అన్వేషించండి

Spare Tyre Vs Puncture Kit: కారు ప్రయాణంలో టైర్ పంక్చర్ అయితే ఏది ఆదుకుంటుంది? స్పేస్ సేవర్ వీల్, రిపేర్ కిట్ మధ్య అసలు తేడాలివే!

Spare Wheel Vs Puncture Kit: కారులో స్పేస్ సేవర్ స్పేర్ వీల్, పంక్చర్ రిపేర్ కిట్‌లో ఏది మెరుగైనది? వాటి ప్రయోజనాలు, పరిమితులు, భారతీయ రోడ్లకు ఏది సరిపోతుందో తెలుసుకోండి.

Spare Tyre Vs Puncture Repair Kit: కారులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అయితే ఆ ఇబ్బంది వర్ణనాతీతం. ముఖ్యంగా.. హైవేపై వెళ్తున్నప్పుడు లేదా దగ్గరలో రిపేర్‌ షాప్ లేని ప్రాంతంలో టైర్ పంక్చర్‌ అయితే నరకం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కార్లలో సాధారణంగా రెండు రకాల ఏర్పాట్లు ఉంటాయి. ఒకటి.. స్పేస్ సేవర్ స్పేర్ వీల్ ‍‌(Space-Saver Spare Wheel), దీనినే స్పేర్‌ టైర్‌ అని కూడా అంటారు. మరొకటి.. పంక్చర్ రిపేర్ కిట్.

స్పేర్ వీల్ ఉంటే, దెబ్బతిన్న చక్రాన్ని తొలగించి దాని స్థానంలో మరో చక్రాన్ని అమర్చుకోవచ్చు. పంక్చర్ రిపేర్ కిట్ ఉంటే, టైర్‌ను తొలగించకుండానే చిన్న రంధ్రాన్ని సీల్ చేసి ప్రయాణం కొనసాగించవచ్చు. ఈ రెండింటికీ ప్రత్యేక ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి.

స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అంటే ఏమిటి?

స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అనేది కారులో ఉండే అదనపు టైర్‌. ఇది సాధారణ చక్రం కంటే చిన్నగా, సన్నగా ఉంటుంది. దీనికి కారణం.. సాధారణ పూర్తి సైజు స్పేర్ వీల్‌తో పోలిస్తే ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. బరువు కూడా తక్కువగా ఉంటుంది. దీనిని రోజువారీ ప్రయాణాల కోసం ఉపయోగించకూడదు. సమీపంలోని టైర్ రిపేర్ షాప్‌నకు చేరుకునేంతవరకే ఉపయోగించాలి.

స్పేస్ సేవర్ వీల్‌ను సరిగ్గా అమర్చినట్లు నిర్ధారించుకున్న తర్వాతే ప్రయాణం ప్రారంభించాలి. సాధారణంగా, ఈ అదనపు టైర్‌పై గరిష్ఠ వేగ పరిమితిని సూచిస్తారు. ఇది దాదాపుగా గంటకు 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. స్పేర్ వీల్‌తో కారును నడుపుతున్నప్పుడు, కంపెనీ సూచనలను కచ్చితంగా పాటించాలి. ఎక్కువ దూరం లేదా ఎక్కువ వేగంతో ప్రయాణించకూడదు.

దీని ప్రయోజనాలు ఏమిటి?

పెద్ద రంధ్రం, టైర్ కట్ లేదా బ్లోఅవుట్ వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా స్పేర్ వీల్ ఉపయోగపడుతుంది. టైర్‌లో కెమికల్ సీలెంట్ వేయాల్సిన అవసరం ఉండదు. రిపేర్ కిట్‌తో పరిష్కారం కాని కొన్ని తీవ్రమైన టైర్ సమస్యల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇది బూట్‌లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీంతోపాటు జాక్, వీల్ రెంచ్‌ను కూడా తీసుకువెళ్లాలి, ఇవి కారు బరువును పెంచుతాయి. చక్రం మార్చడానికి శారీరక శ్రమ అవసరం. అలాగే.. వేగం, దూరంపై పరిమితులు ఉంటాయి.

ఇది కూడా చదవండి: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!

పంక్చర్ రిపేర్ కిట్ అంటే ఏమిటి?

పంక్చర్ రిపేర్ కిట్ అనేది చిన్న రంధ్రాలను తాత్కాలికంగా సీల్ చేయడానికి ఉపయోగించే పరికరం. చాలా కార్లలో ఇచ్చే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ కిట్‌లో సీలెంట్ లిక్విడ్ బాటిల్, 12V ఎయిర్ కంప్రెసర్ ఉంటాయి. ఈ కంప్రెసర్‌ను కారులోని పవర్ సాకెట్‌కు కనెక్ట్ చేయవచ్చు.

టైర్ వాల్వ్ ద్వారా సీలెంట్‌ను లోపలికి పంపిస్తారు. తర్వాత కంప్రెసర్‌తో గాలి నింపుతారు. టైర్ లోపల సీలెంట్ వ్యాపించి చిన్న రంధ్రాన్ని మూసేందుకు సహాయపడుతుంది.

దీని ప్రయోజనం ఏమిటంటే.. బూట్‌లో చాలా తక్కువ స్థలం సరిపోతుంది. జాక్‌తో కారును పైకి లేపాల్సిన అవసరం లేదు. చక్రాన్ని తొలగించకుండా పని పూర్తి చేయవచ్చు. టైర్ మార్చడం తెలియనివారికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

అయితే పెద్ద రంధ్రాలు, టైర్ సైడ్‌వాల్ కట్స్, బ్లోఅవుట్‌లను ఇది సరిచేయలేదు. సీలెంట్ టైర్ లోపల వ్యాపించడం వల్ల, ఆ తర్వాత టైర్ తనిఖీ, మరమ్మతు కొంత కష్టమవుతుంది. కొన్ని సీలెంట్లు టైర్‌ను రిపేర్ చేయడానికి శాశ్వతంగా దూరం చేస్తాయి. దీనిని ఉపయోగించిన తర్వాత వీలైనంత త్వరగా టైర్ నిపుణుడితో తనిఖీ చేయించాలి.

ఇది కూడా చదవండి: ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్‌ దాటుతున్నారా? మీ వాహనం వివరాలు ఈజీగా తెలిసిపోతాయి.. రూ.10 వేల వరకు జరిమానా!

భారతీయ రోడ్లపై ఏది మెరుగైనది?

భారతీయ రోడ్లపై టైర్లకు రకరకాల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. హైవేపై మేకులు గుచ్చుకోవడం వల్ల చిన్న పంక్చర్ రావచ్చు. గుంతల్లో వేగంగా వెళ్లినప్పుడు టైర్ సైడ్‌వాల్ దెబ్బతినవచ్చు. కొన్నిసార్లు టైర్ పూర్తిగా పేలిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఈ రెండు పరికరాల పనితీరు వేర్వేరుగా ఉంటుంది.

తరచూ హైవేలపై ప్రయాణించేవారు, టైర్ షాపులు అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్లేవారు స్పేర్ వీల్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. నగరాల్లో ఎక్కువగా ప్రయాణిస్తూ బూట్ స్థలాన్ని ఆదా చేయాలనుకునేవారికి పంక్చర్ రిపేర్ కిట్ ఉపయోగపడుతుంది.

మీ కారులో స్థలం ఉంటే రెండింటినీ తీసుకెళ్లడం ఇంకా మంచిది. చిన్న పంక్చర్‌కు రిపేర్ కిట్ ఉపయోగపడుతుంది. పెద్ద సమస్య వచ్చినప్పుడు స్పేర్ వీల్ ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra EV: సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం
సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం
3-Cylinder Vs 4-Cylinder: 3-సిలిండర్‌ లేదా 4-సిలిండర్‌.. మీ ఫ్యామిలీ కారుకు ఏ ఇంజిన్ సరిపోతుందో తెలుసుకోండి
3 సిలిండర్ ఇంజిన్‌ vs 4 సిలిండర్ ఇంజిన్.. ఏ కారు బెస్ట్? మైలేజ్, పెర్ఫార్మెన్స్‌, వైబ్రేషన్స్‌ పూర్తి వివరాలు
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'
మహీంద్రా XEV 9S కారు చాలా సేఫ్‌ గురూ! క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget