అన్వేషించండి

కారు లోన్ బెటరా, సేవింగ్స్ బెటరా? రూ.8 లక్షల కారు కోసం నెలకు ఎంత ఆదా చేయాలి?

కొత్త కారు కొనాలనుకునే వారు నెలకు ఎంత పొదుపు చేయాలి? రూ.8 లక్షల కారు ధర 5 ఏళ్లలో ఎంత అవుతుంది? సేవింగ్స్‌ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Monthly investment for a new car: ఒకప్పుడు కారు విలాసానికి ప్రతీకగా భావించేవారు. కానీ ఇప్పుడు అదే కారు అవసరంగా మారింది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ప్రయాణాలు, పిల్లల చదువులు వంటి అవసరాల కారణంగా సొంత కారు ఉండటం అనేక మందికి ప్రాధాన్యతగా మారింది. అయితే కారు కొనాలనే ఆలోచన వచ్చిన వెంటనే చాలా మందిని వేధించే ప్రశ్న ఒక్కటే. అంత పెద్ద మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలి? లోన్ తీసుకోవాలా? లేక ముందుగానే పొదుపు చేసి కొనాలా?

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన ప్రణాళికతో ముందుకు వెళితే కారు కొనుగోలు ఎలాంటి భారంగా మారదు. పైగా లోన్ వడ్డీ భారం లేకుండా మీ కలల కారును సొంతం చేసుకోవచ్చు.

ముందుగా బడ్జెట్ నిర్ణయించుకోవాలి

కారు కొనుగోలు ప్రణాళికలో మొదటి అడుగు బడ్జెట్‌ను నిర్ణయించడం. ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి మధ్యతరగతి కుటుంబ కారు ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంది. మీ ఆదాయం, కుటుంబ అవసరాలు & భవిష్యత్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఒక బడ్జెట్‌ను ఖరారు చేయాలి.

ఉదాహరణకు మీరు రూ.8 లక్షల ఆన్‌రోడ్‌ ధరతో వచ్చే కారు కొనాలని భావిస్తున్నట్లయితే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

కారు లోన్ తీసుకోవడం ఎంతవరకు మంచిది?

ప్రస్తుతం చాలా బ్యాంకులు కారు విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణం అందిస్తున్నాయి. రూ.8 లక్షల కారు కొనుగోలు చేయాలంటే సుమారు రూ.1.60 లక్షలు డౌన్ పేమెంట్‌గా చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని 5 నుంచి 7 సంవత్సరాల పాటు EMIల రూపంలో చెల్లించవచ్చు. కారు లోన్ తీసుకోవడం చాలా సులభంగా అనిపించినా... రుణంపై వడ్డీ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్‌టీల కారణంగా కారు వాస్తవ ధర కంటే ఇంకా ఎక్కువ మొత్తం తిరిగి చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా సంవత్సరాల పాటు EMI చెల్లించడం కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

పొదుపు చేసి కొనడం ఎందుకు ఉత్తమం?

కొంతకాలం పాటు ఓపికగా పొదుపు చేసి కారు కొనుగోలు చేస్తే వడ్డీ భారం ఉండదు. అలాగే నెలవారీ కిస్తీ ఒత్తిడి కూడా ఉండదు. ఆర్థికంగా మరింత ప్రశాంతత లభిస్తుంది. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కారు ధరలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటాయి. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో కార్ల ధరలు సగటున ఏడాదికి 10 శాతం వరకు పెరుగుతున్నాయి. అంటే ప్రస్తుతం రూ.8 లక్షల విలువైన కారు ధర మరో ఐదేళ్ల తర్వాత సుమారు రూ.12 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. అందుకే మీ సేవింగ్స్ లక్ష్యాన్ని కూడా అదే స్థాయిలో నిర్ణయించుకోవాలి.

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

ఐదేళ్ల కాలపరిమితి ఉన్న లక్ష్యాల కోసం నిపుణులు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లను సూచిస్తున్నారు. ఈ ఫండ్లు... ఈక్విటీ & డెట్ ఆస్తులు రెండింటిలోనూ పెట్టుబడి పెడతాయి. మార్కెట్ మంచి స్థితిలో ఉన్నప్పుడు ఇవి అధిక రాబడులు అందించే అవకాశం ఉండగా, మార్కెట్ ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు డెట్ పెట్టుబడులు రక్షణ కల్పిస్తాయి.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెడితే పెద్ద లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.

ఐదేళ్లలో రూ.12 లక్షలు కూడబెట్టడానికి నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి?

సగటు వార్షిక రాబడి 8 శాతం వస్తుందని అనుకుంటే, నెలకు రూ. 16,346 పెట్టుబడి పెట్టాలి.

సగటు వార్షిక రాబడి 10 శాతం వస్తుందని అనుకుంటే, నెలకు రూ. 15,550 పెట్టుబడి పెట్టాలి.

సగటు వార్షిక రాబడి 12 శాతం వస్తుందని అనుకుంటే, నెలకు రూ. 14,796 పెట్టుబడి పెట్టాలి.

ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం, రాబడి తక్కువ వచ్చినా లక్ష్యం చేరుకునేలా నెలకు రూ. 16,346 వరకు పెట్టుబడి పెట్టడం సురక్షితమైన మార్గం. ఒకవేళ రాబడి ఎక్కువగా వస్తే ఆ అదనపు మొత్తంతో మీరు మరింత ప్రీమియం కారు లేదా అదనపు ఫీచర్లతో కూడిన మోడల్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

మొత్తంగా చూస్తే, కారు కొనుగోలు అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాకుండా ఆర్థిక ప్రణాళికతో తీసుకోవాల్సిన నిర్ణయం. సరైన పొదుపు అలవాటు, క్రమబద్ధమైన SIP పెట్టుబడి & దీర్ఘకాలిక ప్రణాళికతో ఎలాంటి రుణభారం లేకుండా మీ కలల కారును మీ ఇంటి ముందుకు తీసుకురావచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget