అన్వేషించండి

Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?

డీప్‌ఫేక్ కంటెంట్, వీడియోల నిలిపివేత తప్పిదాలపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణ లేఖ రాశారు. దీంతో మెటా-కేంద్రం మధ్య ఉన్న వివాదం ముగిసినట్లు కనిపిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెటా సీఈఓ జుకర్‌బర్గ్ భారత్ ప్రభుత్వానికి క్షమాపణ లేఖ పంపారు.
  • డీప్‌ఫేక్, CSAM కంటెంట్, వేదిక లోపాలపై విచారం వ్యక్తం చేశారు.
  • ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపు వివాదంతో ప్రభుత్వ చర్యలు మొదలయ్యాయి.
  • 'సేఫ్ హార్బర్' రక్షణ రద్దు హెచ్చరికతో మెటా దిగొచ్చింది.

న్యూఢిల్లీ: మెటా, భారత ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదం ముగిసినట్లు కనిపిస్తోంది. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ డీప్ ఫేక్ కంటెంట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణ లేఖ పంపారు. ఆయన CSAM (పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్), డీప్ ఫేక్ కంటెంట్, ప్లాట్ ఫారమ్ నిర్వహణలో జరిగిన తప్పిదాలపై సారీ చెప్పారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని రకాల కంటెంట్ ను ప్రోత్సహించడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు మెటా సంస్థ అంగీకరించింది. నీట్ పేపర్ లీకేజీ నిరసన వేళ ప్రధాని మోదీ Gen Z యువతను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను జులై 23న ఫేస్‌బుక్ కొన్ని గంటల పాటు నిలిపివేయడం వివాదాస్పదమైంది. 

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, మెటా కేవలం 'ఇంటర్మీడియరీ'లోకి రాదని స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఏ కంటెంట్ ఎవరికి చేరుతుందో కంపెనీ స్వయంగా నిర్ణయిస్తుంది. అలాంటి సందర్భంలో, IT చట్టం కింద లభించే సేఫ్ హార్బర్ రక్షణ మెటాకు వర్తించదని ప్రభుత్వం మెటాకు స్పష్టం చేసింది. మెటా ఈ మొత్తం విషయంలో తన తప్పును అంగీకరించి, విచారం వ్యక్తం చేసి, క్షమాపణలు చెప్పింది.  

సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ దుర్వినియోగంపై ప్రభుత్వం ఆందోళన 

భారత చట్టాలను తప్పనిసరిగా పాటించాలని మెటాకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల దుర్వినియోగంపై కూడా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అంతకుముందు, ప్రధాని మోడీ పోస్ట్ తొలగింపు అంశాన్ని ప్రభుత్వం లేవనెత్తింది. ప్లాట్ ఫారమ్ లో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన కంటెంట్ సమస్యను కూడా లేవనెత్తింది. తమ వద్ద కఠినమైన అంతర్గత నియమాలు అమలులో ఉన్నాయని మెటా బదులిచ్చింది. తమ ప్లాట్ ఫారమ్ ను దుర్వినియోగం చేయడం ఏ పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని మెటా పేర్కొంది.

Also Read: Monsoon Session Parliament: కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?

మంత్రి, అధికారులతో సమావేశమైన మెటా ప్రతినిధులు

అంతకుముందు, మెటా గ్లోబల్ టీమ్ బుధవారం IT మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ తొలగింపు విషయంలో మెటా అధికారులను కేంద్ర ప్రభుత్వం పిలిపించింది. సమావేశంలో ముఖ్యమైన పోస్ట్ లపై జరిగిన తప్పుడు చర్యలు, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో బాలల లైంగిక వేధింపులు, వేధింపుల కంటెంట్ (CSAM)ను  నిరోధించడంలో వైఫల్యం, ఇతర నియంత్రణ సమస్యలపై చర్చ జరిగింది.

మెటా సీనియర్ అధికారుల బృందం ఈరోజు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ను సైతం కలిసింది. దాదాపు అరగంట పాటు మంత్రితో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోడీ ఇటీవల చేసిన ఫేస్ బుక్ పోస్ట్ ను కొన్ని గంటల పాటు తొలగించడంపై చర్చించారు. ప్రధాని మోదీ ఈ పోస్ట్ లో యువతను ఉద్దేశించి ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టెక్నికల్ ప్రాబ్లం సాకుగా చూపుతూ మెటా కంపెనీ క్షమాపణలు చెప్పింది. పోస్ట్ పొరపాటున రిమూవ్ అయిందని, తరువాత పోస్టును పునరుద్ధరించామని పేర్కొంది.

సేఫ్ హార్బర్ రక్షణ అంటే ఏమిటీ..

వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌కు సమాచార సాంకేతిక చట్టం సెక్షన్ 79 కింద సేఫ్ హార్బర్ (థర్డ్ పార్టీ కంటెంట్ నుంచి చట్టపరమైన రక్షణ) ఉంటుంది. ఇదే విధంగా మెటాకు కూడా కొన్ని చట్టపరమైన మినహాయింపులు సేఫ్ హార్బర్ వల్ల దక్కాయి. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ రద్దు అయితే మెటా పబ్లిషర్‍గా గుర్తించాలి. ఈ క్రమంలో సంస్థకు చెందిన సోషల్ మీడియాలో పోస్టు అయ్యే పోస్టులకు మెటా అధికారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమేదు చేసే అవకాశం కేంద్రానికి ఉంటుంది. 3 రోజుల్లో జుకర్ బర్గ్ క్షమాపణ చెప్పకపోతే ఈ సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేస్తామని పార్లమెంటరీ స్థాయి కమిటీ హెచ్చరించింది. దాంతో మెటా టీమ్ భారత్‌కు వచ్చి విచారణ ఎదుర్కొంటోంది. మరోవైపు జుకర్ బర్గ్ సైతం మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పారు.

 

Frequently Asked Questions

మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ భారత ప్రభుత్వానికి ఎందుకు క్షమాపణలు చెప్పారు?

CSAM (పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్), డీప్ ఫేక్ కంటెంట్, ప్లాట్‌ఫారమ్ నిర్వహణలో జరిగిన తప్పిదాలపై జుకర్ బర్గ్ క్షమాపణలు చెప్పారు. కొన్ని రకాల కంటెంట్‌ను ప్రోత్సహించడానికి మెటా డబ్బు ఖర్చు చేసినట్లు కూడా అంగీకరించింది.

మెటా వివాదంలో చిక్కుకోవడానికి దారితీసిన ముఖ్య సంఘటన ఏమిటి?

జులై 23న ప్రధాని మోదీ Gen Z యువతను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఫేస్‌బుక్ కొన్ని గంటల పాటు నిలిపివేయడం వివాదాస్పదమైంది. మెటా దీనికి సాంకేతిక సమస్య అని చెప్పి క్షమాపణలు కోరింది.

మెటాకు వర్తించే సేఫ్ హార్బర్ రక్షణ అంటే ఏమిటి?

సమాచార సాంకేతిక చట్టం సెక్షన్ 79 కింద వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్ నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఇది చట్టపరమైన రక్షణ. ఇది రద్దు అయితే, మెటా పబ్లిషర్‌గా పరిగణించబడి క్రిమినల్ కేసులను ఎదుర్కొంటుంది.

మెటా పాత్రపై భారత ప్రభుత్వం వైఖరి ఏమిటి?

మెటా కేవలం 'ఇంటర్మీడియరీ' కాదని, ఏ కంటెంట్ ఎవరికి చేరుతుందో నిర్ణయిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కారణంతో IT చట్టం కింద సేఫ్ హార్బర్ రక్షణ మెటాకు వర్తించదని పేర్కొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Monsoon Session Parliament: కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?
కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget