అన్వేషించండి

PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ

PM Narendra Modi On CJP Protest | జంతర్ మంతర్ నిరసనలో తనపై, తన తల్లిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యువతను క్షమించి, శిక్షించే బదులు సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో తనపై అనుచిత భాషను వాడారన్న వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అర్ధరాత్రి స్పందించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న పిల్లలను తాను క్షమించాలని అనుకుంటున్నానని, సమాజం కూడా వారిని శిక్షించే బదులు సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ సంఘటన గురించి ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అందులో ఆయన ఈ ఘటన గురించి మాట్లాడుతూ, దయ, ఐక్యత కోసం పిలుపునిచ్చారు.

'నన్ను, నా దివంగత తల్లిని దూషించారు'

సీజేపీ ఆందోళనను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, జంతర్ మంతర్ వద్ద జరిగిన పరిణామాలను దేశమంతా, ప్రపంచమంతా చూసిందని అన్నారు.
"హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో మాట్లాడాలనిపిస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏం జరిగిందో దేశమంతా, ప్రపంచమంతా చూసింది. కొందరు అల్లరి పిల్లలు అత్యంత అసభ్యకరమైన భాషను వాడారు. ఏ నాగరిక సమాజంలోనూ స్థానం లేని పదాలను వాడారు. వారు నాతో పాటు చివరికి చనిపోయిన నా తల్లిని కూడా దూషించారు. అదంతా ఎంత అనాగరిమో మాటల్లో నేను చెప్పలేను" అన్నారు.

పిల్లలు తప్పులు చేస్తే, వారికి మార్గదర్శనం వహించాలి

బాల్యం అనేది తప్పులు జరిగే సమయం, వాటి నుంచి నేర్చుకునే టైమ్ అని ప్రధాని అన్నారు. ఈరోజు, నేను వేరే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ఘటనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ‘సమాజంలో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. మన బిడ్డలు అలాంటి భాషను ఉపయోగించడం కల్చరల్ షాక్’ అన్నారు.

శిక్షించడం వల్ల పరిస్థితిలో మార్పు రాదు.. 

తప్పు చేసిన విద్యార్థులకు శిక్షలు విధించే బదులు వారికి సరైన మార్గాన్ని చూపించాలని పిలుపునిచ్చారు. ఆ పిల్లలను దగ్గరకు తీసుకుని, వారికి సరైన మార్గాన్ని చూపించాల్సిన సమయం ఇది. దారితప్పిన వారికి సరైన దారి చూపించడం పెద్దలుగా మన బాధ్యత. వారిని శిక్షించడం, ఒక కోర్టు నుండి మరో కోర్టుకు తిప్పడం లేదా సమాజంలో వారిని వేధింపులకు గురిచేయడం వల్ల పరిస్థితిలో మార్పు రాదన్నారు. 

Also Read: PM Modi Video: "భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో! https://telugu.abplive.com/news/todays-top-10-news-headlines-today-abp-desam-morning-headlines-31-july-2026-top-news-headlines-updates-telugu-news-254978

వారిని క్షమిస్తున్నాను..

ఈ ఘటనలో ప్రమేయం ఉన్న విద్యార్థులను క్షమించాలనుకుంటున్నానని, తన అభిప్రాయాన్ని సమాజం అంగీకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ‘నేను వారిని క్షమించాలనుకుంటున్నాను. అందరూ నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. కొన్నిసార్లు మన పళ్ల కింద మన నాలుకే పడి రక్తం వస్తుంది. అంతమాత్రాన పళ్లను ఊడగొట్టుకోము కదా! ఎందుకంటే పళ్లు, నాలుక రెండూ మనవే. ఈ పిల్లలు కూడా మనవారే. దారితప్పిన వారికి మార్గదర్శకత్వం చేయడం లాంటి కష్టమైన పని స్వీకరించాలి’ అన్నారు.

దేశం కోసం కలిసి పనిచేద్దాం

తమ తప్పుల నుండి నేర్చుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులను కోరారు. దేశం కోసం కలిసి ముందుకు సాగుదాం, కొత్తది ఏదైనా నేర్చుకుందాం, మన తప్పుల నుండి కూడా పాఠాలు నేర్చుకుందామని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశం వేగంగా పురోగమిస్తోంది, మీరందరూ కూడా సక్సెస్ కావాలన్నదే తన కలగా పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేద్దాం. మీ తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగాలని తన సందేశాన్ని ముగించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget