అన్వేషించండి

683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే

Mahindra BE6 Discount: మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీఈ6 మీద భారీ ఆఫర్ ప్రకటించింది. గరిష్టంగా రూ.2.5 లక్షల వరకు కస్టమర్లకు ప్రయోజనం లభించనుంది. హైదరాబాద్‌లో ధరలు ఇలా ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ SUVపై రూ. 2.5 లక్షల తగ్గింపు.
  • INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఫ్యూచరిస్టిక్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్ కలవు.
  • అడ్వాన్స్‌డ్ ADAS, 600 కి.మీ.పైగా రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్.

మీరు కొత్త ఎలక్ట్రిక్ SUVని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ జూలై 2026లో మంచి ఆఫర్లు ఉన్నాయి. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన పాపులర్ ఎలక్ట్రిక్ Mahindra SUV BE 6పై అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో పెరుగుతున్న పోటీ, కస్టమర్లను తమ వైపు ఆకర్షించడానికి, కంపెనీ ఈ మోడల్‌పై ఏకంగా రూ. 2.50 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. చాలా కాలంగా ఈ ఎలక్ట్రిక్ SUVని కొనాలని చూస్తున్న కస్టమర్లకు ఈ ఆఫర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

హైదరాబాద్‌లో ఎస్‌యూవీ ధర ఎంతంటే..

ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్ తో పాటు ఇతర ఆఫర్లు ఉంటాయని మహీంద్రా కంపెనీ పేర్కొంది. అయితే, వినియోగదారులు అందరికీ ఒకే రకం ఆఫర్ లభించదు. మీరు ఏ వేరియంట్‌ను కొనుగోలు చేస్తున్నారనే దానిపై ప్రత్యేకమైన ఆఫర్ ఉంటుంది. ముఖ్యంగా 2025 ఇయర్ మోడల్ (MY2025) యూనిట్లపై అత్యధిక ప్రయోజనం లభించనుంది. అందువల్ల కార్ కొనే ముందు మీకు దగ్గర్లోని మహీంద్రా షోరూమ్‌ను సందర్శించి ఆఫర్ పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. హైదరాబాద్‌లో మహీంద్రా బీఈ6 ఎలక్ట్రిక్ బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.18,90,001 కాగా,  ఆన్ రోడ్ ధర రూ. 20,48,680 తో ప్రారంభం అవుతుంది. 

EV డిజై, ఇంటీరియర్ ఎలా ఉంది?
 కంపెనీ కొత్త జనరేషన్ INGLO ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన SUV Mahindra BE 6. దీని డిజైన్ సాధారణ SUVల కంటే పూర్తిగా భిన్నంగా, చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. ముందు భాగంలో ఆకర్షణీయమైన LED లైట్ బార్, షార్ప్ హెడ్‌లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఏరోడైనమిక్ బాడీ, స్పోర్టీ అల్లాయ్ వీల్స్ రోడ్డుపై ఈ వాహనాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి.  మోడ్రన్ డిజైన్‌తో పాటు కొత్త టెక్నాలజీ కారును కోరుకునే కస్టమర్లకు ఈ SUV బాగా నచ్చుతుంది. 

Also Read: హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?

ఇంటీరియర్ విషయానికి వస్తే, మహీంద్రా BE 6 క్యాబిన్ కూడా చాలా ప్రీమియంగా ఇచ్చారు. ఇందులో పెద్ద డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఇచ్చారు. ఒక స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం,  మరొకటి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కోసం ఉంటుంది. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సౌకర్యాల ఉండటంతో ఈ SUV ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తుంది.

కారు సేఫ్టీ, పర్ఫార్మెన్స్

సేఫ్టీ విషయానికి వస్తే Mahindra BE 6 చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఇందులో పలు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా,  లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. ADAS కింద అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి లాంగ్ జర్నీని, సురక్షితంగా, మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

Also Read: 526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి

Mahindra BE 6లో విభిన్న బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని మహీంద్రా కంపెనీ పేర్కొంది. చిన్న బ్యాటరీ ప్యాక్ వేరియంట్ రేంజ్ కూడా దాదాపు 550 కిలోమీటర్లు ఉందని క్లెయిమ్ చేసింది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దాంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేయడం వీలవుతుంది. లాంగ్ జర్నీ చేసేవారికి, ఫ్యామిలీతో పాటు వెళ్లే వారికి ఈ ఎస్‌యూవీ జర్నీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Frequently Asked Questions

మహీంద్రా BE 6పై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి?

మహీంద్రా BE 6పై రూ. 2.50 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్ వంటి ఆఫర్‌లు ఉంటాయి. ఆఫర్లు వేరియంట్‌ను బట్టి మారుతాయి.

మహీంద్రా BE 6 ఏ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించబడింది, దాని డిజైన్ ఎలా ఉంటుంది?

ఇది కొత్త జనరేషన్ INGLO ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించబడింది. దీని డిజైన్ చాలా భిన్నంగా, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. LED లైట్ బార్, షార్ప్ హెడ్‌లైట్లు దీని ప్రత్యేకతలు.

మహీంద్రా BE 6లో ఏ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి?

ఇందులో పలు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. లెవెల్-2 ADAS ఫీచర్లు లాంగ్ జర్నీలను సురక్షితంగా మారుస్తాయి.

మహీంద్రా BE 6 డ్రైవింగ్ రేంజ్ ఎంత?

పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ కూడా దాదాపు 550 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget