అన్వేషించండి

యమహా R2పై భారీ అంచనాలు, కేటీఎం RC 200కు కొత్త ఛాలెంజ్! - పవర్, ఫీచర్లు, ధర ఎలా ఉండొచ్చు?

యమహా R2 వచ్చే నెలలో లాంచ్ కానుంది. 200ccకు పైగా ఇంజిన్, ప్రీమియం ఫీచర్లు, తక్కువ బరువు, పోటీ ధరతో KTM RC 200 & Hero Karizma XMRకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

Yamaha R2 Price And Features: యమహా భారత మార్కెట్‌లో మరో కొత్త స్పోర్ట్స్ బైక్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో R2 అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన R15కు ఇది ప్రత్యామ్నాయం కాదు. R15 కంటే మరింత శక్తివంతమైన & ప్రీమియం మోడల్‌గా R2ను కంపెనీ తీసుకురానుంది. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ మార్కెట్లకు కూడా ఈ బైక్‌ను భారత్‌లోనే తయారు చేసి ఎగుమతి చేయనుంది.

యమహా R15 మాదిరిగానే R2 కూడా పూర్తి ఫెయిరింగ్‌తో కూడిన స్పోర్ట్స్ బైక్‌గా రానుంది. అయితే ఇంజిన్ సామర్థ్యం, పనితీరు & ఫీచర్ల పరంగా మరో స్థాయిలో ఉండేలా కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. తక్కువ బరువు, అధిక పనితీరు కలయికతో ఈ బైక్ తన సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంజిన్ 
యమహా R2లో 200cc కంటే కొద్దిగా ఎక్కువ సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 200cc నుంచి 220cc మధ్య సామర్థ్యంతో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారిక పవర్ గణాంకాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ఈ బైక్ తన సెగ్మెంట్‌లో అత్యుత్తమ పనితీరును అందించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి

మార్కెట్‌లో ఈ బైక్‌కు ప్రధాన ప్రత్యర్థులు KTM RC 200 & Hero Karizma XMR కానున్నాయి. ఈ రెండు మోడళ్లు సుమారు 25hp శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి. యమహా R2 కూడా అదే స్థాయిలో లేదా దానికి దగ్గరగా పవర్ అందించే అవకాశం ఉంది. అయితే యమహా ప్రత్యేకత కేవలం పవర్‌లో కాకుండా తక్కువ బరువులోనూ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం KTM RC 200 బరువు 160 కిలోలు కాగా, హీరో కరిజ్మా XMR బరువు 163.5 కిలోలు. అదే సమయంలో యమహా R15 V4 బరువు కేవలం 141 కిలోలు మాత్రమే. ఇదే ట్రెండ్‌ను R2లో కూడా కొనసాగిస్తే వేగవంతమైన పనితీరు అందించే అవకాశం ఉంది.

ఫీచర్లు 
ఫీచర్ల విషయంలోనూ యమహా R2 ఆకట్టుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం R15 V4లోనే TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ & క్విక్‌షిఫ్టర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. R2లో వీటికి అదనంగా రైడ్ బై వైర్ థ్రాటిల్‌ను అందించే అవకాశముంది. దీంతో రైడింగ్ మోడ్స్, ద్విముఖ క్విక్‌షిఫ్టర్ వంటి ఆధునిక సాంకేతికతలు కూడా అందుబాటులోకి రావచ్చు. వివిధ దేశాల మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా కొన్ని ఫీచర్లలో మార్పులు ఉండే అవకాశం కూడా ఉంది.

యమహా R2ను చెన్నై ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. భారత్‌తో పాటు అనేక అంతర్జాతీయ మార్కెట్లకు ఇక్కడి నుంచే ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది. దీంతో భారత తయారీ కేంద్రానికి మరింత ప్రాధాన్యం పెరగనుంది.

ఇది కూడా చదవండి: కొత్త Servo Hyper Series తీసుకొచ్చిన ఇండియన్‌ ఆయిల్‌ - కార్లు, బైక్‌లకు ప్రీమియం లూబ్రికెంట్లు

ధర 
ప్రస్తుతం యమహా R15 శ్రేణి ధరలు రూ.1.57 లక్షల నుంచి రూ.1.98 లక్షల వరకు ఉన్నాయి. R2 మాత్రం రూ.2 లక్షల నుంచి రూ.2.20 లక్షల మధ్య ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. KTM RC 200 ఎక్స్ షోరూమ్ ధర రూ.2.24 లక్షలు కాగా, హీరో కరిజ్మా XMR ధర రూ.1.76 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. పోటీ ధరతో మార్కెట్‌లోకి రావాలని యమహా నిర్ణయించుకుంటే ఈ సెగ్మెంట్‌లో గట్టి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

మరో కీలక విషయం ఏమిటంటే, R2 ప్లాట్‌ఫామ్‌తో ఒక్క మోడల్‌కే పరిమితం కాకుండా భవిష్యత్తులో మరిన్ని బైక్‌లను కూడా యమహా తీసుకురావచ్చని సమాచారం. గతంలో 155cc ప్లాట్‌ఫారమ్‌పై R15, MT-15 & XSR 155లను తీసుకొచ్చినట్లే, R2 ఆధారంగా కూడా కొత్త మోడళ్లను అభివృద్ధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
Scorpio N, Tata Safari, XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల పూర్తి పోలిక!
Scorpio N వర్సెస్‌ Tata Safari వర్సెస్‌ XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీకు ఏది బెస్ట్?
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
Rodent Attacks: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? రూ.వేల రిపేర్‌ ఖర్చు తప్పించుకోవాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!
కారు ఇంజిన్‌లోకి ఎలుకలు వెళ్తున్నాయా? స్ప్రే నుంచి స్టీల్ మెష్ వరకు.. రక్షణకు 5 మార్గాలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget