అన్వేషించండి

హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లేదా KTM 250 డ్యూక్? ధర, పనితీరు, ఫీచర్లలో ఏ బండి బెస్ట్‌?

హీరో ఎక్స్‌ట్రీమ్ 250R & KTM 250 డ్యూక్ మధ్య పూర్తి పోలిక ఇది. డిజైన్, ఫీచర్లు, పనితీరు, మైలేజ్, కంఫర్ట్, ధర, సర్వీస్ నెట్‌వర్క్ వంటి అన్ని అంశాల్లో ఏ బైక్ బెస్ట్ అనేది తెలుసుకోండి.

Hero Xtreme 250R vs KTM 250 Duke: మన మార్కెట్లో, ఒకప్పుడు, 250cc లిక్విడ్ కూల్డ్ స్ట్రీట్ బైక్ సెగ్మెంట్‌లో KTM 250 డ్యూక్‌కు డైరెక్ట్‌ పోటీయే లేదు. అయితే, 2025లో హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 250Rను తీసుకురావడంతో ఈ సెగ్మెంట్‌లో పోటీ ఆసక్తికరంగా మారింది. ధర, ఫీచర్లు, పనితీరు, మైలేజ్, కంఫర్ట్ & హ్యాండ్లింగ్ వంటి అంశాల్లో ఈ రెండు బైక్‌ల మధ్య ఏది మెరుగైన ఎంపికో ఇప్పుడు చూద్దాం.

డిజైన్ 
ఈ రెండు బైక్‌లు కూడా స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుంటాయి. అయితే ఎక్స్‌ట్రీమ్ 250R మరింత బ్యాలెన్స్‌డ్‌ డిజైన్‌తో ప్రీమియం ఫీల్‌ అందిస్తుంది. KTM 250 డ్యూక్‌లో హెడ్‌ల్యాంప్ డిజైన్, షార్ప్ బాడీ ప్యానెల్స్ & పెద్ద ట్యాంక్ ష్రౌడ్స్ కారణంగా కొంత బిజీ లుక్ కనిపిస్తుంది. సింపుల్ & స్పోర్టీ డిజైన్ కోరుకునే వారికి హీరో బైక్ మరింత నచ్చే అవకాశం ఉంది.

ఫీచర్లు 
ఈ విషయంలో KTM 250 డ్యూక్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుంది. ఇందులో కలర్ TFT డిస్‌ప్లే, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, రెండు రైడింగ్ మోడ్‌లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. స్విచ్‌ల నాణ్యత, ఫినిషింగ్ కూడా మరింత ప్రీమియంగా అనిపిస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 250Rలోని చిన్న నెగటివ్... LCD డిస్‌ప్లే ఉండటం. స్విచ్ గేర్ నాణ్యత సాధారణ స్థాయిలో ఉండటం కూడా కొంత నిరాశ కలిగించే అంశం.

ఇది కూడా చదవండి: 526km రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లతో Kia Syros EV - బుకింగ్స్ ప్రారంభం, రేటు ఎంత ఉండొచ్చంటే?

పనితీరు 
పెర్ఫార్మెన్స్‌ విషయంలో హీరో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన రియల్‌ వరల్డ్‌ టెస్ట్‌లో KTM 250 డ్యూక్ కంటే ఎక్స్‌ట్రీమ్ 250R వేగంగా యాక్సిలరేట్ చేసినట్లు తేలింది. స్టాండింగ్ స్టార్ట్ మాత్రమే కాకుండా రోల్ ఆన్ యాక్సిలరేషన్‌లో కూడా హీరో బైక్ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ముఖ్యంగా మిడ్ రేంజ్‌లో ఎక్కువ శక్తి అందించడంతో సాధారణ రైడింగ్‌లో మరింత ఉత్సాహంగా అనిపిస్తుంది. KTM 250 డ్యూక్‌లో 6,000rpm దాటిన తర్వాతే అసలు శక్తి బయటపడుతుంది.

మైలేజ్ 
ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీలో రెండు బైక్‌లు దాదాపు సమానంగా ఉన్నాయి. నగరంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లీటరుకు 32.84 కిలోమీటర్లు, KTM 250 డ్యూక్ 34.14 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చింది. హైవేపై హీరో 39.21 కిలోమీటర్లు, KTM 39.66 కిలోమీటర్ల మైలేజ్ నమోదు చేసింది. అయితే KTMలో 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉండగా, హీరోలో 11.5 లీటర్ల ట్యాంక్ మాత్రమే ఉంది. దీంతో, ఫుల్ ట్యాంక్ చేస్తే KTM ఎక్కువ దూరం ప్రయాణించగలదు.

హ్యాండ్లింగ్ 
హ్యాండ్లింగ్ పరంగా రెండు బైక్‌లు మంచి అనుభూతిని అందించినప్పటికీ KTM 250 డ్యూక్ ఈ విభాగంలో ముందంజలో ఉంటుంది. కర్వ్‌లలో బైక్ చాలా స్థిరంగా ఉండటంతో పాటు మరింత ఆత్మవిశ్వాసంతో రైడ్ చేయవచ్చు. బ్రేకింగ్ & సస్పెన్షన్ పనితీరు కూడా KTMలో మరింత మెరుగ్గా ఉంటుంది. హీరోలో రియర్ బ్రేక్ పెడల్ కొంచెం దిగువన ఉండటం, గేర్ మార్పుల సమయంలో సరైన ఫీడ్‌బ్యాక్ లేకపోవడం & కొన్ని సందర్భాల్లో ఫాల్స్ న్యూట్రల్ సమస్య కనిపించడం చిన్న లోపాలుగా చెప్పొచ్చు.

ఇది కూడా చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవి? తొలి ఆరు నెలల టాప్ 15 లిస్ట్ విడుదల

కంఫర్ట్ 
కంఫర్ట్ పరంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 250R పైచేయి సాధిస్తుంది. వెడల్పైన & మెత్తని సీట్లు, మెరుగైన రైడింగ్ పొజిషన్, విశాలమైన సీట్ టు ఫుట్‌పెగ్ దూరం వల్ల ఎక్కువసేపు ప్రయాణించినా అలసట తక్కువగా ఉంటుంది. 806 మిల్లీమీటర్ల సీట్ హైట్ కూడా చాలామందికి అనుకూలంగా ఉంటుంది. మరోవైపు, KTM 250 డ్యూక్ కాంపాక్ట్ డిజైన్ కారణంగా పొడవైన రైడర్లకు అంత సౌకర్యంగా అనిపించదు. గట్టి సస్పెన్షన్ వల్ల చెడు రహదారులపై కూడా హీరో బైక్ మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

రేటు
ధరలో హీరో ఎక్స్‌ట్రీమ్ 250Rకు భారీ ఆధిక్యం ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.73 లక్షలు కాగా, KTM 250 డ్యూక్ ధర రూ.2.21 లక్షలు. అంటే హీరో బైక్ దాదాపు రూ.50 వేల వరకు తక్కువ ధరకే లభిస్తుంది. తక్కువ ధరలో వేగవంతమైన పనితీరు, మంచి కంఫర్ట్ కోరుకునే వారికి హీరో ఎక్స్‌ట్రీమ్ 250R మంచి ఎంపికగా కనిపిస్తుంది.

తుది నిర్ణయంలో మరో ముఖ్యమైన అంశం ఉంది. హీరో ప్రీమియా డీలర్ నెట్‌వర్క్ ఇంకా విస్తరిస్తున్న దశలోనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 135 ప్రీమియా షోరూమ్‌లు మాత్రమే ఉండగా, KTMకు 456కు పైగా షోరూమ్‌లు ఉన్నాయి. స్పేర్ పార్ట్స్ అందుబాటు, సర్వీస్ నెట్‌వర్క్ & దీర్ఘకాలిక విశ్వసనీయత పరంగా KTM ప్రస్తుతం మరింత నమ్మకమైన బ్రాండ్‌గా నిలుస్తోంది.

మొత్తంగా చూస్తే, హీరో ఎక్స్‌ట్రీమ్ 250R తక్కువ ధరలో అద్భుతమైన పనితీరు, మంచి కంఫర్ట్ అందించే విలువైన బైక్. కానీ ఫీచర్లు, నాణ్యత, హ్యాండ్లింగ్, సర్వీస్ నెట్‌వర్క్ & బ్రాండ్ విశ్వసనీయత విషయంలో KTM 250 డ్యూక్ ఇంకా ఒక అడుగు ముందే ఉంది. ప్రస్తుతం ఎలాంటి సందేహాలు లేకుండా కొనుగోలు చేయాలనుకునే వారికి KTM 250 డ్యూక్ సురక్షితమైన ఎంపికగా చెప్పవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

చలికాలంలో కారు తీసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ 5 యాక్సెసరీస్ ఉంటే టెన్షన్ ఉండదు!
ఈ చలికాలంలో కారు డ్రైవింగ్ సేఫ్‌గా సాగాలంటే.. ఈ 5 యాక్సెసరీస్ తప్పనిసరి!
గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!
బజాజ్ పల్సర్ 150 vs టీవీఎస్ అపాచీ 160.. మీ స్టైల్‌కి ఏది సరిగ్గా సెట్‌ అవుతుందో తెలుసా?
Bajaj Pulsar 150 వర్సెస్‌ TVS Apache RTR 160.. ఏ బైక్ బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల కంపారిజన్‌
Bajaj Chetak C2501: కంపెనీ చెప్పింది 113 కి.మీ. రేంజ్‌.. నిజంగా వెళ్లింది ఎంత దూరం?
Bajaj Chetak ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫుల్‌ ఛార్జ్‌తో నిజంగా ఎంతదూరం వెళ్లింది? రేంజ్ టెస్ట్‌ రిజల్ట్స్‌
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Embed widget