అన్వేషించండి

టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!

Maruti Suzuki, మరికొన్ని రోజుల్లో కొత్త Brezza SUVను పరిచయం చేయనుంది. టర్బో పెట్రోల్‌ ఇంజిన్, ADAS, కొత్త ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్‌తో రానున్న ఈ SUV ధర కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

Updated Maruti Brezza: కొత్త SUV కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి Maruti Suzuki నుంచి ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఈ కంపెనీ, తన ప్రముఖ కాంపాక్ట్ SUV అయిన Maruti Brezzaకు భారీ అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధమైంది. 2022లో రెండో తరం Brezzaను మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇదే తొలి ప్రధాన అప్‌డేట్ కానుంది. జులై 23, 2026న ఈ కొత్త వెర్షన్‌ను అధికారికంగా పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త డిజైన్, ప్రీమియం క్యాబిన్, అత్యాధునిక ఫీచర్లతో పాటు తొలిసారి Turbo Petrol ఇంజిన్‌ను కూడా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టర్బో పెట్రోల్‌ ఇంజిన్
ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ కొత్త 1.0 లీటర్ టర్బో పెట్రోల్‌ ఇంజిన్. ప్రస్తుతం Fronxలో ఉపయోగిస్తున్న ఈ ఇంజిన్ 100 hp పవర్ & 148 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను జోడించే అవకాశం ఉందని ఇటీవల పరీక్షల సమయంలో కనిపించిన టెస్ట్ మ్యూల్స్ సూచిస్తున్నాయి. దీంతో Brezza పనితీరు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు

కొత్త టర్బో పెట్రోల్‌ ఇంజిన్ రావడం వల్ల Brezzaకు మరో కీలక ప్రయోజనం కూడా లభించనుంది. 1,200cc లోపు పెట్రోల్ ఇంజిన్ కలిగిన సబ్-4 మీటర్ కార్లకు వర్తించే 18 శాతం GST ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో టర్బో పెట్రోల్‌ వేరియంట్ లేని ఏకైక SUVగా Brezza ఉంది. కొత్త ఇంజిన్‌తో ఆ లోటు కూడా తీరనుంది. అలాగే, ఇదే ఇంజిన్‌తో CNG వేరియంట్‌ను కూడా కంపెనీ తీసుకురావచ్చని సమాచారం.

ఎక్స్‌టీరియర్ పరంగా పెద్దగా మార్పులు లేకపోయినా మరింత స్టైలిష్‌గా కనిపించేలా కొత్త బంపర్లు, కొత్త LED లైటింగ్ ఎలిమెంట్స్‌ను అందించే అవకాశం ఉంది. వెనుక భాగంలో కనెక్టెడ్ స్టైల్ LED టెయిల్ ల్యాంప్స్, కొత్త 4-స్పోక్‌ అలాయ్ వీల్స్ SUVకు మరింత ప్రీమియం లుక్ ఇవ్వనున్నాయి.

క్యాబిన్ డిజైన్‌లో ప్రస్తుత లేఅవుట్ కొనసాగినా, కొత్త కలర్ థీమ్ & మెరుగైన ట్రిమ్ మెటీరియల్స్‌తో ఇంటీరియర్ మరింత ప్రీమియంగా మారే అవకాశం ఉంది. అలాగే Victoris SUVలో ఉన్న 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను Brezzaలో కూడా అందించవచ్చని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Toyota Fortunerకు అదిరిపోయే మేకోవర్ - కొత్త జనరేషన్ SUVలా మార్చేసిన ఓనర్

ప్రీమియం ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే... పవర్డ్‌ డ్రైవర్‌ సీటు, వెంటిలేటెడ్‌ సీట్లు, అంబియంట్‌ లైటింగ్‌ వంటి ప్రీమియం సదుపాయాలు జోడించే అవకాశం ఉంది. భద్రత కోసం లెవెల్‌ 2 ADASను కూడా అందించవచ్చని సమాచారం. అదనంగా, ముందువైపు పార్కింగ్‌ సెన్సార్లు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల భద్రత & డ్రైవింగ్ సౌలభ్యం మరింత పెరగనుంది.

ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న Brezzaలో 1.5 లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 103 hp పవర్ & 139 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 6-స్పీడ్‌ టర్బో టార్క్‌ కన్వర్ట్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. CNG వేరియంట్‌లో 88 hp పవర్ లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ 17.80 kmpl నుంచి 19.80 kmpl వరకు ఉండగా, CNG వేరియంట్ 25.51 km/kg మైలేజ్ అందిస్తుంది.

ప్రస్తుతం ధర
ధర విషయానికి వస్తే.. ప్రస్తుతం Brezza ఎక్స్‌షోరూమ్ ధర రూ.8.26 లక్షల నుంచి రూ.12.86 లక్షల మధ్య ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధర సుమారు రూ.9.79 లక్షల నుంచి రూ.15.82 లక్షల వరకు ఉంది. కొత్త ఫీచర్లు, టర్బో పెట్రోల్‌  ఇంజిన్ & ADAS వంటి అప్‌డేట్‌ల కారణంగా కొత్త Brezza ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో Hyundai Venue, Tata Nexon, Skoda Kylaq, Mahindra XUV 3XO, Kia Sonet & Syros వంటి మోడళ్లకు కొత్త Brezza గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
Engine Layout: మీ కారు ఇంజిన్ ఎక్కడుంది? ముందు, వెనుక లేదా మధ్యలో.. ప్లేస్‌మెంట్‌ను బట్టి మారనున్న డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌!
మీ కారు ఇంజిన్‌ ముందు వైపు ఉందా, మధ్యలో ఉందా.. డ్రైవింగ్‌లో వచ్చే తేడా ఏంటి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
Bigg Boss Season 10 Today November 20th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
Embed widget