అన్వేషించండి

తెలుగు రాష్ట్రాల్లో టాటా సియెర్రా EV ఫైనల్‌గా ఎంతకు వస్తుంది? ఆన్‌రోడ్‌ ధరలు, EMI వివరాలు ఇవిగో

వివిధ నగరాల్లో టాటా సియెర్రా EV ఆన్‌రోడ్ ధరలు, 10% డౌన్‌పేమెంట్‌తో 7 ఏళ్ల రుణ కాలానికి నెలవారీ EMI ఎంతవుతుందో తెలుసుకోండి.

Tata Sierra EV on-road price, Hyderabad: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, ఇటీవలే తన కొత్త టాటా సియెర్రా EVని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ఇది రెండో AWD మోడల్ కావడం విశేషం. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తిమంతమైన బ్యాటరీ ఎంపికలతో ఈ కొత్త EV కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ కారు ధర ఎంత ఉంటుంది? 10% డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే నెలకు ఎంత EMI చెల్లించాలి? అనే విషయాలు తెలుసుకోవాలనుకునే వారికి ఇవి ముఖ్యమైన వివరాలు.

టాటా సియెర్రా EVను కంపెనీ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్యూర్, ప్యూర్ ఎస్, అడ్వెంచర్, ఎంపవర్డ్ & ఎంపవర్డ్ ఏ పేర్లతో ఈ వేరియంట్లు విక్రయిస్తున్నారు. వీటి ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల వరకు ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ SUVలో 63kWh & 75kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. రెండు బ్యాటరీలకూ RWD వేరియంట్లు లభిస్తుండగా, 75kWh బ్యాటరీ ఆప్షన్‌లో AWD వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఎక్కువ పనితీరు కోరుకునేవాళ్లకు ఇది మరింత మెరుగైన ఎంపిక అవుతుంది.

హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర
హైదరాబాద్‌లో టాటా సియెర్రా EV ఆన్‌రోడ్ ధర రూ.19.92 లక్షల నుంచి రూ.27.69 లక్షల వరకు ఉంది. వేరియంట్‌ను బట్టి ఈ ధర మారుతుంది. ఇందులో బీమా, RTO ఛార్జీలు, FASTag & ఇతర నగరానికి సంబంధించిన అదనపు వ్యయాలు కూడా ఉంటాయి. అందువల్ల తుది ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

EMI లెక్క
ఈ కారును 10% డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేసి, 7 సంవత్సరాల రుణ కాలాన్ని ఎంచుకుంటే నెలకు సుమారు రూ.28,799 EMI చెల్లించాల్సి ఉంటుంది. అయితే వడ్డీ రేటు, బ్యాంకు నిబంధనలు & ఎంచుకునే వేరియంట్ ఆధారంగా EMIలో మార్పులు ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌

ఇతర ప్రధాన నగరాల ధరలను పరిశీలిస్తే... కోల్‌కతాలో టాటా సియెర్రా EV అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. అక్కడ 63kWh RWD వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.19.39 లక్షల నుంచి ప్రారంభమై రూ.23.43 లక్షల వరకు ఉంది. 75kWh RWD వేరియంట్ ధర రూ.22.82 లక్షల నుంచి రూ.25.95 లక్షల వరకు ఉండగా, టాప్ ఎండ్ 75kWh AWD వేరియంట్ ధర రూ.26.66 లక్షలుగా ఉంది.

చెన్నైలో 63kWh RWD వేరియంట్ ధర రూ.20.13 లక్షల నుంచి రూ.24.31 లక్షల వరకు ఉంది. 75kWh RWD ధర రూ.22.69 లక్షల నుంచి రూ.26.41 లక్షల వరకు ఉండగా, AWD వేరియంట్ ధర రూ.27.66 లక్షలుగా నమోదైంది.

ముంబైలో ఈ కారు ధర మరింత ఎక్కువగా ఉంది. అక్కడ 63kWh RWD వేరియంట్ రూ.20.19 లక్షల నుంచి రూ.24.38 లక్షల వరకు ఉండగా, 75kWh RWD వేరియంట్ ధర రూ.23.75 లక్షల నుంచి రూ.26.91 లక్షల వరకు ఉంది. టాప్ ఎండ్ 75kWh AWD వేరియంట్ ఆన్‌రోడ్ ధర రూ.28.19 లక్షలకు చేరుకుంది.

ఇది కూడా చదవండి: యమహా నుంచి ప్రీమియం స్పోర్టీ ఎలక్ట్రిక్‌ స్కూటర్ - Aerox Electric ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ధరలను పోలిస్తే, కోల్‌కతాలో టాప్ స్పెక్ 63kWh RWD వేరియంట్ ముంబైతో పోలిస్తే సుమారు రూ.95 వేల వరకు తక్కువగా ఉంది. అలాగే 75kWh RWD వేరియంట్ దాదాపు రూ.96 వేల తక్కువ ధరకు లభిస్తోంది. టాప్ ఎండ్ AWD వేరియంట్ విషయంలో ఈ తేడా ఏకంగా రూ.1.53 లక్షల వరకు ఉంది.

మీరు టాటా సియెర్రా EV కొనాలనుకుంటే, మీ నగరంలోని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సంప్రదించి తాజా ఆన్‌రోడ్ ధరలు, బీమా, ఫైనాన్స్ ఆఫర్లు & EMI వివరాలను ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది. నగరాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బీమా ప్రీమియం & ఇతర ఖర్చుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget