అన్వేషించండి

రూ.2,399కే స్మార్ట్ డ్రైవింగ్ అనుభవం - జియో కార్ సింక్ డివైస్ ప్రత్యేకతలు ఇవే!

జియో కార్ సింక్‌తో వైర్డ్ Apple CarPlay & Android Autoను వైర్‌లెస్‌గా మార్చుకోండి. ధర, ఫీచర్లు, సపోర్ట్ చేసే కార్లు, సెటప్ విధానం & ప్రయోజనాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

Jio carsync wireless carplay device: నేటి కార్లలో Apple CarPlay & Android Auto ఫీచర్లు సాధారణంగా మారిపోయాయి. నావిగేషన్, మ్యూజిక్, కాల్స్, మెసేజ్‌లు వంటి అనేక సేవలను కారు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఇవి కల్పిస్తున్నాయి. అయితే చాలా కార్లలో ఈ ఫీచర్లను ఉపయోగించాలంటే ప్రతిసారి ఫోన్‌ను USB కేబుల్‌తో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కారు స్టార్ట్ చేసిన తర్వాత కనెక్షన్ కోసం ఎదురుచూడడం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఈ సమస్యకు పరిష్కారంగా జియోథింగ్స్ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జియో కార్ సింక్ ‍‌(Jio CarSync) డివైస్ ప్రస్తుతం కార్ యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. జియో ప్లాట్‌ఫార్మ్స్‌కు చెందిన ఈ చిన్న డాంగిల్ ద్వారా వైర్డ్ Apple CarPlay & Android Autoను వైర్‌లెస్‌గా మార్చుకోవచ్చు.

ధర ఎంత?

ప్రస్తుతం జియో కార్ సింక్ ప్రముఖ ఈ కామర్స్ వేదికలలో సుమారు రూ.2,399 ధరకు అందుబాటులో ఉంది. ఒకసారి ఫోన్‌ను డివైస్‌తో పెయిర్ చేసిన తర్వాత, ప్రతిసారి కారు స్టార్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. దీంతో USB కేబుల్ అవసరమే రాదు.

ఎలాంటి కార్లలో పనిచేస్తుంది?

జియో కార్ సింక్ కొనుగోలు చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇది ఇప్పటికే ఫ్యాక్టరీ ఫిట్ చేసిన వైర్డ్ Apple CarPlay లేదా Android Auto సపోర్ట్ ఉన్న కార్లలో మాత్రమే ఇది పనిచేస్తుంది.

మీ కారులో ఈ రెండు ఫీచర్లు లేకపోతే ఈ డివైస్ ఉపయోగపడదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక ప్రముఖ కార్లలో ఇది సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా మారుతి బాలెనో, హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్, హోండా సిటీ, స్కోడా స్లావియా, ఎంజీ హెక్టర్ వంటి మోడళ్లలో దీనిని ఉపయోగించవచ్చు.

రోజూ Android Auto లేదా Apple CarPlay ఉపయోగించే డ్రైవర్లకు ఇది ఎంతో ఉపయోగకరమైన యాక్సెసరీ అవుతుంది.

స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి?

జియో కార్ సింక్‌లో Bluetooth 5.3తో పాటు 5GHz Wi-Fi సపోర్ట్ అందించారు. వేగవంతమైన & స్థిరమైన కనెక్షన్ కోసం ఈ టెక్నాలజీలు ఉపయోగపడతాయి.

iOS 12 లేదా అంతకంటే పై వెర్షన్ కలిగిన ఐఫోన్లతో పాటు Android 11 లేదా ఆ తర్వాతి వెర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్లకు ఇది అనుకూలంగా పనిచేస్తుంది.

కనెక్టివిటీ కోసం USB Type-A పోర్ట్‌ను ప్రధానంగా అందించారు. అలాగే Type-C అడాప్టర్ కూడా బాక్స్‌లో ఇవ్వడం మరో ప్రత్యేకత.

డిజైన్ పరంగా చూసినా ఈ డివైస్ ఆకట్టుకుంటుంది. మెటల్ యూనిబాడీ డిజైన్ కారణంగా ఇది సాధారణ ప్లాస్టిక్ డాంగిళ్ల కంటే ప్రీమియంగా కనిపిస్తుంది. చిన్న పరిమాణంలో ఉండటంతో డ్యాష్‌బోర్డ్ దగ్గర ఎక్కువ స్థలం ఆక్రమించదు.

సెటప్ ప్రక్రియ చాలా సులభం

జియో కార్ సింక్‌ను ఉపయోగించడం చాలా ఈజీ. మొదటిసారి డివైస్‌ను కారు USB పోర్ట్‌లో కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌ను Bluetooth ద్వారా పెయిర్ చేయాలి. ఒక్కసారి సెటప్ పూర్తయిన తర్వాత ప్రతిసారి కారు స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. కొన్ని Android ఫోన్లలో Wireless Android Auto ఆప్షన్‌ను ముందుగా యాక్టివేట్ చేయాల్సిరావచ్చు. అందువల్ల తొలి సెటప్‌కు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒకసారి కనెక్షన్ పూర్తయిన తర్వాత కేవలం కొన్ని సెకన్లలోనే Apple CarPlay లేదా Android Auto యాక్టివ్ అవుతుంది.

ఏ ఫీచర్లు పనిచేస్తాయి?

జియో కార్ సింక్ ద్వారా Google Maps నావిగేషన్, Spotify & ఇతర మ్యూజిక్ యాప్‌లు, ఫోన్ కాల్స్, WhatsApp వాయిస్ రిప్లైలు వంటి ఫీచర్లను సులభంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా... కారు స్టీరింగ్ వీల్ కంట్రోల్స్, టచ్‌స్క్రీన్ ఇన్‌పుట్‌లు & కారులోని బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ కూడా సాధారణంగానే పనిచేస్తాయి. అంటే వైర్డ్ కనెక్షన్‌లో లభించే అనుభవమే వైర్‌లెస్ రూపంలో పొందవచ్చు.

కొనాలా, వద్దా?

ప్రతిరోజూ కారులో Apple CarPlay లేదా Android Auto ఉపయోగించే వారికి జియో కార్‌సింక్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ప్రతిసారి కేబుల్ కనెక్ట్ చేసే ఇబ్బంది లేకుండా, కారు స్టార్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ కనెక్షన్ లభించడం దీని అతిపెద్ద ప్రయోజనం. ముఖ్యంగా, వైర్ల గందరగోళం లేకుండా క్లీన్ & స్మార్ట్ క్యాబిన్ అనుభవం కోరుకునే వారికి రూ.2,399 ధరలో జియో కార్ సింక్ మంచి విలువను అందించే యాక్సెసరీగా నిలుస్తోంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!
బజాజ్ పల్సర్ 150 vs టీవీఎస్ అపాచీ 160.. మీ స్టైల్‌కి ఏది సరిగ్గా సెట్‌ అవుతుందో తెలుసా?
Bajaj Pulsar 150 వర్సెస్‌ TVS Apache RTR 160.. ఏ బైక్ బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల కంపారిజన్‌
Bajaj Chetak C2501: కంపెనీ చెప్పింది 113 కి.మీ. రేంజ్‌.. నిజంగా వెళ్లింది ఎంత దూరం?
Bajaj Chetak ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫుల్‌ ఛార్జ్‌తో నిజంగా ఎంతదూరం వెళ్లింది? రేంజ్ టెస్ట్‌ రిజల్ట్స్‌
బజాజ్‌ బైక్‌లపై దసరా ఆఫర్లు.. వేలల్లో ఆదా, పండగ ఖర్చులు వచ్చినట్లే!
దసరా వేళ బజాజ్ అదిరిపోయే ఆఫర్లు.. పల్సర్‌ బైక్‌లపై భారీగా డబ్బు ఆదా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
TGERC True Up Charges: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
Embed widget