మొక్కలు కెమికల్ సిగ్నల్స్, ఎలక్ట్రికల్ సంకేతాలు, భూగర్భ నెట్‌వర్క్‌ల ద్వారా సమాచారం మార్పిడి చేసుకుంటాయి. సైన్స్ దీన్ని నిర్ధారిస్తుంది, ఆధ్యాత్మికత చాలాకాలం క్రితమే గుర్తించింది.
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Science Spiritual: మొక్కలు మాట్లాడుకుంటాయా? ఒకదానితో మరొకటి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయ్? దీనివెనుకున్న సైన్స్ ఏంటి? ఆధ్యాత్మిక దృష్టితో ఎలా చూడాలి? తెలుసుకుందాం..

- మొక్కలు రసాయనాలు, విద్యుత్ సంకేతాలతో పరస్పరం మాట్లాడుకుంటాయి.
- భూగర్భ నెట్‌వర్క్ ద్వారా పోషకాలు, హెచ్చరికలు మార్పిడి చేసుకుంటాయి.
- బోస్ ప్రయోగాల ద్వారా మొక్కల సున్నితత్వం స్పందించడం నిరూపితమైంది.
- ఆధ్యాత్మికంగా మొక్కలు ప్రాణం ఉన్న జీవులు, పూజనీయమైనవి.
Chemical Signaling: మొక్కలు మనుషుల్లా నోటితో మాట్లాడవు కానీ కెమికల్ సిగ్నల్స్, ఎలక్ట్రికల్ సంకేతాలు, భూగర్భ నెట్ వర్క్ ల ద్వారా ఒకదానితో మరొకటి సమాచారం మార్పిడి చేసుకుంటాయి. సైన్స్ దీన్ని నిర్ధారిస్తోంది..ఆధ్యాత్మికత దీన్ని చాలాకాలం క్రితమే గుర్తించింది
వాయుమార్గంలో రసాయన భాష
మొక్కలపై కీటకాలు వాలినప్పుడు, మొక్కలకు హాని కలిగినప్పుడు Volatile Organic Compounds అనే సువాసన రసాయనాలను గాలిలో విడుదల చేస్తాయి. పక్కనున్న మొక్కలు వీటిని గ్రహించి తమ రక్షణ వ్యవస్థను ముందుగానే సిద్ధం చేసుకుంటాయ్. ఇది హెచ్చరిక సందేశం లాంటిది. కత్తిరించిన గడ్డి వాసన కూడా ఇందుకు ఓ ఉదాహరణ
శ్రావణమాసం 2026: శుభదినాలు, వరలక్ష్మీ వ్రతం తేదీలు, పూజా విధానాలు!
పెరుగుదల వ్యూహం
పక్కనున్న మొక్క ఎంత వేగంగా పెరుగుతుందో దాని సువాసన ద్వారా తెలుసుకుని తాము కూడా ఎక్కువ లేదా తక్కువ శక్తి పెరుగుదలకు రక్షణకు వినియోగి్తాయి. పోటీని అంచనా వేసే తెలివి ఇది
వుడ్ వైడ్ వెబ్
మైకోరైజల్ ఫంగస్ నెట్ వర్క్ ద్వారా వేర్లు కలుస్తాయ్.. కొన్ని సందర్భాల్లో పోషకాలు, హెచ్చరిక సంకేతాలు ఓ మొక్క నుంచి మరొకదాన్ని చేరుతాయి. మొక్క లోపల జాస్మోనిక్ యాసిడ్, గ్లుటమేట్, ఎలక్ట్రికల్ పల్స్‌లు దూర భాగాలకు సమాచారం పంపుతాయి. ఇది జంతువుల నాడీ వ్యవస్థను గుర్తుకు తెస్తుంది
జగదీశ్ చంద్రబోస్ ప్రయోగం
భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ క్రెస్కోగ్రాఫ్ తో మొక్కల ఉద్దీపనలకు స్పందిస్తాయని, పల్స్ ఉందని, విషం - సంగీతం- స్పర్శకు ప్రతిస్పందిస్తాయని చూపించారు. ఆయన మొక్కల్లో సున్నితత్వాన్ని జంతువులకు సమానంగా చూసారు.
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే..
హిందూ తత్వంలో అన్ని ప్రాణులు మనిషి, జంతువు, మొక్క ఒకే బ్రహ్మం/ప్రాణం నుంచి వచ్చాయి. మొక్కలు కూడా ప్రాణం ఉన్న జీవులు, ఇది ఆధునిక సైన్స్ చూపిస్తున్న పరస్పర అనుసంధానానికి సమానం. రుగ్వేదం, అథర్వవేదంలో మొక్కలను దేవతలుగా, వనస్పతిగా, ఔషధ శక్తిగా వర్ణించారు. తులసి, రావి, మర్రి, బిల్వం వంటి చెట్లను దైవ స్వరూపంగా పూజిస్తారు. అవి కేవలం చెట్లు కావు..దైవ సాన్నిధ్యం. ఆధ్యాత్మికంగా ప్రకృతి అంతా ఓ జీవ నెట్‌వర్క్. మొక్కలు ఓదానికొకటి సహాయం చేస్తూ ఉండడం..అన్నీ ఒక్కటే అనే భావనను నిర్ధారిస్తుంది.
మన మాటలు మొక్కలు వింటాయా?
కొన్ని ప్రయోగాలు సంగీతం, మృదువైన మాటలకు మొక్కలు బాగా పెరుగుతాయని, కఠిన ధ్వనులకు మందగిస్తాయని సూచిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ప్రేమగా మాట్లాడితే ప్రకృతి స్పందిస్తుందనే నమ్మకానికి ఇది దగ్గరగా ఉంది.
సైన్స్ - ఆధ్యాత్మికం
ఓవరాల్ గా చెప్పుకుంటే.. సైన్స్ మొక్కల కమ్యూనికేషన్ రసాయనాలను, నెట్‌వర్క్ లుగా చూస్తుంది. ఆధ్యాత్మికత జీవ సంబంధం, ప్రాణ సంభాషణగా చూస్తుంది. రెండూ చెప్పేది ఒక్కటే.. మొక్కలు నిశ్శబ్దంగా అద్భుతంగా ఓదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయి. వాటిని గౌరవించాలి, పూజించాలి, రక్షించాలి
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
Frequently Asked Questions
మొక్కలు ఒకదానితో ఒకటి ఎలా సంభాషించుకుంటాయి?
మొక్కలు వాయుమార్గంలో సమాచారం ఎలా పంచుకుంటాయి?
మొక్కలకు హాని కలిగినప్పుడు Volatile Organic Compounds (సువాసన రసాయనాలను) గాలిలో విడుదల చేస్తాయి. పక్కనున్న మొక్కలు వీటిని గ్రహించి తమ రక్షణ వ్యవస్థను సిద్ధం చేసుకుంటాయి.
జగదీశ్ చంద్రబోస్ మొక్కల గురించి ఏం కనుగొన్నారు?
జగదీశ్ చంద్రబోస్ క్రెస్కోగ్రాఫ్‌తో మొక్కలు ఉద్దీపనలకు, విషం, సంగీతం, స్పర్శకు ప్రతిస్పందిస్తాయని చూపించారు. ఆయన మొక్కల సున్నితత్వాన్ని జంతువులతో సమానంగా చూసారు.
మొక్కల సంభాషణ గురించి ఆధ్యాత్మిక దృక్పథం ఏమిటి?
హిందూ తత్వంలో అన్ని ప్రాణులు ఒకే బ్రహ్మం నుంచి వచ్చాయి, మొక్కలు ప్రాణం ఉన్న జీవులు. ప్రకృతి అంతా ఒక జీవ నెట్‌వర్క్ అని ఆధ్యాత్మికత చెబుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















