అన్వేషించండి

టాటా సియెర్రా EV వేరియంట్‌లలో పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇవే.. మీ అవసరానికి సరిపడే కాంబినేషన్‌ ఏది?

టాటా సియెర్రా EV రూ.18.79 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఏ వేరియంట్‌కు ఏ బ్యాటరీ, RWD & AWD ఆప్షన్లు, రేంజ్, ఫీచర్లు, ధర, ప్రత్యర్థుల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tata Sierra EV 2026 Battery Options: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, తన ఐకానిక్ SUVల్లో ఒకటైన సియెర్రాను పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.18.79 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన టాటా సియెర్రా EV...  Nexon EV & Curvv EV కంటే ప్రీమియం స్థాయిలో నిలుస్తోంది. విశాలమైన క్యాబిన్, ఆధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, ఎక్కువ రేంజ్ కలిగిన బ్యాటరీ ఆప్షన్లతో ఈ SUV కార్‌ లవర్స్‌ను ఆకర్షిస్తోంది.

రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ధరలో బెస్ట్‌ ఎలక్ట్రిక్ SUV కొనాలనుకునే వారికి టాటా సియెర్రా EV మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ మోడల్‌లో రెండు బ్యాటరీ ప్యాక్‌లు, RWD & AWD డ్రైవ్‌ట్రెయిన్ ఎంపికలు ఉన్నాయి. అయితే అన్ని వేరియంట్‌లలో అన్ని పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో లేవు.

ఇది కూడా చదవండి: 3 నిమిషాల్లో ఆటో నుంచి స్కూటర్‌గా మారే హీరో సర్జ్‌ఎస్‌ 32! చంద్రబాబు పరిశీలించిన వెహికల్‌ పూర్తి వివరాలు ఇవే!

పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లు

 

63 kWh

75 kWh

75 kWh

ఎలక్ట్రిక్ మోటార్ల సంఖ్య

1

1

2

క్లెయిమ్‌ చేసిన రేంజ్‌ (MIDC)

565 kms

665 kms

624 kms

డ్రైవ్‌ట్రెయిన్

రియర్‌ వీల్‌ డ్రైవ్‌ (RWD)

రియర్‌ వీల్‌ డ్రైవ్‌ (RWD)

ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ (AWD)

పవర్

238 PS

209 PS

209 PS (రియర్‌ మోటార్‌), 140 PS (ఫ్రంట్‌ మోటార్‌)

టార్క్

315 Nm

315 Nm

504 Nm

ఈ సెటప్‌తో తన విభాగంలో AWD ఫీచర్‌ను అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ SUVగా టాటా సియెర్రా EV ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఇది కూడా చదవండి: టాటా సియారా EVలోని మంచి ఫీచర్లు ఉన్న వేరియంట్ ఏది? కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

వేరియంట్ల వారీగా బ్యాటరీ ప్యాక్‌లు

వేరియంట్‌

63 kWh 

75 kWh

RWD

RWD

AWD

Pure ఉంది లేదు లేదు
Pure S ఉంది లేదు లేదు
Adventure ఉంది ఉంది లేదు
Empowered ఉంది ఉంది లేదు
Empowered A లేదు ఉంది ఉంది

అన్ని వేరియంట్‌లలో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను టాటా అందిస్తోంది. దీంతో నగరాల్లోనే కాకుండా హైవే ప్రయాణాల్లో కూడా బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.

ఫీచర్లు
టాటా సియెర్రా EVలో మూడు 12.3 అంగుళాల డిస్‌ప్లేలతో కూడిన డ్యాష్‌బోర్డ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & ప్రయాణికుల కోసం ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నాయి. అలాగే, పానోరమిక్ సన్‌రూఫ్, 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్‌తో కూడిన సౌండ్‌బార్, పవర్డ్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ & పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.

భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 540 డిగ్రీ కెమెరా, ESC, పార్కింగ్ సెన్సర్లు & ఉన్నత వేరియంట్‌లలో ADAS వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు అందించారు.

భారత మార్కెట్లో టాటా సియెర్రా EVకి Mahindra BE 6, Hyundai Creta Electric, MG ZS EV, BYD Atto 3 ప్రధాన ప్రత్యర్థులు. రెట్రో స్టైలింగ్, ప్రీమియం ఫీచర్లు, ఎక్కువ రేంజ్ & AWD సామర్థ్యాన్ని కోరుకునే వినియోగదారులకు టాటా సియెర్రా EV ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget