అన్వేషించండి

ఆడవాళ్లు కాళ్లను సులభంగా నేలపై ఉంచగల టూవీలర్లు - తక్కువ సీట్ హైట్‌ ఉన్న 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు

తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు, ఆడవాళ్ల కోసం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అతి తక్కువ సీట్ హైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితా ఇది. హోండా QC1 నుంచి బజాజ్ చేతక్ వరకు టాప్ 10 మోడళ్ల వివరాలు.

Lowest seat height electric scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే సమయంలో చాలామంది బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ధర వంటి అంశాలను మాత్రమే పరిశీలిస్తారు. అయితే తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు, ముఖ్యంగా ఆడవాళ్లకు సీట్ హైట్ కూడా అత్యంత కీలకమైన అంశం. ట్రాఫిక్‌లో తరచూ ఆగాల్సి వచ్చే పరిస్థితుల్లో రెండు కాళ్లను సులభంగా నేలపై ఉంచగలిగితే రైడింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతి తక్కువ సీట్ హైట్ కలిగిన టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితా ఇది.

ఈ జాబితాలో తొలి స్థానంలో హోండా QC1 నిలిచింది. ఇందులో కేవలం 704 మిల్లీమీటర్ల సీట్ హైట్ మాత్రమే ఉంది. 1.5kWh బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల IDC రేంజ్‌ను అందిస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 50 కిలోమీటర్లు. నగర ప్రయాణాలకు ఇది అనువైన ఎంపిక.

రెండో స్థానంలో BMW CE 02 ఉంది. ఇందులో 750 మిల్లీమీటర్ల సీట్ హైట్ ఉంటుంది. రెండు 1.96kWh బ్యాటరీ ప్యాక్‌లతో మొత్తం 3.92kWh సామర్థ్యం లభిస్తుంది. 108 కిలోమీటర్ల రేంజ్‌తో పాటు గంటకు 95 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందిస్తుంది.

ఇది కూడా చదవండి: IDC లెక్కకు భిన్నంగా యమహా EC-06 పనితీరు - ఒక్క ఛార్జ్‌తో ఎంత దూరం వెళ్లిందో తెలుసా?

763 మిల్లీమీటర్ల సీట్ హైట్‌తో TVS Orbiter & Bajaj Chetak C2501 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. TVS Orbiter V1 & V2 వేరియంట్‌లలో అందుబాటులో ఉండగా, Bajaj Chetak C2501 చేతక్ శ్రేణిలో అత్యంతస అందుబాటు ధర మోడల్‌గా నిలుస్తోంది.

765 మిల్లీమీటర్ల సీట్ హైట్‌తో Suzuki e-Access & Ampere Nexus కూడా మార్కెట్‌లో ఉన్నాయి. Suzuki e-Accessలో 95 కిలోమీటర్ల IDC రేంజ్ లభిస్తుంది. కీలెస్ యాక్సెస్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Ampere Nexus EX & ST వేరియంట్‌లలో విక్రయిస్తుండగా, డిస్‌ప్లే & కనెక్టివిటీ ఫీచర్లలో మాత్రమే తేడాలు ఉంటాయి.

770 మిల్లీమీటర్ల సీట్ హైట్‌తో TVS iQube, Kinetic DX & Yamaha EC-06 వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. TVS iQube ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కొనసాగుతోంది. Kinetic DX రెట్రో డిజైన్‌తో పాటు 37 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌ను అందిస్తుంది. Yamaha EC-06లో 24.5 లీటర్ల స్టోరేజ్ లభిస్తుంది. ఈ మూడు స్కూటర్లు కూడా తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ఇది కూడా చదవండి: మారుతి సుజుకి స్విఫ్ట్‌ కొనే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సినవి - ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి?

ఈ జాబితాలో 775 మిల్లీమీటర్ల సీట్ హైట్‌తో Bajaj Chetak C3001, C3501, C3502 & C3503 వేరియంట్‌లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఫీచర్లలో తేడాలు ఉన్నప్పటికీ సీట్ హైట్ మాత్రం అన్ని వేరియంట్‌లలో ఒకేలా ఉంటుంది.

సీట్ హైట్ పరంగా చూస్తే హోండా QC1 భారత మార్కెట్లో ప్రస్తుతం అత్యంత తక్కువ ఎత్తు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలుస్తోంది. అలాగే TVS iQube, Bajaj Chetak, Suzuki e-Access వంటి మోడళ్లు కూడా తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు, మహిళలకు మంచి ఎంపికలుగా చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే ముందు రేంజ్, బ్యాటరీ సామర్థ్యం మాత్రమే కాకుండా సీట్ హైట్‌ను కూడా పరిశీలిస్తే రోజువారీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget