అన్వేషించండి

42 డిగ్రీల వేడిలో AC టెస్ట్‌: డస్టర్ కూలింగ్ బెటరా? సియెర్రా పెర్ఫార్మెన్స్‌ బెటరా?

42.2 డిగ్రీల తీవ్ర ఎండల్లో Renault Duster & Tata Sierra SUVల AC పనితీరును పరీక్షించారు. ముందు & వెనుక సీట్ల కూలింగ్ సామర్థ్యం, వేడి తగ్గుదల వివరాలు తెలుసుకోండి.

Renault Duster vs Tata Sierra AC performance: తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరంలో ఎక్కువ కాలం ఎండలు మండుతూనే ఉంటాయి. దీంతో, కారు కొంటున్నవాళ్లు, ముఖ్యంగా SUV కొనుగోలు చేసేవాళ్లు ఇంజిన్ పనితీరు, ఫీచర్లు, మైలేజ్‌తో పాటు AC పనితీరుపై కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఎక్స్‌పర్ట్‌లు నిర్వహించిన ప్రత్యేక AC పరీక్షలో Renault Duster & Tata Sierra మధ్య ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి.

ఈ పరీక్షలో రెండు SUVలను రెండు గంటల పాటు నేరుగా ఎండలో పార్క్ చేశారు. అన్ని కిటికీలు మూసి ఉంచి, వాహనాల లోపలి ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి చేరుకునేలా చేశారు. అనంతరం అత్యాధునిక థర్మోకపుల్ సెన్సర్ల సహాయంతో క్యాబిన్ ఉష్ణోగ్రత, AC వెంట్ ఉష్ణోగ్రత, ముందు & వెనుక సీట్ల వద్ద ఉష్ణోగ్రతలను కొలిచారు.

రెనాల్ట్ డస్టర్ AC పనితీరు

పరీక్ష ప్రారంభ సమయంలో Renault Duster క్యాబిన్ ముందు భాగంలో ఉష్ణోగ్రత 51.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను ఆన్ చేసిన కేవలం ఒక నిమిషంలోనే ఉష్ణోగ్రత 5.7 డిగ్రీలు తగ్గింది. వాహనం రోడ్డుపైకి వచ్చిన తర్వాత కూలింగ్ వేగం మరింత పెరిగింది. ఐదు నిమిషాల డ్రైవింగ్‌లోనే మరో 12.3 డిగ్రీల తగ్గుదల కనిపించింది. మొత్తం 16 నిమిషాల తర్వాత ముందు సీట్ల భాగంలో ఉష్ణోగ్రత 30.5 డిగ్రీలకు చేరింది. అంటే ప్రారంభ స్థాయి నుంచి 20.7 డిగ్రీల వరకు తగ్గింది.

వెనుక సీట్ల భాగంలో ప్రారంభ ఉష్ణోగ్రత 50 డిగ్రీలుగా నమోదైంది. ఒక నిమిషంలో 5.5 డిగ్రీలు తగ్గగా, 16 నిమిషాల తర్వాత 31 డిగ్రీలకు చేరుకుంది. చివరి నిమిషంలో స్వల్పంగా ఉష్ణోగ్రత పెరిగినా మొత్తం మీద 16.5 డిగ్రీల తగ్గుదల నమోదైంది. వేగం పెరిగే కొద్దీ డస్టర్ AC ప్రభావం కూడా మెరుగుపడినట్లు పరీక్షలో స్పష్టమైంది.

టాటా సియెర్రా AC పనితీరు

Tata Sierraలో అమర్చిన డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రారంభం నుంచే ఆకట్టుకుంది. ఒక నిమిషంలోనే ముందు క్యాబిన్ ఉష్ణోగ్రత 9.2 డిగ్రీలు తగ్గింది. ఇది డస్టర్‌తో పోలిస్తే గణనీయంగా మెరుగైన ప్రారంభ కూలింగ్‌గా చెప్పొచ్చు. ఐదు నిమిషాల డ్రైవింగ్‌లో మరో 6.5 డిగ్రీల తగ్గుదల నమోదైంది. మొత్తం 16 నిమిషాల్లో, ప్రారంభ స్థాయి కంటే 18.2 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.

వెనుక సీట్ల భాగంలో ప్రారంభ ఉష్ణోగ్రత ముందు భాగం కంటే అప్పటికే 5.2 డిగ్రీలు తక్కువగా ఉంది. AC ఆన్ చేసిన ఒక నిమిషంలో 6.3 డిగ్రీలు తగ్గింది. ఐదు నిమిషాల డ్రైవింగ్ తర్వాత మరో 4.9 డిగ్రీలు తగ్గింది. పరీక్షలో వెనుక భాగంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత 31.5 డిగ్రీలు. మొత్తంగా 13.5 డిగ్రీల తగ్గుదల కనిపించింది. సియెర్రాలో బ్లోయర్ బలం చాలా మెరుగ్గా ఉండటంతో చల్లని గాలి మొత్తం క్యాబిన్‌లో సమానంగా వ్యాపించినట్లు ఎక్స్‌పర్ట్‌లు గుర్తించారు.

ఏ కారుది మెరుగైన AC?

ప్రారంభ కూలింగ్ విషయంలో Tata Sierra స్పష్టంగా ఆధిక్యం ప్రదర్శించింది. అయితే దీర్ఘకాలిక కూలింగ్ & మొత్తం ఉష్ణోగ్రత తగ్గుదల పరంగా Renault Duster ముందంజలో నిలిచింది. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో డస్టర్ AC పనితీరు మరింత బలంగా మారడం విశేషం.

మొత్తం మీద చూస్తే, వేగంగా చల్లబడే క్యాబిన్ కోరుకునేవారికి Tata Sierra మంచి ఎంపికగా కనిపిస్తే, స్థిరమైన & డీప్‌ కూలింగ్ కోసం Renault Duster కొంత మెరుగైన ఫలితాలను అందించింది. ఎండల సమయంలో కుటుంబంతో తరచుగా ప్రయాణించే వారికి ఈ పరీక్ష ఫలితాలు ఉపయోగకరమైన గైడెనస్‌ ఇస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!
టాటా కారు కొనే ప్లాన్‌లో ఉంటే వెంటనే కొనేయండి, రేట్లు పెరగబోతున్నాయ్‌!
మారుతి, హ్యుందాయ్‌ బాటలోనే టాటా.. సెప్టెంబర్‌ నుంచి ధరల మోత
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Embed widget