అన్వేషించండి

526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి

కియా సైరస్ EV భారత మార్కెట్లో 42kWh & 51.4kWh బ్యాటరీ ఆప్షన్లతో విడుదలకు సిద్ధమైంది. ఏడు వేరియంట్లు, ADAS, V2L, ధర అంచనా, ఫీచర్లు సహా పూర్తి వివరాలు తెలుసుకోండి.

Kia Syros EV Price, Range And Features: భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీని మరింత రసవత్తరంగా మార్చేందుకు, కియా తన కొత్త సైరస్ EV ని ఈ నెలాఖరులో విడుదల చేయనుంది. ఇప్పటికే రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ప్రారంభించిందీ కంపెనీ. ఈ మోడల్‌ను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఎక్స్‌షోరూమ్ ధరలో తీసుకురానున్నట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో దీని అంచనా ఆన్‌రోడ్ ధర రూ.15.90 లక్షల నుంచి రూ.19.61 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

5 ట్రిమ్‌లు - 7 వేరియంట్లు
కియా సైరస్ EV మొత్తం ఐదు ట్రిమ్‌లలో ఏడు వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. ఇందులో 42kWh & 51.4kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. బేస్ HTK వేరియంట్‌లో కేవలం 42kWh బ్యాటరీ మాత్రమే లభిస్తే, HTK+ & HTX వేరియంట్లలో ఈ రెండు బ్యాటరీ ఆప్షన్లూ ఉంటాయి. టాప్ HTX+ & X-Line వేరియంట్లను మాత్రం 51.4kWh బ్యాటరీతో మాత్రమే సేల్‌ చేస్తారు.

42kWh బ్యాటరీతో వచ్చే మోడల్‌లో 135hp శక్తిని ఉత్పత్తి చేసే ఫ్రంట్ మోటార్ ఉంటుంది. 51.4kWh వెర్షన్‌లో 171hp పవర్ అందుతుంది. రెండు మోడళ్లలోనూ 255Nm టార్క్ ఒకే విధంగా ఉంటుంది. పెద్ద బ్యాటరీతో (51.4kWh) వచ్చే మోడల్ 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 8.1 సెకన్లలో అందుకోగలదని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి: టాటా బెస్ట్‌ సెల్లింగ్‌ కార్‌ నెక్సాన్‌ - ప్లస్‌లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి, ఆలోచించండి

రేంజ్‌
రేంజ్ విషయంలో కూడా కియా సైరస్ EV ఆకట్టుకుంటోంది. 42kWh బ్యాటరీని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 443 km వరకు ప్రయాణించవచ్చని ARAI ధ్రువీకరించింది. 51.4kWh బ్యాటరీతో ఈ రేంజ్ 526 km వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ విభాగంలోనే అతి పెద్ద బ్యాటరీ ప్యాక్, అత్యధిక రేంజ్ & పవర్‌ఫుల్‌ మోటార్ కలిగిన మోడల్‌గా కియా సైరస్ EV నిలుస్తోంది.

ఛార్జింగ్ పరంగా, ఈ రెండు బ్యాటరీలు 11kW AC ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. అలాగే 100kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది. 42kWh బ్యాటరీ 10 నుంచి 80 శాతం వరకు సుమారు నాలుగు గంటల్లో ఛార్జ్ అవుతుంది. 51.4kWh బ్యాటరీకి మరో 50 నిమిషాలు అదనంగా పడుతుంది. అయితే 100kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో రెండు బ్యాటరీలు కూడా కేవలం 39 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతాయని కంపెనీ వెల్లడించింది.

రంగులు
ఈ ఎలక్ట్రిక్ SUV మొత్తం 9 మోనోటోన్ ఎక్స్‌టీరియర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది, అవి - ఫ్రాస్ట్ బ్లూ, గ్రావిటీ గ్రే, మాగ్మా రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, అరోరా బ్లాక్ పెర్ల్, ఐవరీ సిల్వర్ మ్యాట్, ఐవరీ సిల్వర్ గ్లోస్, ప్యూటర్ ఆలివ్ & ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్. X-Line ట్రిమ్ మాత్రం అరోరా బ్లాక్ పెర్ల్ & ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ రంగుల్లో మాత్రమే లభిస్తుంది.

ఇది కూడా చదవండి: హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లేదా KTM 250 డ్యూక్? ధర, పనితీరు, ఫీచర్లలో ఏ బండి బెస్ట్‌?

భద్రత 
కియా సైరస్ EVలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, TPMS, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలోనే స్టాండర్డ్‌గా అందించబడుతున్నాయి.

ట్రిమ్‌ వారీగా ఫీచర్లు 

బేస్ HTK నుంచే LED లైట్లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ Android Auto & Apple CarPlay, డ్రైవ్ మోడ్స్, USB Type-C పోర్టులు వంటి సౌకర్యాలు ఉన్నాయి. 

HTK+ వేరియంట్‌లో... HTKలో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు రియర్ వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ అదనంగా యాడ్‌ అవుతాయి. 

HTXలో... HTK+లో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, స్లైడింగ్ & రిక్లైనింగ్ రియర్ సీట్లు, OTA అప్‌డేట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లభిస్తాయి.

HTX+ వేరియంట్‌లో.. పైన చెప్పిన అన్ని ఫీచర్లతో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ & రియర్ సీట్లు, 8 స్పీకర్ల Harman Kardon ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 4-వే పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యుయల్ డ్యాష్ క్యామ్, బ్యాటరీ హీటింగ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 

టాప్‌ X-Line వేరియంట్‌లో Level-2 ADAS, V2L ఫంక్షన్, డిజిటల్ కీ, 64 రంగుల అంబియంట్ లైటింగ్, లోగో ప్రొజెక్షన్‌తో పడిల్ ల్యాంప్స్ వంటి ఆధునిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

Tata Nexon EV & Mahindra XUV 3XO EVలకు గట్టి పోటీగా కియా సైరస్ EV నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ రేంజ్, పెద్ద బ్యాటరీ, ఆధునిక భద్రత ఫీచర్లు & ప్రీమియం టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ SUV కొనుగోలుదార్ల దృష్టిని ఆకర్షించే అవకాశముంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget