అన్వేషించండి

రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2026 - న్యూ డిజైన్, పెద్ద టచ్‌స్క్రీన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ధర తక్కువ!

జులై 3న రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ భారత్‌లో విడుదల కానుంది. కొత్త Y-షేప్ లైటింగ్, పెద్ద టచ్‌స్క్రీన్, అప్‌డేటెడ్ ఇంటీరియర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లపై అంచనాలు ఉన్నాయి.

Renault Kwid Facelift 2026: జులై 3న, మన మార్కెట్‌లో, ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రెనాల్ట్ అధికారికంగా ఆవిష్కరించనుంది. ప్రస్తుతం ఈ కంపెనీ అధికారిక వివరాలను వెల్లడించకపోయినా, ఇటీవల బయటకు వచ్చిన స్పై ఫొటోలు & ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం... కొత్త క్విడ్ డిజైన్, ఇంటీరియర్ & ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులతో రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డాసియా స్ప్రింగ్ ఎలక్ట్రిక్ కారు నుంచి స్ఫూర్తి పొందిన స్టైలింగ్ ఈ మోడల్‌కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకురానుందని అంచనా.

కొత్త లుక్‌

కొత్త క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ముందుభాగంలో Y-షేప్ LED డే టైమ్ రన్నింగ్ లైట్లు ఉండే అవకాశం ఉంది. వెనుక భాగంలో కూడా అదే డిజైన్ థీమ్‌తో కొత్త Y-షేప్ టెయిల్ ల్యాంప్స్ కనిపించనున్నాయి. అయితే ప్రధాన హెడ్‌ల్యాంప్స్ మాత్రం హాలోజన్ యూనిట్లుగానే కొనసాగే అవకాశం ఉంది. కొత్త ఫ్రంట్ & రియర్ బంపర్లు, రిఫ్రెష్ చేసిన గ్రిల్ డిజైన్, కొత్త అలాయ్ వీల్స్ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను అందించనున్నాయి.

ఇది కూడా చదవండి: రూ.2,399కే స్మార్ట్ డ్రైవింగ్ అనుభవం - జియో కార్ సింక్ డివైస్ ప్రత్యేకతలు ఇవే!

ఇంటీరియర్‌

ఇంటీరియర్‌లో కూడా గణనీయమైన మార్పులు కనిపించే అవకాశముంది. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే మరింత పెద్దదైన దాదాపు 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంది. కొత్త స్టీరింగ్ వీల్, రీడిజైన్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అప్‌డేటెడ్ డ్యాష్‌బోర్డ్ డిజైన్ క్యాబిన్‌కు ఆధునిక రూపాన్ని తీసుకురానున్నాయి. మొత్తం ఇంటీరియర్ డిజైన్ కూడా డాసియా స్ప్రింగ్ నుంచి స్ఫూర్తి పొందే అవకాశముందని సమాచారం.

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు!

భద్రత పరంగా కూడా రెనాల్ట్ కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న భద్రత ఫీచర్లతో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించే అవకాశంపై ఆటోమొబైల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో క్విడ్ భద్రత ప్రమాణాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇంజిన్‌

ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ఉన్న 999cc, 1.0 లీటర్, మూడు సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 68 hp పవర్ & 91 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో 5-స్పీడ్ మాన్యువల్ & 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌లు యథాతథంగా కొనసాగనున్నాయి.

ఇది కూడా చదవండి: రియల్ వరల్డ్ మైలేజ్‌లో రెనాల్ట్ డస్టర్‌కు షాక్ ఇచ్చిన స్కోడా కుషాక్!

మైలేజ్‌

ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న రెనాల్ట్ క్విడ్ 21.7 నుంచి 22.5 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తోంది. ఇందులో ఐదుగురు ప్రయాణించే సామర్థ్యం, ఐదు డోర్లు, మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో ఈ ప్రధాన స్పెసిఫికేషన్లు కొనసాగే అవకాశం ఉంది.

ధర

ధర విషయానికి వస్తే, ప్రస్తుతం రెనాల్ట్ క్విడ్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.30 లక్షల నుంచి రూ.5.88 లక్షల వరకు ఉంది. కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు & అప్‌డేటెడ్ ఇంటీరియర్ కారణంగా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారిక ధరలు & పూర్తి ఫీచర్ల వివరాలు జులై 3న జరిగే లాంచ్ కార్యక్రమంలో వెల్లడికానున్నాయి. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో రెనాల్ట్ క్విడ్ మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో JSW నుంచి బిగ్ సర్ ప్రైజ్.. 450 కిమీ వరకు రేంజ్ ఇవ్వనున్న iCaur V23
భారత్‌లో JSW నుంచి బిగ్ సర్ ప్రైజ్.. 450 కిమీ వరకు రేంజ్ ఇవ్వనున్న iCaur V23
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
రూ.9 వేల కంటే తక్కువ EMIతోనే టాటా ఆల్ట్రోజ్‌ను మీ సొంతం చేసుకోవచ్చు! ఇదిగో ఈజీ ప్లాన్‌
5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ఉన్న టాటా ఆల్ట్రోజ్‌ కొనడానికి లోన్‌ ఇస్తారా? డౌన్‌పేమెంట్‌ ఎంత కట్టాలి?
Kawasaki Z900 బైక్‌పై అదిరిపోయే డీల్‌.. వడ్డీ మినహాయింపుతో పాటు ఉచిత యాక్సెసరీస్‌!
Kawasaki Z900 కొనండి.. రూ. 1.25 లక్షల విలువైన డీల్‌ సొంతం చేసుకోండి!
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Embed widget