్డ్ టాప్ పెట్రోల్‌     (AT) మంచి ఆప్షన్. హైదరాబాద్‌లో ఆన‌రోడ్‌ ధర 18.40 లక్షలు. ఆఫ్‌ రోడింగ్‌ ప్రియుల హాట్ ఫేవరేట్‌గా ఉన్న మహీంద్రా థార్ 4X4 LX హార్డ్ టాప్ డీజిల్‌ మాన్యువల్ కారు ధర హైదరాబాద‌లో 18.90 లక్షలు. ఇది టాప్‌ ఎండ్‌ మోడల్‌ అయిన మహీంద్రా థార్‌ 4X4 ఎల్‌ఎక్స్‌ హార్డ్‌ టాప్‌ డీజిల్‌ ఆటోమేటిక్‌ కారు ఆన్‌రోడ్‌ ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో 20.50 లక్షల వరకు చేరుకుటుంది. 

డౌన్‌పేమెంట్‌ ఎంత చెల్లించాలి?

బ్యాంకులు మీ సిబిల్ స్కోర్, ఆదాయ ప్రాతిపికన ఆన్‌రోడ్‌ ధరపై 80 శాతం నుంచి 90 శాతం వరకు కారు రుణాన్ని మంజూరు చేస్తాయి. మిగిలిన పది శాతం నుంచి ఇరవై శాతం మొత్తాన్ని మీరు డౌన్‌పేమెంట్‌ రూపంలో ీ సొంత నిధుల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. 

థార్‌ RWD LX డీజిల్‌‌ కారు కొనాలి అంటే మీరు కనీసం ఇరవై శాతం డౌన్‌పేమెంట్‌ చెల్లించాలి. సుమారు 3.11 లక్షలు డౌన్‌పేమెంట్‌ రూపంలో చెల్లించాలి. ఒక వేళ బ్యాంక్ మీకు 90 శాతం లోన్ ఇస్తే మీ డౌన్‌పేమెం్‌ దాదాపు 1.55 లక్షలు సరిపోతుంది. అదే థార్‌ 4X4ఎల్‌క్స్ డీజిల్ కారు కొనాలి అంటే ఇరవై శాతం డౌన్‌పేమెంట్‌ ప్లాన్ ప్రకారం కనీసం 3.78 లక్షలు డౌన‌పేమెంట్ చెల్లించాలి. డౌన్‌పేమెంట్‌  ఎంత ఎక్కువ కడితే మీకు వచ్చే అప్పు తగ్గుతుంది. మీపై పడే రుణభారం తగ్గుతుంది. నెల నెలా చెల్లించే ఈఎంఐ తగ్గుతుంది. 

నెలవారీ EMI ఎంత పడుతుంది?

ప్రస్తుతం ఆటో లోన్‌పై బ్యాంకులు 8.85 నుంచి 9.50 శాతం వరకు వార్షిక వడ్డీరేటును వసూలు చేస్తున్నాయి. మనం సగటు వడ్డీ రేటును 9.5 శాతంగా భావించి EMI లెక్కలు చూద్దాం. 

థార్‌ RWD ఎల్‌ఎక్‌ డీజిల్‌ 12.44 లక్షల లోన్‌పై ఐదేళ్లకు కొనుగోలు చేస్తే నెలకు 26, 100 రూపాయల EMI చెల్లించాలి. అదే ఏడేళ్ల టెన్యూర్‌లో నెలకు 20,300 వరకు EMI చెల్లించాలి. 

ధారర్‌ 4X4 ఎల్‌ఎక్స్‌ డీజిల్ మాన్యువల్‌ కారు కొనాలి అంటే బ్యాంకు నుంచి ధర 15. 12 లక్షలు లోన్ ద్వారా తీసుకోవాలి. దీన్ని ఐదేళ్ల కాలపరిమితికి తీసుకుంటే నెలకు 31, 700 రూపాయలు చెల్లించాలి. అదే ఏడేళ్లకు తీసుకుంటే 24, 650రూపాయలు EMI చెల్లించాలి. 

మహీంద్రా థార్ కొనాలంటే మీకు నెలకు ఎంత శాలరీ రావాలి?

ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్‌ చెప్పినట్టు 20/4/10 రూల్ ప్రకారం, కనీసం 20 శాతం డౌన్‌పేమెంట్ చెల్లించాలి. లోన్ కాలపరిమితి 4 ఏళ్లకు మించకూడదు. మీ కారు ఆపరేటింగ్ ఖర్చులు మీ నెలవారీ నిక ఆదాయంలో పది శాతం నుంచి 15 శాతం మించకూడదు. 

దీని ప్రకారం థార్ RWD మోడల్‌ కోసం మీ నెలవారీ EMI సుమారు 26వేలు చెల్లించాలి. ఇంధన ఖర్చులు, ఇన్సూరెన్స్‌ రిజర్వ్‌ కలిపి నెలకు 32వేలు అవుతుంది. మీ చేతికి వచ్చే నికర జీతం నెలకు కనీసం 1, 10,000 నుంచి 1, 30,000 వరకు ఉండాలి. థార్‌4X4 మోడల్‌ కోసం మీ నెలవారీ ఈఎంఐ సుమారు 32వేలు ప్లస్‌ ఇంధన ఖర్చులు కలిపి నెలకు 40వేల దాటుతాయి. కాబట్టి మీ నెలవారీ కనీస శాలరీ లక్షా యాభైవేలకుపైనే ఉండాలి. 

మీకు ఎలాంటి ఇతర లోన్లు లేకుంటే ఈ ప్లాన్ సరిగా సరిపోతుంది. లేకుంటే లెక్కలు తప్పుతాయి. అప్పులు పాలవుతారు. 

కారు కొనే ముందు పాటించాల్సిన చిట్కాలు

మీ సిబి్ స్కోర్‌ 750 కంటే ఎక్కువ ఉంటే బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేటుకే రుణం లభిస్తుంది. హైదరాబాద్‌లోని విభిన్న మహీంద్రా డీలర్‌షిప్‌లను సంప్రదించి కార్పొరేట్‌ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ బోనస్‌ , ఇన్సూరెన్స్‌ క్యాష‌బ్యాక్‌ కోసం చర్చించండి. షోరూమ్‌ ప్రతిపాదించే ఇన్సూరెన్స్‌ ప్రీమియం కంటే ఆన్‌లైన్‌లో బయట థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ పోర్టల్స్‌లో పొందే ఇన్సూరెన్స్‌ పదిహేను వేలు నుంచి 25వేల వరకు చౌకా లభిస్తుంది. 

Frequently Asked Questions

మహీంద్రా థార్ ఎందుకు ఇంత ఆదరణ పొందుతోంది?

ఇది రోడ్డుపై అందరి దృష్టిని ఆకర్షించే రఫ్ & టఫ్ ఎస్‌యూవీ. నేటి జెన్‌జీ, మిలియనియల్స్‌ డ్రీమ్ కార్ల జాబితాలో థార్ అగ్రస్థానంలో ఉంది.

మహీంద్రా థార్‌లోని ప్రధాన కేటగిరీలు ఏమిటి?

ఇందులో రియల్ వీల్ డ్రైవ్ (RWD) మరియు ఫోర్ వీల్ డ్రైవ్ (4X4) అనే రెండు ప్రధాన కేటగిరీలు ఉన్నాయి. RWD నగర డ్రైవింగ్‌కు, 4X4 ఆఫ్-రోడింగ్‌కు అనుకూలం.

హైదరాబాద్‌లో మహీంద్రా థార్ RWD AX(O) డీజిల్ ఆన్‌రోడ్ ధర ఎంత?

హైదరాబాద్‌లో RWD AX(O) హార్డ్‌ టాప్ డీజిల్ మోడల్ ఆన్‌రోడ్ ధర సుమారు 13.80 లక్షలు ఉంటుంది. ఇందులో పన్నులు, ఇన్సూరెన్స్ వంటివి కలిపి ఉంటాయి.

మహీంద్రా థార్ కొనుగోలుకు ఎంత డౌన్‌పేమెంట్ అవసరం?

బ్యాంకులు ఆన్‌రోడ్ ధరపై 80-90% లోన్ ఇస్తాయి. మిగిలిన 10-20% సొంత నిధుల నుంచి డౌన్‌పేమెంట్‌గా చెల్లించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Embed widget