అన్వేషించండి

సెకండ్‌హ్యాండ్ మహీంద్రా XUV 3XO కొనవచ్చా? కారులో ఈ లోపాలు కనిపిస్తున్నాయేమో ముందు చెక్‌ చేయండి

సెకండ్ హ్యాండ్ మహీంద్రా XUV 3XO కొనాలనుకునేవారు సస్పెన్షన్, ఇన్ఫోటైన్‌మెంట్, బ్రేకింగ్ సమస్యలతో పాటు సరైన వేరియంట్, ఇంజిన్ ఎంపిక, రీసేల్ విలువ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు.

Buying a used Mahindra XUV 3XO: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మహీంద్రా XUV 3XO ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2024లో XUV300 స్థానంలో వచ్చిన ఈ మోడల్ కేవలం ఫేస్‌లిఫ్ట్ మాత్రమే కాకుండా పూర్తిగా కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, ఆధునిక ఫీచర్లు & కొత్త పవర్‌ట్రెయిన్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంది. ప్రస్తుతం యూజ్డ్ కార్ల మార్కెట్లో కూడా ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఉంది. అయితే కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

బయటి డిజైన్‌లో ముందు భాగం బోల్డ్ లుక్‌తో ఆకర్షణీయంగా కనిపించినా, వెనుక భాగం కొద్దిగా చిన్నదిగా కనిపిస్తుంది. అయితే XUV300తో పోలిస్తే ఇది మరింత మెరుగ్గా ఉంటుంది. లోపలికి వస్తే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్, విశాలమైన క్యాబిన్, ఐదుగురు పెద్దలు సౌకర్యంగా కూర్చునే స్థలం ఈ వాహనం ప్రత్యేకతలు. బూట్ స్పేస్ మాత్రం ఈ విభాగంలో కొద్దిగా తక్కువగా ఉంటుంది.

మహీంద్రా ఈ మోడల్‌ను మూడు ఇంజిన్ ఎంపికలతో అందిస్తోంది. 111 hp 1.2 లీటర్ MPFi టర్బో పెట్రోల్, 131 hp 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ & 117 hp 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెట్రోల్ ఇంజిన్లు నగర వినియోగానికి అనువుగా ఉండగా, డీజిల్ ఇంజిన్ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా దాదాపు అన్ని ఇంజిన్లలో అందుబాటులో ఉండటం మరో ప్లస్ పాయింట్.

ఇది కూడా చదవండి: మారుతి సుజుకి స్విఫ్ట్‌ కొనే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సినవి - ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి?

ఫీచర్ల విషయానికి వస్తే, టాప్ వేరియంట్‌లో 10.25 అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay & Android Auto, వైర్‌లెస్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా, ADAS వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, ISOFIX, రియర్ డిస్క్ బ్రేకులు వంటి భద్రత ఫీచర్లు ప్రామాణికంగా లభిస్తాయి. అయితే ఫీచర్లు & ధర పరంగా AX5 వేరియంట్ చాలా మందికి సరైన ఎంపికగా చెప్పవచ్చు.

కొనే ముందు చూడాల్సిన విషయాలు

యూజ్డ్ XUV 3XO కొనుగోలు చేసే ముందు సస్పెన్షన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. గుంతలు లేదా ఎత్తుపల్లాలపై ప్రయాణించే సమయంలో సస్పెన్షన్ నుంచి రాట్లింగ్ లేదా థడ్డింగ్ శబ్దాలు వస్తున్నాయని కొంతమంది తెలిపారు. ఇది సాధారణంగా లోయర్ కంట్రోల్ ఆర్మ్ అరిగిపోవడం వల్ల సంభవించే అవకాశం ఉంది. టెస్ట్ డ్రైవ్ సమయంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించడం మంచిది.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా పరిశీలించాల్సిన మరో అంశం. కొన్నిసార్లు Apple CarPlay లేదా Android Auto డిస్‌కనెక్ట్ అవడం, స్క్రీన్ ఫ్రీజ్ కావడం, రివర్స్ కెమెరా బ్లాక్ స్క్రీన్ చూపించడం వంటి సమస్యలు నమోదయ్యాయి. కొనుగోలు చేసే ముందు మొబైల్ కనెక్టివిటీ, టచ్ రెస్పాన్స్ & సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వివరాలను చెక్ చేయాలి.

ఇది కూడా చదవండి: మాన్యువల్ నుంచి DCT వరకు - కార్లలో ఉండే అన్ని రకాల గేర్‌బాక్స్‌ల గురించి పూర్తి వివరాలు

బ్రేకింగ్ వ్యవస్థలో కూడా కొంతమంది వినియోగదారులు స్పాంజీ బ్రేక్ పెడల్ ఫీల్, హిస్సింగ్ సౌండ్స్‌ లేదా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అధికంగా స్పందించడం వంటి సమస్యలను గుర్తించారు. అందువల్ల అధికారిక సర్వీస్ సెంటర్‌లో బ్రేకింగ్ వ్యవస్థను పరీక్షించించుకోవడం మంచిది.

మహీంద్రా XUV 3XOకు 3 సంవత్సరాలు లేదా ఒక లక్ష కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. దీనిని 5 సంవత్సరాలు లేదా లక్షా యాభై వేల కిలోమీటర్ల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది. యూజ్డ్ మోడల్ కొనుగోలు చేసే సమయంలో ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉన్న వాహనాన్ని ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో అదనపు భరోసా ఉంటుంది.

ప్రస్తుతం యూజ్డ్ మార్కెట్లో ఈ మోడల్ ధర సుమారు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంది. మంచి కండిషన్‌లో ఉన్న వాహనాన్ని ఎంపిక చేసుకోవడం & రూ.10 లక్షలకు మించి ఖర్చు చేయకుండా ఉండటం ఉత్తమ నిర్ణయంగా నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget