అన్వేషించండి

మారుతి కారు కొనాలనుకుంటున్నారా? ఈ నెలలో రూ.2.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!

మారుతి సుజుకి, నెక్సా కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. Invictoపై రూ.2.10 లక్షల వరకు, Grand Vitaraపై రూ.95 వేల వరకు & ఇతర మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Maruti Cars July 2026 Offers: జులై నెలలో కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మారుతి సుజుకి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రీమియం నెక్సా (Nexa) శ్రేణిలో కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ & కార్పొరేట్ బెనిఫిట్స్‌ను అందిస్తోంది. అయితే ఎక్స్ఛేంజ్ & స్క్రాపేజ్ బెనిఫిట్స్ రెండింటినీ ఒకేసారి పొందే అవకాశం లేదు. అలాగే లాయల్టీ బోనస్ ఇప్పటికే మారుతి కారు కలిగినవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ నెలలో అత్యధిక ప్రయోజనం Maruti Invicto కొనుగోలుదారులకు లభిస్తోంది. ఈ ప్రీమియం MPVపై మొత్తం రూ.2.10 లక్షల వరకు బెనిఫిట్స్‌ను కంపెనీ అందిస్తోంది. ఇందులో రూ.50 వేల వరకు నగదు తగ్గింపు, రూ.1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.50 వేల లాయల్టీ బోనస్ & రూ.10 వేల కార్పొరేట్ బెనిఫిట్ ఉన్నాయి. ప్రస్తుతం Invicto ధర రూ.24.97 లక్షల నుంచి రూ.28.60 లక్షల వరకు ఉంది.

Maruti Grand Vitaraపై కూడా భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Sigma పెట్రోల్ MT వేరియంట్‌పై గరిష్టంగా రూ.95 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. Delta పెట్రోల్ వేరియంట్‌పై రూ.85 వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. Zeta & Alpha పెట్రోల్ వేరియంట్‌లపై రూ.25 వేల నగదు తగ్గింపుతో పాటు ఉచితంగా 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీని కంపెనీ అందిస్తోంది.

ఇది కూడా చదవండి: భారత్‌లోకి Volkswagen Tayron కొత్త వేరియంట్‌ రాక ఖరారు - తక్కువ ధరతో అదిరే ఫీచర్లు!

Grand Vitara స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌లపై జీరో రోడ్ ట్యాక్స్ బెనిఫిట్‌తో పాటు 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ, రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.30 వేల అప్‌గ్రేడ్ లాయల్టీ బోనస్ & రూ.10 వేల కార్పొరేట్ బెనిఫిట్ కూడా లభిస్తున్నాయి. Delta CNG & Zeta CNG వేరియంట్‌లపై మొత్తం రూ.90 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. Grand Vitara ధర ప్రస్తుతం రూ.10.76 లక్షల నుంచి రూ.19.72 లక్షల వరకు ఉంది.

ఆఫ్ రోడ్ ప్రియులకు నచ్చే Maruti Jimnyపై కూడా కంపెనీ రూ.45 వేల వరకు నగదు తగ్గింపును కొనసాగిస్తోంది. అన్ని వేరియంట్‌లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. Jimny ధర రూ.12.39 లక్షల నుంచి రూ.14.52 లక్షల వరకు ఉంది.

కుటుంబ అవసరాలకు అనువైన Maruti XL6పై రూ.45 వేల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.20 వేల వరకు నగదు తగ్గింపుతో పాటు రూ.25 వేల వరకు స్క్రాపేజ్ బోనస్ లభిస్తోంది. ఈ ఆఫర్ పెట్రోల్ & CNG వేరియంట్‌లకు వర్తిస్తుంది. XL6 ధర రూ.11.57 లక్షల నుంచి రూ.14.52 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి: 1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ Maruti Baleno కొనుగోలుదారులకు కూడా కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. పెట్రోల్ మాన్యువల్ & AMT వేరియంట్‌లపై రూ.40 వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. CNG వేరియంట్‌లపై రూ.35 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. Baleno ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.17 లక్షల వరకు ఉంటుంది.

కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ Maruti Fronxపై గరిష్టంగా రూ.25 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. టర్బో పెట్రోల్ వేరియంట్‌లపై రూ.10 వేల నగదు తగ్గింపు & రూ.15 వేల స్క్రాపేజ్ బోనస్ అందిస్తున్నారు. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ & CNG వేరియంట్‌లపై నగదు తగ్గింపు లేకపోయినా రూ.15 వేల వరకు స్క్రాపేజ్ బోనస్ అందుబాటులో ఉంది. Fronx ధర రూ.6.85 లక్షల నుంచి రూ.11.84 లక్షల వరకు ఉంది.

కొత్త Maruti కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి జూలై నెల మంచి అవకాశం. ముఖ్యంగా Grand Vitara, Invicto వంటి ప్రీమియం మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంది. నగరాన్ని బట్టి & స్టాక్ లభ్యతను బట్టి ఆఫర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది, కొనే ముందు మీ సమీప Nexa డీలర్‌ను సంప్రదించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget