అన్వేషించండి

రీసేల్ విలువలో Hyundai Verna నంబర్ 1 - Honda City కి భారీ డిప్రెషియేషన్

యూజ్డ్‌ కార్‌ స్టడీ 2026లో మిడ్‌సైజ్ సెడాన్‌ల రీసేల్ విలువలు వెల్లడయ్యాయి. Hyundai Verna అత్యుత్తమ విలువను నిలబెట్టుకోగా, Honda City అత్యధిక డిప్రెషియేషన్ నమోదు చేసింది.

Second Hand Cars 2026: భారతదేశంలో సెకండ్‌హ్యాండ్‌/యూజ్డ్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఏ కారుకు ఎక్కువ రీసేల్ విలువ ఉంటుందనే విషయం కొనుగోలుదారులకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో, ఇటీవల Spinny (సెకండ్‌హ్యాండ్‌ కార్లు అమ్మే కంపెనీ‌) సహకారంతో నిర్వహించిన యూజ్డ్ కార్ స్టడీ 2026 (Used Car Study 2026) లో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మిడ్‌సైజ్ సెడాన్ విభాగంలో హ్యుందాయ్‌ వెర్నా (Hyundai Verna) అత్యుత్తమ రీసేల్ వాల్యూని నిలబెట్టుకోగా, హోండా సిటీ (Honda City) అత్యధిక డిప్రెషియేషన్‌ను నమోదు చేసింది.

Spinny అందించిన వాస్తవ లావాదేవీల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. 2025 జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విక్రయించిన సెకండ్‌హ్యాండ్‌ కార్ల డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో. దేశంలోని ప్రధాన నగరాలు - ఢిల్లీ-NCR, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, ముంబై, లక్నో, అహ్మదాబాద్ & కోల్‌కతా నగరాల్లో జరిగిన విక్రయాల వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ అధ్యయనం ప్రకారం, మిడ్‌సైజ్ సెడాన్ విభాగంలో Hyundai Verna Petrol Manual అత్యంత స్థిరమైన రీసేల్ విలువను నమోదు చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన డ్రైవింగ్ అనుభవం & తక్కువ నిర్వహణ ఖర్చులు Vernaకు యూజ్డ్ కార్ల మార్కెట్లో మంచి డిమాండ్ తీసుకొచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఐదేళ్ల తర్వాత కూడా ఈ కారు తన విలువను ఇతర మోడళ్లతో పోలిస్తే మెరుగ్గా నిలబెట్టుకుంది.

ఇది కూడా చదవండి: EV మార్కెట్‌లో ఆధిపత్యం ఎవరిది? టెస్లాదా లేక BYDదా? ఈ లెక్కలు మిమ్మల్ని షాకిస్తాయి!

మరోవైపు Honda City Petrol Manual ఈ విభాగంలో అత్యధిక డిప్రెషియేషన్‌ను నమోదు చేసింది. ప్రస్తుతం ఐదేళ్ల పాత Honda City కార్లు వాటి ప్రారంభ ఆన్‌రోడ్ ధరలో దాదాపు సగం విలువకే విక్రయమవుతున్నాయని అధ్యయనం వెల్లడించింది. అంటే ఇతర పోటీ మోడళ్లతో పోలిస్తే Honda City విలువ వేగంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది.

యూరోపియన్ బ్రాండ్లలో Volkswagen Virtus & Skoda Slavia మధ్య కూడా పోలిక నిర్వహించారు. ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై రూపొందించినప్పటికీ, Volkswagen Virtus రీసేల్ విలువను కొద్దిగా మెరుగ్గా నిలబెట్టుకున్నట్లు అధ్యయనం తెలిపింది. దీంతో యూజ్డ్ కార్ల కొనుగోలుదారులు Virtusకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఉత్పత్తి నిలిపేసిన Maruti Ciaz కూడా ఆసక్తికర ఫలితాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఒక సంవత్సరం & మూడు సంవత్సరాల వయస్సున్న Ciaz కార్లు అదే వయస్సు గల ఇతర మిడ్‌సైజ్ సెడాన్‌లతో పోలిస్తే మెరుగైన రీసేల్ వాల్యూ ఇచ్చినట్లు నివేదిక వెల్లడించింది. మార్కెట్లో ఈ మోడల్‌కు ఇప్పటికీ కొంత స్థిరమైన డిమాండ్ కొనసాగుతున్నట్లు ఇది సూచిస్తోంది.

ధరల పరంగా చూస్తే, Spinny ద్వారా విక్రయించిన ఐదేళ్ల పాత మిడ్‌సైజ్ సెడాన్‌ల సగటు విక్రయ ధర రూ.9.38 లక్షలుగా నమోదైంది. మూడు సంవత్సరాల పాత కార్ల సగటు ధర రూ.11.25 లక్షలు కాగా, ఒక సంవత్సరం పాత కార్ల సగటు ధర రూ.12.95 లక్షలుగా ఉంది.

ఇది కూడా చదవండి: టాటా సియెర్రా EV వేరియంట్‌లలో పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇవే.. మీ అవసరానికి సరిపడే కాంబినేషన్‌ ఏది?

డిప్రెషియేషన్ పరంగా ఐదేళ్ల పాత మిడ్‌సైజ్ సెడాన్‌ల సగటు విలువ 43 శాతం తగ్గింది. మూడు సంవత్సరాల కార్లలో ఈ తగ్గుదల 34.8 శాతం కాగా, ఒక సంవత్సరం పాత కార్లలో 24.8 శాతంగా నమోదైంది. వాహనం వయస్సు పెరిగే కొద్దీ రీసేల్ వాల్యూ తగ్గుతున్నప్పటికీ... బ్రాండ్ ఇమేజ్, డిమాండ్, విశ్వసనీయత & నిర్వహణ ఖర్చులు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.

ఈ అధ్యయనంలో, వాహనం తయారైన ఏడాది ఆన్‌రోడ్ ధరను ఆధారంగా తీసుకుని, 2025లో అదే కారు రీసేల్ ధరతో పోల్చి డిప్రెషియేషన్‌ను లెక్కించారు. ఒకే ఇంధన రకంలో ఉన్న వేర్వేరు వేరియంట్ల ధరలను సగటుగా పరిగణించారు. నిలిపివేసిన పవర్‌ట్రెయిన్‌లు, రూ.30 లక్షలకు పైబడిన ప్రీమియం కార్లు, EVలు & తక్కువ సంఖ్యలో విక్రయమైన మోడళ్లను ఈ అధ్యయనంలో చేర్చలేదు.

మొత్తంగా చూస్తే, మిడ్‌సైజ్ సెడాన్ కొనుగోలు చేయాలనుకునే వారికి Hyundai Verna అత్యుత్తమ రీసేల్ వాల్యూ ఇస్తున్న మోడల్‌గా నిలిచింది. భవిష్యత్తులో కారును విక్రయించే సమయంలో మంచి విలువ పొందాలనుకునే వారికి ఈ అధ్యయనం ఉపయోగకరమైన మార్గదర్శకంగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget