అన్వేషించండి

ప్రత్యర్థి కార్ల కంటే టాటా సియెర్రాలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?, డబ్బుకు తగిన విలువ ఇస్తుందా?

టాటా సియెర్రా EVలో ట్రిపుల్ స్క్రీన్లు, 540 డిగ్రీ కెమెరా, AWD, రిమోట్ గేమింగ్ వంటి ప్రత్యర్థి కార్లలో లేని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ధర, రేంజ్ & ప్రత్యేకతలు తెలుసుకోండి.

Tata Sierra EV Price And Features: భారత ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లోకి కొత్త సియెర్రా EVని ప్రవేశపెట్టి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది టాటా మోటార్స్. ఇప్పటికే Curvv EVతో మిడ్‌సైజ్‌ ఎలక్ట్రిక్ SUV విభాగంలోకి అడుగుపెట్టిన టాటా, ఇప్పుడు సియెర్రా EVతో మరింత బలమైన పోటీకి సిద్ధమైంది. ఈ మోడల్‌కు Hyundai Creta Electric, Maruti e Vitara, Toyota Ebella, MG ZS EV, Mahindra BE 6, Vinfast VF6 వంటి కార్లు ప్రత్యర్థులు. అయితే వీటన్నింటి కంటే టాటా సియెర్రా EVలో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉండటం దీని ప్రధాన బలంగా చెప్పొచ్చు.

ప్రత్యేకతలు
ఈ SUVలో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ట్రిపుల్ స్క్రీన్ సెటప్. ఇతర ప్రత్యర్థి కార్లలో సాధారణంగా రెండు స్క్రీన్లు మాత్రమే ఉండగా, సియెర్రా EVలో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 10.25 అంగుళాల ప్రత్యేక ప్యాసింజర్ స్క్రీన్‌ను అందించారు. ముందు సీటులో కూర్చున్న ప్రయాణికుడు ప్రత్యేకంగా వినోదాన్ని ఆస్వాదించే అవకాశం ఇందులో ఉంటుంది. అలాగే Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో పాటు Apple CarPlayలో ఈ సౌండ్ అనుభూతిని అందిస్తున్న భారతదేశపు తొలి కారు ఇదేనని టాటా మోటార్స్ చెబుతోంది.

మరో ప్రత్యేకత 540 డిగ్రీ కెమెరా వ్యవస్థ. ప్రస్తుతం అనేక కార్లలో 360 డిగ్రీ కెమెరా అందుబాటులో ఉన్నప్పటికీ, సియెర్రా EVలో అదనంగా కారు కింద భాగాన్ని కూడా చూపించే సదుపాయం ఉంది. ముఖ్యంగా గుంతలు, రాళ్లతో కూడిన రహదారులు లేదా ఆఫ్‌రోడింగ్ సమయంలో చక్రాల స్థితిని స్పష్టంగా గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా & సులభంగా మార్చే ఫీచర్‌గా ఇది నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: లైఫ్‌టైమ్‌ బ్యాటరీ వారంటీతో వస్తున్న మార్కెట్లోకి టాటా సియెర్రా ఈవీ ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే!

టాటా సియెర్రా EVలో మరో ప్రధాన ఆకర్షణ AWD వ్యవస్థ. ముందు & వెనుక భాగాల్లో ప్రత్యేక ఎలక్ట్రిక్ మోటార్లు ఉండటంతో ఈ SUVకు ఆల్ వీల్ డ్రైవ్ సామర్థ్యం లభించింది. 75kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ వేరియంట్‌లో ముందు మోటార్ 140 hp & వెనుక మోటార్ 209 hp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. మొత్తం 504 Nm టార్క్‌ను అందించే ఈ కారు కేవలం 5.8 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ విభాగంలో ఇది అత్యంత వేగవంతమైన SUVగా నిలవగా, మహీంద్రా BE 6 అదే వేగాన్ని చేరుకోవడానికి 6.7 సెకన్లు పడుతుందని పేర్కొంది.

వినోదాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు టాటా AirConsole సపోర్ట్‌ను కూడా అందించింది. దీనివల్ల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను మల్టీప్లేయర్ గేమింగ్ కన్సోల్‌గా ఉపయోగించుకోవచ్చు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లనే గేమ్ కంట్రోలర్‌లుగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఛార్జింగ్ కోసం ఆగిన సమయంలో కుటుంబ సభ్యులు & స్నేహితులు కలిసి గేమ్స్ ఆడే అవకాశం ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఇది కూడా చదవండి: E20 పెట్రోల్ నింపుకుంటే పూర్తి బాధ్యత వాహనదారులదే, సంబంధం లేదని ప్రభుత్వం చేతులెత్తేసిందా?

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధర
ధర విషయానికి వస్తే టాటా సియెర్రా EV ఎక్స్‌షోరూమ్ ధర రూ.18.79 లక్షల నుంచి ప్రారంభమై రూ.25.99 లక్షల వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధర సుమారు రూ.19.92 లక్షల నుంచి రూ.27.69 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ వేరియంట్‌ను బట్టి ఒకసారి పూర్తి ఛార్జ్‌తో సుమారు 535 కిలోమీటర్ల నుంచి 665 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను కంపెనీ ప్రకటించింది. అత్యున్నత Empowered A AWD వేరియంట్‌లో ట్రిపుల్ స్క్రీన్లు, 540 డిగ్రీ కెమెరా, AWD & AirConsole వంటి అన్ని ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

ఫీచర్లు, పనితీరు, టెక్నాలజీ & రేంజ్ పరంగా చూస్తే టాటా సియెర్రా EV తన ప్రత్యర్థి కార్లతో పోలిస్తే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ వినూత్న ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget