అన్వేషించండి

IDC లెక్కకు భిన్నంగా యమహా EC-06 పనితీరు - ఒక్క ఛార్జ్‌తో ఎంత దూరం వెళ్లిందో తెలుసా?

యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్‌లో ఒక్క ఛార్జ్‌తో 114 కిలోమీటర్లు ప్రయాణించింది. బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ సమయం, పనితీరు & కొనుగోలు ముందు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు.

Yamaha EC-06 Price And Features: దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో యమహా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా EC-06ను పరిచయం చేసింది. రివర్ ఇండీ ఆధారంగా దీనిని రూపొందించినప్పటికీ, డిజైన్‌లో యమహా ప్రత్యేకతను ప్రతిబింబించేలా మార్పులు చేసింది. ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.71 లక్షలుగా ఉన్న ఈ స్కూటర్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ పడుతోంది. కంపెనీ ప్రకటించిన IDC రేంజ్ 169 కిలోమీటర్లు కాగా, తాజాగా నిర్వహించిన రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికరమైన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.

యమహా EC-06లో 4kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 6.7kW గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేసే మిడ్ మౌంటెడ్ మోటార్‌తో పనిచేస్తుంది. రియల్ వరల్డ్ టెస్ట్ సమయంలో స్కూటర్‌ను స్టాండర్డ్ రైడింగ్ మోడ్‌లో నడిపారు. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు డిస్‌ప్లేపై మిగిలిన రేంజ్ 93 కిలోమీటర్లుగా కనిపించింది. అయితే వాస్తవ ప్రయాణంలో ఈ స్కూటర్ మొత్తం 114 కిలోమీటర్లు ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ టెస్ట్ ప్రకారం ప్రతి 10 శాతం బ్యాటరీ ఛార్జ్ తగ్గినప్పుడు సగటున 11.4 కిలోమీటర్లు ప్రయాణించింది. మొత్తం లెక్క ప్రకారం, స్కూటర్ సామర్థ్యం ప్రతి kWh కి 28.5 కిలోమీటర్లుగా నమోదైంది. కంపెనీ చూపించిన డిస్‌ప్లే అంచనాతో పోలిస్తే వాస్తవ రేంజ్ ఎక్కువగా రావడం గమనార్హం. అయితే రైడింగ్ విధానం, టైర్ గాలి ఒత్తిడి, ట్రాఫిక్ పరిస్థితులు, వాతావరణం వంటి అంశాలపై రేంజ్ మారే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే

నగర ట్రాఫిక్‌లో తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో రీజెనరేటివ్ బ్రేకింగ్ ఎక్కువగా పనిచేయడం వల్ల బ్యాటరీ వినియోగం నెమ్మదిగా జరిగింది. హైవేపై ఎక్కువ వేగంతో నడిపినప్పుడు బ్యాటరీ వేగంగా తగ్గింది. ఇది అన్ని ఎలక్ట్రిక్ వాహనాల్లో సాధారణంగా కనిపించే లక్షణమే.

పనితీరు విషయానికి వస్తే బ్యాటరీ ఛార్జ్ 20 శాతం కంటే తక్కువకు వచ్చినా స్కూటర్ పనితీరులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఫ్లైఓవర్లను సులభంగా ఎక్కడం & ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయడం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగింది. బ్యాటరీ 10 శాతం కంటే తక్కువకు వచ్చిన తర్వాత మాత్రమే పనితీరులో స్వల్ప తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.

బ్యాటరీ ఛార్జ్ 5 శాతం కంటే తక్కువకు చేరుకున్నప్పుడు స్కూటర్ ఆటోమేటిక్‌గా ఎకో మోడ్‌కు మారింది. ఈ దశలో యాక్సిలరేషన్ & గరిష్ఠ వేగం తగ్గినా గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగింది. చివరకు బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిన తర్వాత స్కూటర్ ముందుకు కదల్లేదు. అయితే డిస్‌ప్లే, సీట్ రిలీజ్ & ఛార్జర్ రిలీజ్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఫంక్షన్లు మాత్రం పనిచేస్తూనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సీరియస్‌ రైడర్లకు బెస్ట్ బడ్జెట్ ఆప్షన్‌! రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ పూర్తి రివ్యూ

ఈ స్కూటర్ బరువు 132 కిలోలు కావడం మరో ప్రత్యేకత. ఇది దేశంలోని అత్యంత బరువైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటి. అలాగే, 14 అంగుళాల పెద్ద చక్రాలు & వెడల్పాటి టైర్లు ఉండటం వల్ల రైడ్ నాణ్యత మెరుగ్గా ఉన్నప్పటికీ రేంజ్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఛార్జింగ్ విషయంలో మాత్రం కొంత నిరాశ కలిగించే అంశం ఉంది. యమహా EC-06తో కేవలం 450W ఛార్జర్ మాత్రమే అందిస్తోంది. పూర్తిగా ఖాళీ అయిన బ్యాటరీని పూర్తి స్థాయిలో ఛార్జ్ చేయడానికి సుమారు 10 గంటలు పడుతుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు తమ రోజువారీ వినియోగానికి అనుగుణంగా ఛార్జింగ్ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే ప్రీమియం ఫీచర్లు, మంచి రియల్ వరల్డ్ రేంజ్ & స్థిరమైన పనితీరుతో యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!
బజాజ్ పల్సర్ 150 vs టీవీఎస్ అపాచీ 160.. మీ స్టైల్‌కి ఏది సరిగ్గా సెట్‌ అవుతుందో తెలుసా?
Bajaj Pulsar 150 వర్సెస్‌ TVS Apache RTR 160.. ఏ బైక్ బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల కంపారిజన్‌
Bajaj Chetak C2501: కంపెనీ చెప్పింది 113 కి.మీ. రేంజ్‌.. నిజంగా వెళ్లింది ఎంత దూరం?
Bajaj Chetak ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫుల్‌ ఛార్జ్‌తో నిజంగా ఎంతదూరం వెళ్లింది? రేంజ్ టెస్ట్‌ రిజల్ట్స్‌
బజాజ్‌ బైక్‌లపై దసరా ఆఫర్లు.. వేలల్లో ఆదా, పండగ ఖర్చులు వచ్చినట్లే!
దసరా వేళ బజాజ్ అదిరిపోయే ఆఫర్లు.. పల్సర్‌ బైక్‌లపై భారీగా డబ్బు ఆదా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Embed widget