అన్వేషించండి

Toyota Fortunerకు అదిరిపోయే మేకోవర్ - కొత్త జనరేషన్ SUVలా మార్చేసిన ఓనర్

పాత Toyota Fortuner SUVకు నెక్స్ట్ జనరేషన్ లుక్ ఇచ్చిన ఓనర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త బాడీ కిట్, LED లైట్లు, 13 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో SUV పూర్తిగా కొత్త రూపంలో మెరిసింది.

Toyota Fortuner Makeover: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం SUVల్లో Toyota Fortuner ఒకటి. ఈ SUVకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉండటంతో మార్కెట్లో అనేక రకాల ఆఫ్టర్‌మార్కెట్ మోడిఫికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తాజాగా, ఓ Toyota Fortuner ఓనర్ తన పాత తరం SUVకు పూర్తిగా కొత్త రూపాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ జనరేషన్ Fortunerను తలపించేలా ప్రత్యేక బాడీ కిట్‌ను అమర్చడంతో ఈ SUV ఇప్పుడు చూడటానికి కొత్త మోడల్‌లా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను Auto Gallery తన Instagram పేజీలో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎలాంటి మార్పులు చేశారంటే...
ఈ మోడిఫికేషన్‌లో SUV ముందు భాగాన్ని పూర్తిగా మార్చేశారు. అసలు మోడల్‌లో ఉన్న హెడ్‌ల్యాంప్స్, గ్రిల్, బంపర్, బోనెట్ & ఫెండర్లను తొలగించి కొత్త డిజైన్ భాగాలను అమర్చారు. దీంతో Fortuner ముందు భాగం అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించిన నెక్స్ట్ జనరేషన్ Fortunerను పోలి కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: 1,000cc, 280hp పవర్‌తో సంచలనం - ప్రపంచంలోనే అరుదైన 8 సిలిండర్ టూస్ట్రోక్ బైక్ ఆవిష్కరణ

కొత్త ఫ్రంట్ ఫాసియాలో పెద్ద రెక్టాంగులర్ గ్రిల్‌కు హనీకాంబ్ ఇన్‌సర్ట్స్‌ను అందించారు. కొత్త LED హెడ్‌ల్యాంప్స్‌తో పాటు వెడల్పాటి ఎయిర్ డ్యామ్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో రూపొందించిన బంపర్ SUVకు మరింత రగ్గడ్ లుక్‌ను తీసుకొచ్చింది. ఫాగ్ ల్యాంప్స్‌ను కూడా బంపర్ దిగువ భాగంలో అమర్చడం ద్వారా ముందు భాగం మరింత ఆకర్షణీయంగా మారింది.

ఇంతటితో ఆగకుండా కొత్త బోనెట్, రీడిజైన్ చేసిన ఫెండర్లు & పెద్ద వీల్ ఆర్చ్ క్లాడింగ్‌ను కూడా అమర్చారు. అలాగే Fortuner Legenderలో ఉండే 18 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ను ఈ SUVకు ఉపయోగించారు. డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ కలర్‌తో పాటు బ్లాక్ రూఫ్ ఇవ్వడం వల్ల SUV ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకుంది.

ముందు భాగంలో భారీ మార్పులు చేసినప్పటికీ సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించవు. వెనుక భాగంలో పరిమిత మార్పులు మాత్రమే చేశారు. కొత్త ఆఫ్టర్‌మార్కెట్ LED టెయిల్ ల్యాంప్స్‌తో పాటు మధ్యలో కనెక్టెడ్ లైట్ బార్‌ను అమర్చారు. డైనమిక్ లైటింగ్ ఎలిమెంట్స్, కొత్త రియర్ బంపర్ & అదనపు బాడీ క్లాడింగ్‌తో వెనుక భాగాన్ని మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. అయితే ఇది అసలు నెక్స్ట్ జనరేషన్ Fortuner రియర్‌ డిజైన్‌కు పూర్తి పోలిక కాదు.

ఇది కూడా చదవండి: కొత్త లుక్‌లో TVS Ntorq 125 - హైదరాబాద్, విజయవాడలో ఆన్‌రోడ్ ధరలు ఇవే

క్యాబిన్‌లో...
క్యాబిన్‌లో కూడా గణనీయమైన మార్పులు చేశారు. ఇంటీరియర్‌ను బ్లాక్ & లైట్ బ్రౌన్ డ్యూయల్ టోన్ థీమ్‌తో రీడిజైన్ చేశారు. కొత్త డోర్ ప్యాడ్స్‌కు అంబియంట్ లైటింగ్‌ను జోడించారు. స్టీరింగ్ వీల్‌ను కొత్త లెదర్ ర్యాప్‌తో అలంకరించగా, 13 అంగుళాల ఆఫ్టర్‌మార్కెట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. దీంతో క్యాబిన్ మరింత ఆధునికంగా కనిపిస్తోంది.

ఈ మోడిఫికేషన్‌లో ప్రధానంగా బాహ్య రూపాన్ని పూర్తిగా మార్చినప్పటికీ ఇంజిన్ & మెకానికల్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే పనితీరు యథాతథంగానే కొనసాగుతుంది. నెక్స్ట్ జనరేషన్ Fortuner కొనుగోలు చేయలేని వారు తక్కువ ఖర్చుతో తమ పాత Fortunerకు కొత్త లుక్ ఇవ్వాలని భావిస్తే ఇలాంటి ఆఫ్టర్‌మార్కెట్ బాడీ కిట్లు ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ మోడిఫైడ్ Toyota Fortuner వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుండగా, SUV ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొంతమంది తమ కారు సైడ్‌ మిర్రర్లకు పాలిథిన్‌ బ్యాగ్‌ను ఎందుకు కడతారు? అసలు కారణం ఇదే
కారు సైడ్‌ మిర్రర్లకు పాలిథిన్‌ కవర్ ఎందుకు కట్టాలి? ఈ చిన్న చిట్కాతో చాలా పెద్ద ఉపయోగాలు
అథర్ కొణార్క్ లాంచ్‌ అయింది.. 161km రేంజ్‌, 3 బ్యాటరీ ఆప్షన్లతో పాటు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు
అథర్ కొణార్క్‌ లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 161km రేంజ్‌, 10,000 కి.మీ.కు ఒక్కసారే సర్వీసింగ్‌!
టీవీఎస్ జూపిటర్ 110 స్పెక్ట్రల్.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సీక్వెన్షియల్ ఇండికేటర్లు, రూ.89,825కే!
టీవీఎస్ జూపిటర్ 110కి కొత్త రంగులు.. అదిరిపోయిన డ్యూయల్ టోన్ లుక్‌, సీక్వెన్షియల్ ఇండికేటర్లు
Longest Range Electric Car: ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే EV కారు ఏది? ఫాస్ట్ ఛార్జింగ్‌లోనూ తిరుగేలేదు
ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే EV కారు ఏది? ఫాస్ట్ ఛార్జింగ్‌లోనూ తిరుగేలేదు
Advertisement

వీడియోలు

Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ
BCCI Central Contracted Players Fitness Test | బెంగళూరులో టీమిండియా ఫిట్‌నెస్ క్యాంప్
SKY Breaks Silence On T20 Captaincy | టీ20 కెప్టెన్సీ మార్పుపై సూర్యకుమార్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss 10 Charan Mahadev | బిగ్ బాస్ 10 కామనర్ చరణ్ మహదేవ్ రియల్ లైఫ్
Women's T20 Asia Cup 2026 | మహిళల టీ20 ఆసియా కప్ 2026
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti vs Harish Rao: పదవుల కోసం హరీష్ రావు నీచ రాజకీయాలు, కేసీఆర్‌పై సైతం క్షుద్రపూజలు: మంత్రి పొంగులేటి కౌంటర్
పదవుల కోసం హరీష్ రావు నీచ రాజకీయాలు, కేసీఆర్‌పై సైతం క్షుద్రపూజలు: మంత్రి పొంగులేటి కౌంటర్
Vikarabad Railway Station: 40కి పైగా స్టేషన్ల పునర్నిర్మాణంతో తెలంగాణ రైల్వేల దశ మారుతుంది: కిషన్ రెడ్డి
40కి పైగా స్టేషన్ల పునర్నిర్మాణంతో తెలంగాణ రైల్వేల దశ మారుతుంది: కిషన్ రెడ్డి
Bhadradri Kothagudem Crime News: ఇద్దరితో మహిళ ఎఫైర్.. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి దారుణ హత్య.. ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు
ఇద్దరితో మహిళ ఎఫైర్.. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి దారుణ హత్య.. ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు
NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
Hair Thinning : జుట్టు రాలిపోతూ.. పలుచగా మారుతోందా? కారణాలు, హెయిర్ డెన్సిటీ పెంచుకునే చిట్కాలు ఇవే
జుట్టు రాలిపోతూ.. పలుచగా మారుతోందా? కారణాలు, హెయిర్ డెన్సిటీ పెంచుకునే చిట్కాలు ఇవే
Korean Kanakarju OTT : ఓటీటీలోకి రీసెంట్ హారర్ కామెడీ - వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రీసెంట్ హారర్ కామెడీ - వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Nepal Flash Floods: నేపాల్ వరద: 626 మంది మృతి.. ఇంకా 2400 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
నేపాల్ వరద: 626 మంది మృతి.. ఇంకా 2400 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Adivasi March: రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాలలో ఆదివాసీ మార్చ్ కి కదిలిరండి: తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు
రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాలలో ఆదివాసీ మార్చ్ కి కదిలిరండి: తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు
Embed widget