అన్వేషించండి

160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!

కొత్త Revolt RVX ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? ధర, రేంజ్, బ్యాటరీ, ఛార్జింగ్ టైమ్, టాప్ స్పీడ్, సీట్ హైట్, బరువు వంటి అన్ని ముఖ్యమైన వివరాలను ఒకే చోట తెలుసుకోండి.

Revolt RVX Price, Range And Features: భారత ఎలక్ట్రిక్ టూవీలర్‌ మార్కెట్లోకి Revolt Motors తన కొత్త RVX మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు కంపెనీ విడుదల చేసిన బైక్‌లలో ఇదే అత్యంత శక్తివంతమైన మోడల్‌. కొత్త మిడ్-డ్రైవ్ మోటార్, బయటకు తీసి ఛార్జ్ చేసుకునే బ్యాటరీ, నాలుగు రైడింగ్ మోడ్స్ & కనెక్టెడ్ ఫీచర్లతో ఈ బైక్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. Revolt RVX కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు ఇవే.

మొదట ధర గురించి మాట్లాడుకుందాం. Revolt RVX ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.30 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. అయితే ఇది ప్రారంభ ఆఫర్ ధర మాత్రమేనని, భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని తెలిపింది. EV కాబట్టి, రిజిస్ట్రేషన్‌ సమయంలో రాష్ట్రాన్ని బట్టి ఈ బండికి కొన్ని రాయితీలు అందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బైక్ ఆన్‌రోడ్ ధర సుమారు రూ.1.40 లక్షలు ఉంటుంది.

రెండో ముఖ్యమైన అంశం రేంజ్. Revolt RVXలో 3.24kWh సామర్థ్యం గల రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ బ్యాటరీకి IP67 రేటింగ్ ఉండటంతో దుమ్ము & నీటి నుంచి మంచి రక్షణ లభిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ రేంజ్ సరిపోతుందని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: జూన్ కార్ల అమ్మకాల్లోనూ మారుతి హవా - టాటా, మహీంద్రా హోరాహోరీ రేస్‌

మూడో విషయం ఛార్జింగ్. సాధారణ 10A ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాలు పడుతుంది. పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 4 గంటల 45 నిమిషాల సమయం అవసరం. అదనంగా లభించే 27A ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే కేవలం 1 గంట 20 నిమిషాల్లోనే 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. త్వరగా ప్రయాణం ప్రారంభించాల్సిన వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

నాలుగో అంశం పనితీరు. Revolt RVXలో 4kW మిడ్-డ్రైవ్ Permanent Magnet Synchronous Motor‌ను అమర్చారు. ఈ మోటార్ గరిష్టంగా 5.3kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. వెనుక చక్రానికి 230Nm టార్క్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. చైన్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా శక్తి వెనుక చక్రానికి చేరుతుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అయితే ఈ టాప్ స్పీడ్ Boost Modeలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మోటార్ పరిస్థితులను బట్టి మాత్రమే Boost Mode పనిచేస్తుంది. అవసరమైతే బైక్ ఆటోమేటిక్‌గా Sport Modeకు మారుతుంది. Sport Modeలో గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

ఇది కూడా చదవండి: దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు - జూన్‌ సేల్స్‌లో TVS నంబర్ వన్; Bajaj, Ather, Vida జోరు

ఐదో అంశం సైజ్‌ & రైడింగ్ సౌకర్యం. Revolt RVX సీట్ ఎత్తు 815 మిల్లీమీటర్లు. కర్బ్ వెయిట్ 120 కిలోలు. ముందు & వెనుక భాగాల్లో 17 అంగుళాల అలాయ్ వీల్స్ అందించారు. ముందు 90/80-17 & వెనుక 110/80-17 ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. అలాగే 190 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో నగర రోడ్లతో పాటు గుంతలు ఉన్న మార్గాల్లో కూడా సులభంగా ప్రయాణించవచ్చు.

మొత్తంగా చూస్తే... మంచి రేంజ్, వేగవంతమైన పనితీరు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రిమూవబుల్ బ్యాటరీ & ఆధునిక ఫీచర్లతో ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా Revolt RVX నిలుస్తోంది. నగర ప్రయాణాలతో పాటు అప్పుడప్పుడు ఎక్కువ దూరం వెళ్లాలనుకునే వాళ్లకు కూడా ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

Revolt RVX ధర ఎంత?

Revolt RVX ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.30 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధర సుమారు రూ.1.40 లక్షలు ఉంటుంది.

Revolt RVX పూర్తి ఛార్జింగ్‌పై ఎంత దూరం ప్రయాణిస్తుంది?

Revolt RVX 3.24kWh బ్యాటరీతో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

Revolt RVX బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

సాధారణ ఛార్జర్‌తో 0-80% ఛార్జ్ అవ్వడానికి 3 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో 1 గంట 20 నిమిషాల్లో 80% ఛార్జ్ చేయవచ్చు.

Revolt RVX గరిష్ట వేగం ఎంత?

Revolt RVX బూస్ట్ మోడ్‌లో గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. స్పోర్ట్ మోడ్‌లో గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేయబడింది.

Revolt RVX ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?

ఇందులో కొత్త మిడ్-డ్రైవ్ మోటార్, బయటకు తీసి ఛార్జ్ చేయగల బ్యాటరీ, నాలుగు రైడింగ్ మోడ్‌లు మరియు కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీకి IP67 రేటింగ్ కూడా ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!
ట్రాఫిక్‌ చలానాలు చెల్లించకపోతే వాహన సేవలకు బ్రేక్, లైసెన్స్‌పై వేటు, కరెంటు కట్‌!
ట్రాఫిక్ చలానా కట్టలేదా? ఇక కరెంట్ బిల్లు మోతే!.. ఈ రెండిటికీ ఏంటి సంబంధం?
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
ఉజ్జయినిలో షాహీ మసీదు కూల్చివేత వివాదం: షాహీ మసీదును ఎవరు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి?
ఉజ్జయినిలో షాహీ మసీదు కూల్చివేత వివాదం: షాహీ మసీదును ఎవరు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి?
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Embed widget