అన్వేషించండి

పల్సర్ అభిమానులకు షాక్ - బజాజ్ పల్సర్ N125 అమ్మకాలు నిలిపేసిన కంపెనీ, కారణం ఇదే!

బజాజ్ పల్సర్ N125ను భారత్‌లో నిలిపివేసింది బజాజ్ ఆటో. బలహీనమైన అమ్మకాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫీచర్లు, ఇంజిన్, ధరలు & నిలిపివేత వెనుక కారణాలు తెలుసుకోండి.

Bajaj Pulsar N125 discontinued in India: బజాజ్ ఆటో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాకపోవడంతో బజాజ్ పల్సర్ N125ను భారత మార్కెట్‌లో అధికారికంగా నిలిపివేసింది. 2024 అక్టోబర్‌లో ఘనంగా విడుదలైన ఈ 125cc స్పోర్ట్స్ బైక్ రెండేళ్లు కూడా పూర్తి కాకముందే భారత మార్కెట్‌కు గుడ్‌బై చెప్పడం బైక్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ మోడల్‌కు విదేశీ మార్కెట్లలో మాత్రం విక్రయాలు కొనసాగుతుండటం విశేషం.

కొత్త ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా డిజైన్‌
పల్సర్ N125 సాధారణ పల్సర్ మోడల్ కాదు. దీని కోసం బజాజ్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. కొత్త చాసిస్, కొత్త ఇంజిన్, కొత్త డిజైన్‌తో ఈ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం 125 కిలోల కర్బ్ వెయిట్‌తో రూపొందించడం వల్ల నగర రహదారులపై చురుకైన పనితీరు అందించాలనే లక్ష్యంతో దీనిని తయారు చేశారు. తక్కువ బరువు కారణంగా హ్యాండ్లింగ్ కూడా మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

డిజైన్ పరంగా పల్సర్ N125 ఇతర బైక్‌లతో పోలిస్తే భిన్నంగా కనిపించింది. సన్నగా & పొడవుగా ఉండే స్టైలింగ్‌ను బజాజ్ ఎంచుకుంది. అయితే ఇదే అంశం భారత వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, హోండా CB125 హార్నెట్ వంటి ప్రత్యర్థి బైక్‌లు భారీ ఆకృతి & స్పోర్టీ లుక్‌తో యువతను ఆకర్షించడంతో పల్సర్ N125 వెనుకబడింది.

ఇది కూడా చదవండి: జులై 2026 కార్ లాంచ్‌లు ఇవే - మారుతి, హోండా, స్కోడా, MG కొత్త కార్లపై భారీ అంచనాలు

ఈ బైక్‌లో 124.59cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 12 PS పవర్ & 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం ఈ బైక్ 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ఠ వేగం 97 కిలోమీటర్లుగా ప్రకటించినప్పటికీ స్పీడోమీటర్‌పై 110 కిలోమీటర్లకు పైగా వేగం కనిపిస్తుందని యూజర్ల అనుభవాలు సూచిస్తున్నాయి. లీటరుకు సుమారు 60 కిలోమీటర్ల మైలేజ్ అందించడం కూడా దీని ప్రత్యేకతల్లో ఒకటి.

రైడర్ల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని 795 మిల్లీమీటర్ల సీటు ఎత్తు & 198 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్‌ను బజాజ్ అందించింది. దీంతో స్పీడ్ బ్రేకర్లు, గుంతలు ఉన్న నగర రహదారులపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుంది.

ఎందుకు నిలిపేస్తున్నారు?
ఫీచర్ల విషయంలో పల్సర్ N125 ప్రత్యర్థుల కంటే వెనుకబడింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని 125cc బైక్‌లలో TFT డిస్‌ప్లే, ABS వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉండగా, పల్సర్ N125లో ఇవి లేకపోవడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ బైక్ వివరాలు బజాజ్ భారత వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నప్పటికీ డీలర్లకు కొత్త స్టాక్ పంపిణీని కంపెనీ నిలిపివేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి?

పల్సర్ N125ను రెండు వేరియంట్‌లలో విక్రయించారు. LED Disc BT వేరియంట్ & LED Disc వేరియంట్‌ల ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.91,690 నుంచి రూ.93,160 మధ్య ఉన్నాయి. ఆన్‌రోడ్ ధర రాష్ట్రాన్ని బట్టి సుమారు రూ.1.03 లక్షల నుంచి రూ.1.14 లక్షల వరకు ఉండేది.

భారత్‌లో విక్రయాలు నిలిచిపోయినప్పటికీ నేపాల్, పెరూ, కొలంబియా & మొరాకో వంటి పలు అంతర్జాతీయ మార్కెట్లలో పల్సర్ N125 అందుబాటులోనే ఉంటుంది. భవిష్యత్తులో కొత్త డిజైన్, మరిన్ని ఆధునిక ఫీచర్లతో ఇదే ప్లాట్‌ఫారమ్‌పై మరో కొత్త మోడల్‌ను బజాజ్ భారత్‌లో ప్రవేశపెడుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పటికి స్పష్టత లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget