అన్వేషించండి

మారుతి సుజుకి స్విఫ్ట్‌ కొనే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సినవి - ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏంటి?

Maruti Suzuki Swift కొనాలనుకుంటున్నారా? అద్భుతమైన మైలేజ్, డ్రైవింగ్ అనుభవం, ఫీచర్లు ఆకట్టుకుంటున్నా.. ఇంజిన్ పనితీరు, AMT గేర్‌బాక్స్ & ధర విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయి.

Maruti Suzuki Swift Price And Features: భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్‌ ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన మైలేజ్, నగర రోడ్లపై సులభమైన డ్రైవింగ్ అనుభవం & విశ్వసనీయత కారణంగా ఈ కారు చాలా మంది తొలి ఎంపికగా నిలుస్తోంది. అయితే ప్రతి కారులోలాగే స్విఫ్ట్‌లో కూడా కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉన్నాయి. కాబట్టి ఈ కారును కొనుగోలు చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన మూడు ప్రధాన ప్లస్‌లు & మూడు మైనస్‌లు ఇవే.

కొనడానికి మొదటి కారణం.. అద్భుతమైన మైలేజ్

Swiftకు ఉన్న అతి పెద్ద బలం దాని ఇంధన సామర్థ్యం. ఇందులో 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది రోజువారీ వినియోగంలో తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందించారు. వాస్తవ డ్రైవింగ్ పరీక్షల్లో మాన్యువల్ వేరియంట్ నగరంలో లీటర్‌కు 14 కిలోమీటర్లు, హైవేపై లీటర్‌కు 19 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చింది. AMT వేరియంట్ నగరంలో 12.7 కిలోమీటర్లు & హైవేపై 19.1 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించింది. తేలికైన క్లచ్, సాఫీగా పనిచేసే 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & ఆటోమేటిక్ స్టాప్-స్టార్ట్ వ్యవస్థ వల్ల ట్రాఫిక్‌లో కూడా ఇంధన వినియోగం తగ్గుతుంది.

కొనడానికి రెండో కారణం.. డ్రైవింగ్ అనుభవం

డ్రైవింగ్‌ను ఇష్టపడే వారికి Swift మంచి అనుభూతిని అందిస్తుంది. స్టీరింగ్ స్పందన కచ్చితంగా ఉండటంతో పాటు మలుపుల్లో కూడా మంచి నియంత్రణ లభిస్తుంది. బాడీ రోల్ తక్కువగా ఉండటం వల్ల హైవేలపై నమ్మకంగా నడపవచ్చు. చిన్న పరిమాణం కారణంగా నగర ట్రాఫిక్‌లో కూడా సులభంగా మలుపులు తిప్పవచ్చు. బ్రేకింగ్ పనితీరు కూడా విశ్వాసాన్ని కలిగిస్తుంది. అయితే పెద్ద గుంతలు లేదా గతుకుల రోడ్లపై ప్రయాణించినప్పుడు కొన్ని ప్రత్యర్థి కార్లతో పోలిస్తే షాక్‌లు కొంత ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: పాత వాహనాల ఓనర్లకు షాక్‌ - ప్యూర్ పెట్రోల్‌, E10 ఆప్షన్లు లేవు, E20 మాత్రమే ఉంటుందన్న కేంద్రం

కొనడానికి మూడో కారణం... ఫీచర్లు & సౌకర్యం

Swiftలో డ్రైవర్‌కు సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్, ముందు సీట్లలో మంచి సపోర్ట్ & ఇద్దరు పెద్దలు కూర్చునేందుకు సరిపడే వెనుక సీటు స్థలం లభిస్తుంది. 265 లీటర్ల బూట్ స్పేస్ రోజువారీ అవసరాలకు సరిపోతుంది. టాప్ వేరియంట్లలో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Android Auto & Apple CarPlay, వైర్‌లెస్ ఛార్జర్, వెనుక AC వెంట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా ఇవ్వడం మరో ప్రధాన ఆకర్షణ.

దూరంగా ఉండడానికి మొదటి కారణం.. ఇంజిన్ పనితీరు

Swiftలోని 1.2 లీటర్ మూడు సిలిండర్ల ఇంజిన్ మైలేజ్ పరంగా అద్భుతంగా ఉన్నా, పనితీరు విషయంలో అంతగా ఆకట్టుకోదు. 82 hp పవర్ & 112 Nm టార్క్ నగర ప్రయాణాలు & సాధారణ హైవే డ్రైవింగ్‌కు సరిపోతాయి. అయితే వేగవంతమైన యాక్సిలరేషన్ కోరుకునే వారికి.. మధ్యస్థాయి వేగం నుంచి అధిక వేగానికి వెళ్లే సమయంలో పనితీరు కొంత తక్కువగా అనిపించవచ్చు. అలాగే, కారును నడపకుండా ఇంజిన్ ఆన్‌ చేసినప్పుడు స్వల్ప వైబ్రేషన్లు కూడా గమనించవచ్చు.

ఇది కూడా చదవండి: బైక్ నడిపేవారు హెల్మెట్‌ పెట్టుకునేటప్పుడ్డు జాగ్రత్త! ఈ పొరపాట్లు చేస్తే చలాన్ ఖాయం!

దూరంగా ఉండడానికి రెండో కారణం.. AMT గేర్‌బాక్స్

ట్రాఫిక్‌లో AMT వేరియంట్ సౌకర్యంగా ఉన్నప్పటికీ వేగంగా యాక్సిలరేట్ చేసినప్పుడు గేర్ మార్పులు నెమ్మదిగా జరుగుతాయి. దీంతో డ్రైవింగ్ అనుభవం కొంత తగ్గుతుంది. మరింత సాఫీ ఆటోమేటిక్ అనుభవం కోరుకునే వారికి CVT, DCT లేదా టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఉన్న ప్రత్యామ్నాయ కార్లు మెరుగైన ఎంపికగా ఉండవచ్చు.

దూరంగా ఉండడానికి మూడో కారణం.. టాప్ వేరియంట్ల ధర

Swift టాప్ వేరియంట్ల ధర పెద్ద ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరలకు దగ్గరగా ఉంటుంది. అదే ధరలో ఎక్కువ క్యాబిన్ స్థలం, మెరుగైన ఇంటీరియర్ నాణ్యత & మరింత ప్రీమియం అనుభూతిని అందించే ప్రత్యామ్నాయాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. Swiftలో ఫీచర్లు బాగున్నప్పటికీ ఇంటీరియర్‌లో హార్డ్ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల ప్రీమియం ఫీలింగ్ కొంత తగ్గుతుంది. అందుకే టాప్ వేరియంట్ కొనాలనుకునే వారు ఇతర కార్లతో పోల్చి నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.10 లక్షల లోపులో బలెనో - రూ.10.75 లక్షల ఆల్ట్రోజ్‌.. టెక్నాలజీ, ఫీచర్లలో ఏ కారు బెటర్‌?
మారుతి బలెనో vs టాటా ఆల్ట్రోజ్‌.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ప్రత్యేకత ఏంటి?
పల్సర్‌ NS200, N250 బైకులకు యూత్‌ మెచ్చే అప్‌డేట్స్‌.. కొత్త డిస్‌ప్లే, సస్పెన్షన్‌ ప్రత్యేకతలు ఇవే!
బజాజ్‌ పల్సర్‌ NS200, N250 బైకులకు కొత్త వెర్షన్లు.. ఫోటోలు లీక్‌
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
హెల్మెట్ బయట శుభ్రంగా ఉంటే సరిపోదు.. లోపల ఇలా క్లీన్ చేయకపోతే ఇబ్బందులే!
హెల్మెట్ పెట్టుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఆరోగ్య సమస్యలు!
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Embed widget