అన్వేషించండి

రూ.73,850 నుంచే హీరో విడా VX2 - ఏ వేరియంట్ కొనాలి? ఫీచర్లు, ధరల పూర్తి వివరాలు

హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధర, బ్యాటరీ, రేంజ్, టాప్ స్పీడ్, ఛార్జింగ్ సమయం, ఫీచర్లు & తెలుగు రాష్ట్రాల్లో ఆన్ రోడ్ ధరల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Vida VX2 Price, Variants And Features: హీరో మోటోకార్ప్ తన కొత్త విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్‌తో భారత మార్కెట్లో పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. స్టైలిష్ డిజైన్‌, బయటకు తీసి ఛార్జ్ చేసుకునే బ్యాటరీ, మంచి రేంజ్‌, మోడ్రన్‌ ఫీచర్లతో వచ్చిన ఈ స్కూటర్ మొత్తం 5 వేరియంట్లలో మనకు అందుబాటులో ఉంది. Go & Plus అనే రెండు సిరీస్‌లలో లభించే ఈ మోడళ్ల మధ్య బ్యాటరీ సామర్థ్యం, రేంజ్‌, ఫీచర్లు & పనితీరులో తేడాలు ఉన్నాయి.

హీరో విడా VX2 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.73,850 కాగా, టాప్ వేరియంట్ ధర రూ.94,800. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ఆన్ రోడ్ ధర సుమారు రూ.79,389 నుంచి రూ.1.02 లక్షల వరకు ఉంటుంది. మ్యాట్ లైమ్‌, మ్యాట్ వైట్‌, నెక్సస్ బ్లూ, పెర్ల్ బ్లాక్‌, పెర్ల్ రెడ్ అనే ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.

వేరియంట్ల వారీగా వివరాలు:

1. ఎంట్రీ లెవల్ VX2 Go 2.2 వేరియంట్‌లో 2.2 kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం 93 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు. 0 నుంచి 40 kmph వేగాన్ని 4.2 సెకన్లలో అందుకుంటుంది. ఇందులో 580W ఛార్జర్ లభిస్తుంది. బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 7 నిమిషాలు పడుతుంది. ముందు & వెనుక డ్రమ్ బ్రేక్‌లు, CBS, 4.3 అంగుళాల LCD డిస్‌ప్లే, Eco & Ride రైడింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. చిన్న బ్యాటరీ కారణంగా 33.2 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: కొత్త బర్గ్‌మన్ స్ట్రీట్ 125 రివ్యూ - స్టైలిష్ లుక్‌, 56 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌, కానీ ఈ లోపాలు కూడా ఉన్నాయి!

2. VX2 Go 2.2 వేరియంట్‌కు Go 2.2 RQ వేరియంట్‌కు మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. అయితే ఇందులో 1000W ఫాస్ట్ ఛార్జర్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. దీంతో 0 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి కేవలం 1 గంట 41 నిమిషాలే పడుతుంది.

3. VX2 Go 3.4 వేరియంట్‌లో 3.4 kWh బ్యాటరీ అందించారు. దీని ద్వారా IDC ప్రమాణాల ప్రకారం 146 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. టాప్ స్పీడ్ మాత్రం గంటకు 70 కిలోమీటర్లుగానే ఉంటుంది. 580W ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 4 గంటల 44 నిమిషాలు పడుతుంది. పెద్ద బ్యాటరీ కారణంగా అండర్‌సీట్ స్టోరేజ్ 27.2 లీటర్లకు తగ్గింది. మిగతా ఫీచర్లు Go 2.2తో సమానంగా ఉంటాయి.

4. VX2 Plus 3.4 వేరియంట్‌లో కూడా 3.4 kWh బ్యాటరీనే అందించారు. అయితే ఇందులో ముందు డిస్క్ బ్రేక్‌, వెనుక డ్రమ్ బ్రేక్‌, CBS, 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే లభిస్తాయి. Eco & Rideతో పాటు Sport రైడింగ్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. గరిష్ఠ వేగం గంటకు 80 కిలోమీటర్లకు పెరిగింది. 0 నుంచి 40 kmph వేగాన్ని కేవలం 3.1 సెకన్లలో అందుకుంటుంది.

ఇది కూడా చదవండి: E20 పెట్రోల్‌ను చవగ్గా ఇవ్వడం సర్కారు లక్ష్యం కాదట - ఇంకా ఏం చెప్పిందంటే?

5. టాప్ ఎండ్ VX2 Plus 4.4 వేరియంట్‌లో 4.4 kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది IDC ప్రమాణాల ప్రకారం 187 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో 1000W ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ 0 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 3 గంటల 17 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ వేరియంట్‌లో గంటకు 90 కిలోమీటర్ల గరిష్ఠ వేగం లభిస్తుంది. 0 నుంచి 40 kmph వేగాన్ని 3.1 సెకన్లలో చేరుకుంటుంది. Plus 3.4లో ఉన్న డిస్క్ బ్రేక్‌, TFT డిస్‌ప్లే & మూడు రైడింగ్ మోడ్‌లు ఇందులో కూడా కొనసాగించారు.

ఈ ఐదు వేరియంట్లలోనూ 6 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు IP67 ప్రమాణాలున్న 'తొలగించి ఛార్జ్ చేసుకునే' బ్యాటరీ ప్యాక్‌లను హీరో అందిస్తోంది. 

ఎవరికి ఏది బెస్ట్‌?

సిటీలోనే తిరగడానికి తక్కువ ధరలో స్కూటర్ కొనేవాళ్లకు Go 2.2 సరిపోతుంది. ఎక్కువ రేంజ్ అవసరమైతే Go 3.4 మంచి ఎంపిక అవుతుంది. వేగం, అదనపు ఫీచర్లు, TFT డిస్‌ప్లే కోరుకునేవారికి Plus 3.4 అనుకూలం. ఒకసారి ఛార్జ్ చేస్తే అత్యధిక రేంజ్‌తో పాటు అత్యుత్తమ పనితీరు కోరుకునే వినియోగదారులకు VX2 Plus 4.4 బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget