సాంకేతిక లోపాల కారణంగా లేదా దరఖాస్తులో, డాక్యుమెంట్లలో, బ్యాంక్ అకౌంట్ వివరాలలో పొరపాట్లు ఉండటం వల్ల PF క్లెయిమ్ సెటిల్మెంట్లో ఆలస్యం జరగవచ్చు.
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
EPFO Update: మీరు PF క్లెయిమ్ కోసం అప్లై చేసుకున్నారా, అయితే 20 రోజుల కంటే ఎక్కువ సమయం గడిచినా బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాకపోతే ఏం చేయాలో తెలుసుకోండి.

- పీఎఫ్ క్లెయిమ్ చేసినా, డబ్బులు రావడంలో ఆలస్యం జరుగుతోంది.
- సాంకేతిక లోపాలు, వివరాలు సరిచూడకపోవడం ఆలస్యానికి ప్రధాన కారణం.
- క్లెయిమ్ స్థితి, వ్యక్తిగత వివరాలు ముందుగా సరిచూసుకోవాలి.
- ఆలస్యమైతే, EPFiGMS పోర్టల్‌లో ఆన్‌లైన్ ఫిర్యాదు చేయండి.
EPFO Latest Update | భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో దాదాపు 34 కోట్ల మంది వరకు EPFO సభ్యులుగా ఉన్నారు. కొన్ని రోజుల కిందట ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, కేంద్ర కార్మికశాఖ నిర్ణయం ప్రకారం 8.25 శాతం వడ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది. కొందరు అవసరాల కోసం ఆ నగదులో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తారు. అయితే ఉద్యోగి PF క్లెయిమ్ చేసిన తర్వాత వీలైనంత త్వరగా బ్యాంక్ ఖాతాలో మనీ క్రెడిట్ కావాలని ఆశగా ఎదురుచూస్తారు. అయితే మీరు కూడా PF క్లెయిమ్ కోసం అప్లై చేసుకుని, చాలా రోజులు (దాదాపు 20 రోజులు) గడిచినా ఇప్పటివరకు మీ ఖాతాలో డబ్బులు రాకపోతే, కొన్ని విషయాలు తెలుసుకోండి. కొన్నిసార్లు సాంకేతిక లోపాల కారణంగా పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్లో ఆలస్యం కావచ్చు.
డబ్బులు రాకపోతే ఉద్యోగులు ఏం చేయాలంటే..
మీరు PF క్లెయిమ్ చేసి దాదాపు 20 రోజులు గడిచిపోయి, ఇప్పటివరకు మీ డబ్బులు రాకపోతే, ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేయండి.
- ముందుగా మీ PF క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయండి.
- మీ అప్లికేషన్ లో ఏమైనా పొరపాటు జరిగిందేమో చెక్ చేసి నిర్ధారించుకోవాలి.
- అలాగే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి.
- దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకోండి.
- అలాగే మీ ఆధార్‌కు సంబంధించిన వివరాలు చెక్ చేయాలి.
కొన్నిసార్లు ఈపీఎఫ్ఓ ఖాతాదారుల తప్పిదం వల్ల కూడా డబ్బులు రావడంలో ఆలస్యం జరుగుతుంది. అందుకే మీ వైపు నుండి ఏమైనా పొరపాటు జరిగిందేమో చెక్ చేసుకోవడం మంచిది.
ఏ కారణంతో డబ్బులు రావడంలో ఆలస్యమైంది?
క్లెయిమ్ చేసిన PF డబ్బులు త్వరగా జమకావడం కోసం EPFO ఒక కొత్త ఇంటిగ్రేటెడ్ IT సిస్టమ్‌ను తయారు చేసింది. అన్ని వివరాలు వెరిఫై అయ్యాక క్లెయిమ్ మనీ 2 నుండి 3 రోజుల్లోనే బ్యాంక్ ఖాతాలో జమ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అయినా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా చాలా కేసుల్లో మనీ రావడానికి 20 రోజుల కంటే ఎక్కువ టైమ్ పట్టింది. అందుకే క్లెయిమ్ ప్రాసెస్‌ను మరింత వేగంగా పూర్తి చేయడానికి, కొత్త విధానాన్ని మెరుగుపరచాలని EPFO అధికారులు సాంకేతిక నిపుణులను కోరారు.
ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి
- ఆన్‌లైన్‌లో కంప్లైంట్ చేయడానికి ముందుగా EPFiGMS అధికారిక పోర్టల్‌కు వెళ్లండి.
- ఆ తర్వాత ఈపీఎఫ్ సభ్యులు Register Grievance పై క్లిక్ చేయాలి.
- ఆపై PF Member ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మీ UAN నంబర్‌ను నమోదు చేయండి.
- ఆ తర్వాత క్యాప్చా (Captcha) సరిగ్గా టైప్ చేసి Get Details పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత OTP వస్తుంది, దాంతో వెరిఫికేషన్ చేయండి.
- ఆపై మీ వ్యక్తిగత వివరాలను ఫిల్ చేయాలి.
- ఇప్పుడు మీరు ఏ PF Member ID కి సంబంధించి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో అది సెలక్ట్ చేసుకోవాలి.
- ఫిర్యాదు కేటగిరీని సెలక్ట్ చేసుకుని, సమస్య పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.
- మీ పీఎఫ్ ఖాతా, వ్యక్తిగత వివరాలన్నీ సరిచూసుకుని సబ్మిట్ చేయాలి.
- ముఖ్యంగా ఆ తర్వాత వచ్చే రిఫరెన్స్ నంబర్‌ను భవిష్యత్ అవసరాల కోసం ఖచ్చితంగా సేవ్ చేసుకోండి.
Frequently Asked Questions
PF డబ్బులు ఖాతాలో జమ కావడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది?
PF క్లెయిమ్ చేసిన 20 రోజుల తర్వాత కూడా డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
ముందుగా మీ PF క్లెయిమ్ స్టేటస్, అప్లికేషన్‌లో పొరపాట్లు, అన్ని డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ వివరాలు సరిచూసుకోవాలి.
ఆలస్యమైన PF క్లెయిమ్ గురించి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు ఎలా చేయాలి?
EPFiGMS అధికారిక పోర్టల్‌కు వెళ్లి, 'Register Grievance'పై క్లిక్ చేసి, UAN, ఇతర వివరాలతో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. చివరగా రిఫరెన్స్ నంబర్ సేవ్ చేసుకోవాలి.
ట్రెండింగ్ వార్తలు























