అన్వేషించండి

సెకండ్‌హ్యాండ్‌ EV కొనేవారికి గుడ్‌న్యూస్ - బ్యాటరీ హెల్త్ సర్టిఫికేట్‌తో అందుబాటులోకి MG ఎలక్ట్రిక్ కార్లు

సెకండ్‌హ్యాండ్‌ MG ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు & విక్రయాన్ని సులభతరం చేసేందుకు ఎంజీ మోటార్ ఇండియా స్పిన్నీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

How To Buy An Used Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సెకండ్‌హ్యాండ్ EV మార్కెట్‌ను మరింత విశ్వసనీయంగా మార్చేందుకు ఎంజీ మోటార్ ‍ఇండియా ‌(MG Motor India) కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్‌హ్యాండ్‌ కార్ల విక్రయ వేదిక అయిన స్పిన్నీ (Spinny)తో వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా... సర్టిఫైడ్ ప్రి ఓన్డ్ MG ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు & విక్రయం మరింత సులభం కానుంది.

ప్రస్తుతం సెకండ్‌హ్యాండ్ EV కొనుగోలులో వినియోగదార్లను ఎక్కువగా ఆందోళనకు గురిచేసే అంశాలు - బ్యాటరీ హెల్త్, మిగిలిన బ్యాటరీ సామర్థ్యం, వాహనం అసలు విలువ & భవిష్యత్తులో పనితీరు. ఈ సందేహాలకు పరిష్కారం చూపడమే ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా ఎంజీ మోటార్ & స్పిన్నీ వెల్లడించాయి.

బ్యాటరీ హెల్త్ సర్టిఫికేట్‌
ఈ ఒప్పందం ప్రకారం స్పిన్నీ తన నెట్‌వర్క్‌లో ప్రత్యేక EV తనిఖీ విధానాన్ని అమలు చేయనుంది. ఎంజీ మోటార్ సాంకేతిక సహకారంతో బ్యాటరీ హెల్త్‌ను శాస్త్రీయంగా పరీక్షించి సర్టిఫికేట్ జారీ చేయనుంది. దీంతో వాహనం కొనుగోలు చేసే వారికి బ్యాటరీ స్థితిపై స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. విక్రేతలకు కూడా వాహనం విలువను పారదర్శకంగా నిర్ణయించే అవకాశం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: EV కొనాలనుకుంటున్నారా? BaaS స్కీమ్‌తో లక్షల రూపాయలు ఆదా - పూర్తి జాబితా ఇదే

మొదటి దశలో... హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ NCR, కొచ్చి, ముంబై, పుణే, జైపూర్, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, చండీగఢ్ & కోయంబత్తూరు నగరాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నారు. తరువాత ఇతర నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు MG Comet EV, MG Windsor EV & MG ZS EV వంటి సర్టిఫైడ్ ప్రి ఓన్డ్ ఎలక్ట్రిక్ కార్లను స్పిన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ లేదా ఈ కంపెనీ కార్ హబ్‌ల ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు. అలాగే తమ వాహనాలను విక్రయించాలనుకునే వారు కూడా ఇదే వేదికను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాట్‌ఫామ్‌లో విక్రయానికి వచ్చే ప్రతి ఎలక్ట్రిక్ కారుపై 200 పాయింట్ల సమగ్ర తనిఖీని నిర్వహిస్తారు. బ్యాటరీ స్థితితో పాటు వాహనం మొత్తం పనితీరును పరిశీలించిన తర్వాత మాత్రమే విక్రయానికి అనుమతిస్తారు. అలాగే కంపెనీ వారంటీ కొనసాగింపు, ఫిక్స్‌డ్ ప్రైస్ విధానం & కొనుగోలు చేసిన తర్వాత ఐదు రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: మిడ్‌సైజ్ SUV మార్కెట్‌లోకి వస్తున్న నిస్సాన్ టెక్టాన్ - ఈ 13వ మోడల్‌ నుంచి ఏమేం ఆశించవచ్చు?

స్పిన్నీ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ రిస్టోరేషన్ సెంటర్లలో ఈ కార్లను ప్రత్యేకంగా రీకండిషన్ చేయనున్నారు. ఇందుకోసం ఆధునిక EV డయాగ్నస్టిక్ పరికరాలు, బ్యాటరీ రిస్టోరేషన్ టెక్నాలజీతో ఈ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో సెకండ్‌హ్యాండ్ ఎలక్ట్రిక్ కార్లు కూడా కొత్త కార్ల మాదిరిగా నాణ్యత ప్రమాణాలు అందుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

దేశంలో కొత్త తరం ఎనర్జీ వాహనాల విస్తరణకు విశ్వసనీయమైన సెకండ్‌హ్యాండ్ మార్కెట్ కూడా ఎంతో కీలకం - ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా 

బ్యాటరీ డయాగ్నస్టిక్స్‌లో పారదర్శకత తీసుకురావడం ద్వారా సెకండ్‌హ్యాండ్ EV మార్కెట్‌పై వినియోగదారుల విశ్వాసం మరింత పెరుగుతుంది - స్పిన్నీ వ్యవస్థాపకుడు & CEO నీరజ్ సింగ్

ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో ఇప్పటివరకు బ్యాటరీ హెల్త్ ప్రధాన సందేహంగా ఉండేది. ఇప్పుడు ఎంజీ మోటార్ & స్పిన్నీ భాగస్వామ్యంతో ఆ భయాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. దీంతో సెకండ్‌హ్యాండ్ EV మార్కెట్‌కు కొత్త ఊపు రావడంతో పాటు మరింత మంది వినియోగదారులు ధైర్యంగా ఎలక్ట్రిక్ కార్లను ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget