అన్వేషించండి

పాత వాహనాల ఓనర్లకు షాక్‌ - ప్యూర్ పెట్రోల్‌, E10 ఆప్షన్లు లేవు, E20 మాత్రమే ఉంటుందన్న కేంద్రం

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ మాత్రమే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్యూర్ పెట్రోల్‌, E10ను అందుబాటులో ఉంచడం ఖర్చుతో కూడుకున్నదని స్పష్టం చేసింది. పాత వాహనాలపై కూడా కీలక వివరణ ఇచ్చింది.

E20 Petrol News: దేశవ్యాప్తంగా ప్యూర్ పెట్రోల్‌, E10 & E20 అనే మూడు రకాల పెట్రోల్‌ను ఒకేసారి అందుబాటులో ఉంచే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌నే ప్రామాణిక ఇంధనంగా కొనసాగిస్తామని కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మూడు రకాల పెట్రోల్‌ను ఒకేసారి సరఫరా చేయాలంటే భారీగా మౌలిక సదుపాయాలు అవసరమవుతాయని, దీనివల్ల వ్యయభారం పెరగడంతో పాటు పంపిణీ వ్యవస్థ కూడా క్లిష్టంగా మారుతుందని పేర్కొంది.

జులై 10న విడుదల చేసిన ప్రశ్నలు-సమాధానాల రూపంలోని వివరణలో కేంద్రం తన నిర్ణయానికి గల కారణాలను వివరించింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్ బంకులు, రిఫైనరీలు, డిపోలు, టెర్మినల్స్‌, పైప్‌లైన్లు & నిల్వ కేంద్రాల ద్వారా ఇంధన పంపిణీ జరుగుతోందని తెలిపింది. ఇలాంటి భారీ వ్యవస్థలో ప్యూర్ పెట్రోల్‌, E10 & E20లను వేర్వేరుగా నిల్వ చేసి పంపిణీ చేయడం వల్ల అదనపు గిడ్డంగులు, ప్రత్యేక నిల్వ ట్యాంకులు, వేర్వేరు సరఫరా వ్యవస్థలు అవసరమవుతాయని వెల్లడించింది.

ప్రీమియం పెట్రోల్‌ కూడా మార్కెట్లో లభిస్తోందని కొందరు చేస్తున్న వాదనలను కూడా కేంద్రం కొట్టిపారేసింది. ప్రీమియం పెట్రోల్‌ను చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే కొద్దిమంది వినియోగిస్తారని, దానికి ప్రత్యేక దేశవ్యాప్త సరఫరా వ్యవస్థ అవసరం ఉండదని వివరించింది. అయితే E20 మాత్రం దేశవ్యాప్తంగా వినియోగించే ప్రధాన ఇంధనమని పేర్కొంది.

ఇది కూడా చదవండి: బైక్ నడిపేవారు హెల్మెట్‌ పెట్టుకునేటప్పుడ్డు జాగ్రత్త! ఈ పొరపాట్లు చేస్తే చలాన్ ఖాయం!

ఇథనాల్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కూడా మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. డిస్టిలరీలు, నిల్వ కేంద్రాలు, రవాణా వ్యవస్థలు & ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. ఇప్పుడు మళ్లీ E10ను ప్రామాణిక ఇంధనంగా తీసుకొస్తే రైతులు, సహకార సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు & ఆర్థిక సంస్థలు చేసిన పెట్టుబడులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం నవంబర్ 2025 నుంచి జూన్ 2026 వరకు దేశంలో సగటున 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని సాధించింది. అంతకుముందు సరఫరా సంవత్సరంలో ఈ స్థాయి 19.2 శాతంగా నమోదైందని తెలిపింది. దీంతో ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోందని కేంద్రం అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో చెట్టు కూలి డ్యామేజ్ అయితే మీ కారుకు బీమా ఎలా పొందాలి?

E10కు అనుగుణంగా తయారైన పాత వాహనాల యజమానుల్లో ఉన్న ఆందోళనలపై కూడా కేంద్రం స్పందించింది. E20 అమలుకు ముందు వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీదారులు, పరీక్షా సంస్థలు & పరిశోధన సంస్థలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇంజిన్ పనితీరు, ఇంధన వ్యవస్థ, విడిభాగాల మన్నిక, ఉద్గారాలు & ఇంధన వినియోగంపై సమగ్ర పరిశీలన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మారుతి సుజుకి అందించిన వివరాల ప్రకారం FY2025-26లో సర్వీస్‌కు వచ్చిన 2.84 కోట్ల వాహనాల్లో దాదాపు 1.5 కోట్ల పాత వాహనాలు E20కు మొదట అనుమతించబడనివేనని తెలిపింది. అయినప్పటికీ E20 వల్ల తుప్పు పట్టడం, అసాధారణంగా విడిభాగాలు దెబ్బతినడం లేదా వాటి జీవితకాలం తగ్గినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది. హీరో మోటోకార్ప్ కూడా ఇదే తరహా అనుభవాన్ని వెల్లడించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే E20 వాడటం వల్ల కొన్ని వాహనాల్లో ఇంధన సామర్థ్యం 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంగీకరించింది. అయితే అధిక ఆక్టేన్ విలువ, ముడి చమురు దిగుమతుల తగ్గుదల, కాలుష్య ఉద్గారాల నియంత్రణ వంటి ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కాగా, బహుళ రకాల పెట్రోల్‌ను అందుబాటులో ఉంచడం వల్ల వచ్చే అదనపు వ్యయం & వినియోగదారులకు కలిగే ప్రయోజనాలపై స్వతంత్ర విశ్లేషణను మాత్రం ఈ వివరణలో ప్రభుత్వం వెల్లడించలేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget