అన్వేషించండి

వర్షాకాలంలో కార్ డ్రైవింగ్‌ అలర్ట్ - ఈ టిప్స్ మీ తెలిస్తేనే ప్రమాదాలకు చెక్, హ్యాపీ జర్నీ

వర్షాకాలంలో కారు నడిపే వారికి కీలక సూచనలు. టైర్లు, బ్రేకులు, బ్యాటరీ, వైపర్లు, నీటిమడుగులు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుని సురక్షితంగా ప్రయాణించండి.

Monsoon car care driving tips: దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కలిగించే ఈ రుతుపవనాల సీజన్ వాహనదారులకు మాత్రం ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది. తడి రోడ్లు, నీటిగుంతలు, తక్కువ విజిబిలిటీ, ట్రాఫిక్ సమస్యలు, ఆకస్మిక బ్రేక్‌డౌన్‌లు డ్రైవింగ్‌ను ప్రమాదకరంగా మారుస్తాయి. మాన్‌సూన్‌లో డ్రైవింగ్‌ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.

1. వర్షాకాలంలో కారుకు అత్యంత ముఖ్యమైన భాగం టైర్లు. రోడ్డుతో నేరుగా సంబంధం కలిగి ఉండేది టైర్లే కావడంతో వాటి స్థితి బాగుండాలి. టైర్ల ట్రెడ్ లోతు సరిపడా ఉండాలి. ట్రెడ్ అరిగిపోతే నీరు సరిగా బయటకు వెళ్లక కారుపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాగే తయారీ సంస్థ సూచించిన టైర్ ప్రెషర్‌ను పాటించడం కూడా కీలకం.

2. బ్యాటరీ & ఎలక్ట్రికల్ వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అధిక తేమ కారణంగా వైరింగ్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ స్థాయి, టెర్మినల్స్ పరిస్థితిని పరిశీలించాలి. హారన్, పవర్ విండోలు, వైపర్లు, రియర్ డిఫాగర్ వంటి వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలి.

3. వర్షంలో విజిబిలిటీ తగ్గిపోవడం సాధారణం. అందుకే హెడ్‌లైట్లు, టెయిల్ ల్యాంపులు, ఫాగ్ ల్యాంపులు సరిగా పనిచేస్తున్నాయో తనిఖీ చేయాలి. వైపర్ బ్లేడ్లు గాజుపై గీతలు లేకుండా నీటిని తొలగించగలగాలి. వాషర్ ట్యాంక్‌లో తగినంత ద్రవం ఉండాలి. గాజుపై పేరుకుపోయిన దుమ్ము, మురికి వెంటనే తొలగించాలి.

4. బ్రేకింగ్ వ్యవస్థ కూడా పూర్తిగా సక్రమంగా ఉండాలి. తడి రోడ్లపై బ్రేకింగ్ దూరం పెరుగుతుంది. అందువల్ల బ్రేక్ ప్యాడ్లు, డిస్కులు, బ్రేక్ ఫ్లూయిడ్ పరిస్థితిని తనిఖీ చేయాలి. నీటిలో ప్రయాణించిన తర్వాత బ్రేక్‌లను స్వల్పంగా ఉపయోగించడం వల్ల అవి త్వరగా ఆరిపోతాయి & పనితీరు మెరుగుపడుతుంది.

5. తేమ కారణంగా కారులో తుప్పు పట్టే ప్రమాదం ఎక్కువ. కాబట్టి కార్ బాడీపై గీతలు, పెయింట్ ఊడిపోయిన ప్రాంతాలు, తుప్పు మరకలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలి. డోర్ సీల్స్, విండో సీల్స్‌ను కూడా తరచుగా పరిశీలించాలి. డ్రెయిన్ ఛానెల్‌లలో ఆకులు, చెత్త పేరుకుపోకుండా శుభ్రం చేయాలి.

6. ప్రయాణానికి ముందు ఇంజిన్ ఆయిల్, కూలెంట్, వాషర్ ఫ్లూయిడ్ వంటి ద్రవాలను తనిఖీ చేయాలి. టార్చ్, మొబైల్ చార్జర్, పవర్ బ్యాంక్, టోయింగ్ రోప్, వార్నింగ్ ట్రయాంగిల్, గొడుగు వంటి అత్యవసర వస్తువులను కారులో ఉంచుకోవడం మంచిది. అదనంగా రెయిన్‌కోట్, పొడి బట్టలు, టవల్, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉపయోగపడతాయి.

7. వర్షాకాలంలో ఎప్పుడూ సురక్షిత దూరం పాటించాలి. ముందున్న వాహనానికి ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల ఆకస్మిక పరిస్థితుల్లో స్పందించేందుకు సమయం లభిస్తుంది. అధిక వేగం, హఠాత్తుగా స్టీరింగ్ తిప్పడం, ఒక్కసారిగా బ్రేక్ వేయడం వంటి చర్యలను నివారించాలి.

8. నీటిమడుగులు కనిపిస్తే వేగాన్ని తగ్గించాలి. వాటి లోతు ఎంత ఉందో తెలియకుండా దూసుకెళ్లడం ప్రమాదకరం. నీటిలో దాగి ఉన్న గుంతలు, చెత్త లేదా తెరిచి ఉన్న డ్రెయిన్‌లు ప్రమాదాలకు దారి తీస్తాయి. అధిక వేగంతో నీటిని దాటితే ఆక్వాప్లానింగ్ ప్రమాదం పెరుగుతుంది.

9. ఒకవేళ వరద నీటిలోకి వెళ్లిన తర్వాత కారు ఆగిపోతే మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. ముఖ్యంగా పెట్రోల్ లేదా డీజిల్ కార్లలో నీరు ఇంజిన్‌లోకి చేరితే భారీ నష్టం సంభవించవచ్చు. వెంటనే హజార్డ్ లైట్లు ఆన్ చేసి సురక్షిత ప్రదేశానికి వెళ్లి రోడ్‌సైడ్ సహాయం కోరాలి.

10. ప్రయాణానికి ముందు వాతావరణం & ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించడం కూడా చాలా ముఖ్యం. ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించుకోవాలి. నీటిమట్టం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాన్ని వాయిదా వేయడం లేదా సురక్షిత ప్రదేశంలో వేచి ఉండడం ఉత్తమం.

సరైన నిర్వహణ, ముందస్తు జాగ్రత్తలు & బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌తో వర్షాకాలంలో కూడా మీ కారు సురక్షితంగా ఉండటమే కాకుండా, మీరు కూడా ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget