అన్వేషించండి

Triumph 350cc రేంజ్‌పై మరో ధరల భారం - ఏ మోడల్‌కు ఎంత పెరిగిందో తెలుసా?

Triumph 350cc రేంజ్‌లోని అన్ని మోడళ్ల ధరలను మరోసారి పెంచింది. తాజా ధరలు, ఏ మోడల్‌కు ఎంత పెరిగిందో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Triumph bikes prices hiked again: దేశీయ మార్కెట్లో ప్రీమియం మిడ్-కెపాసిటీ మోటార్‌సైకిళ్లకు మంచి ఆదరణ లభిస్తున్న వేళ, ట్రయంఫ్ తన 350cc రేంజ్‌పై మరోసారి ధరలను పెంచింది. జూన్‌లో ధరల సవరణ చేసిన ఈ కంపెనీ, ఆ తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరోసారి అన్ని మోడళ్ల ధరలను పెంచడం గమనార్హం. దీంతో ఈ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న మొత్తం ఆరు మోడళ్లు ఇప్పుడు మరింత ఖరీదయ్యాయి.

GST తగ్గింపు అమల్లోకి వచ్చిన తర్వాత ట్రయంఫ్ తన 399cc ఇంజిన్‌ను 350cc ఇంజిన్‌గా మారుస్తూ ధరలను తగ్గించింది. అయితే, ఇప్పుడు వరుసగా రెండోసారి ధరలు పెరగడంతో, కొన్ని మోడళ్లు 399cc ఇంజిన్‌తో విక్రయించిన సమయంలో ఉన్న ధరల కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ధరకు చేరుకున్నాయి.

తాజా ధరల పెంపులో అత్యధిక ప్రభావం Triumph Speed T4 పై పడింది. ఈ మోడల్ ధర ఏకంగా రూ.10,000 పెరిగి రూ.2.09 లక్షలకు చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరతో పోలిస్తే ఇప్పుడు ఈ బైక్ మొత్తం రేటు రూ.14,000 పైకి చేరింది. ఒకప్పుడు ధర పెంపు నుంచి తప్పించుకున్న ఈ మోడల్‌కు ఇప్పుడు భారీ పెంపు వర్తించడం కొనుగోలుదారులకు షాక్‌గా మారింది.

ఇది కూడా చదవండి: హీరో Xoom 110 ధర, వేరియంట్లు, ఫీచర్లు - కొనే ముందే తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు

Triumph Speed 400 ధర కూడా పెరిగింది. ఈ మోడల్‌పై సుమారు రూ.6,000 పెంపు చేసి కొత్త ధరను రూ.2.40 లక్షలుగా నిర్ణయించారు. అదే విధంగా అడ్వెంచర్ స్టైల్‌ను ఇష్టపడే వారికి అందుబాటులో ఉన్న Triumph Scrambler 400 X ధర కూడా సుమారు రూ.6,000 పెరిగి రూ.2.65 లక్షలకు చేరుకుంది.

ప్రీమియం వేరియంట్‌గా ఉన్న Triumph Scrambler 400 XC ధర సుమారు రూ.5,000 పెరిగి ఇప్పుడు రూ.2.99 లక్షలకు విక్రయించబడుతోంది. మరోవైపు క్లాసిక్ కేఫే రేసర్ స్టైల్‌తో వచ్చిన Triumph Thruxton 400 ధర కూడా సుమారు రూ.5,000 పెరిగి రూ.2.75 లక్షలకు చేరింది.

గత ధరల పెంపులో ప్రభావం లేకుండా కొనసాగిన Triumph Tracker 400 కూడా ఈసారి ధరల పెంపు నుంచి తప్పించుకోలేదు. ఈ మోడల్ ధర సుమారు రూ.3,000 పెరిగి రూ.2.49 లక్షలకు చేరింది. అయితే మొత్తం రేంజ్‌లో అతి తక్కువ పెంపు ఇదే కావడం విశేషం.

ఇది కూడా చదవండి: యమహా R2పై భారీ అంచనాలు, కేటీఎం RC 200కు కొత్త ఛాలెంజ్! - పవర్, ఫీచర్లు, ధర ఎలా ఉండొచ్చు?

తాజా ధరల ప్రకారం Speed T4 రూ.2.09 లక్షలు, Speed 400 రూ.2.40 లక్షలు, Tracker 400 రూ.2.49 లక్షలు, Scrambler 400 X రూ.2.65 లక్షలు, Scrambler 400 XC రూ.2.99 లక్షలు & Thruxton 400 రూ.2.75 లక్షల ఎక్స్ షోరూమ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి.

తక్కువ కాలంలో వరుసగా రెండుసార్లు ధరలు పెరగడం వల్ల ట్రయంఫ్ 350cc రేంజ్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ బ్రాండ్‌కు ఉన్న ఆదరణ, ప్రీమియం ఫీచర్లు, ఆధునిక డిజైన్ & పనితీరు కారణంగా ఈ మోడళ్లకు మార్కెట్లో డిమాండ్ కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget