హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయాన్ ఇన్ఫ్రా అపార్ట్‌మెంట్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
పేట్ బషీరాబాద్ పరిధిలోని నయాన్ ఇన్ఫ్రా అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో దేవుడి దీపం వల్ల మంటలు చెలరేగాయి. ఎదురెదురు ఫ్లాట్‌లలో గ్యాస్ సిలిండర్లు, ఏసీ కంప్రెషర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

- పేట్ బషీరాబాద్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
- దేవుడి దీపం నుంచి మంటలు రెండు ఫ్లాట్లకు వ్యాపించాయి.
- గ్యాస్ సిలిండర్లు, ఏసీలు పేలి భారీ ఆస్తినష్టం జరిగింది.
- అప్రమత్తతతో నివాసితులు బయటపడటంతో ప్రాణ నష్టం తప్పింది.
హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో ఎదురెదురుగా ఉన్న రెండు ఫ్లాట్‌లలో గ్యాస్ సిలిండర్లతో పాటు ఏసీ కంప్రెషర్‌లు సైతం పేలడంతో.. ఇంట్లో దేవుడి వద్ద పెట్టిన దీపంతో మంటలు చేలరేగాయి. భక్తితో ఇంట్లో దేవుడి వద్ద వెలిగించే చిన్న దీపం, మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెను ప్రమాదానికి దారితీస్తుందని చెప్పడానికి మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనంగా మారింది.. హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నయాన్ ఇన్ఫ్రా అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఆ మంటలు క్షణాల్లోనే ఇంట్లోని కబోర్డ్స్‌కు, సీలింగ్ జిప్సమ్ షీట్లకు అంటుకోవడంతో మంటలు దావానలంలా అపార్ట్‌మెంట్లో వ్యాపించాయి. దేవుడి దీపం ద్వారా మొదలైన ఈ మంటలు చూస్తుండగానే కొన్ని నిమిషాల్లోనే పక్కనే ఉన్న మరో ఫ్లాట్‌కు కూడా పాకడంతో అపార్ట్‌మెంట్ వాసులంతా ఒక్కసారిగా భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. మొదట నాలుగో ఫ్లోర్‌లో ఎదురెదురుగా ఉన్న రెండు ఫ్లాట్లలో మంటలు భారీగా ఎగసిపడటంతో లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లతో పాటు ఏసీ కంప్రెషర్లు భారీ శబ్దాలతో పేలిపోయాయి. ఆ పేలుళ్ల ధాటికి అపార్ట్‌మెంట్ ఒక్కసారిగా శబ్ధాలతో దద్దరిల్లిపోయింది. ఫ్లాట్లలోని ఫర్నిచర్, విలువైన ఇంట్లోని వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.

దట్టమైన పొగలు ఆకాశాన్ని తాకడంతో చుట్టుపక్కల ఇళ్ల వారు సైతం ఆందోళనకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో 2 ఫ్లాట్లు పూర్తిగా కాలిబూడిదవడంతో భారీ ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన వెంటనే ఆ ఫ్టాట్లలోని వారు అప్రమత్తమై కిందకు దిగి వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
దేవుడి దీపం వద్ద మొదలైన మంటలు చూస్తుండగానే పక్కనే మరో ఫ్లాట్‌కు వ్యాపించాయి. ఇళ్లలో దేవుడి వద్ద దీపాలు వెలిగించేటప్పుడు వాటి పక్కన కర్టెన్లు, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు లేదా త్వరగా మండే స్వభావం ఉన్న సామగ్రి లేకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు సైతం ముందు జాగ్రత్తగా ఆ దీపాలను ఆర్పివేయడం ఎంతో అవసరమని, అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగితే తీవ్రత అధికంగా ఉంటుందని ఫైర్ సిబ్బంది సూచిస్తున్నారు.
Frequently Asked Questions
పేట్ బషీరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఎక్కడ జరిగింది?
అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం ఎలా మొదలైంది?
ఇంట్లో దేవుడి వద్ద వెలిగించిన దీపం నుండి మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లోనే కబోర్డ్స్, సీలింగ్ షీట్లకు అంటుకుని వ్యాపించాయి.
ఈ అగ్నిప్రమాదంలో జరిగిన నష్టం ఎంత? ప్రాణనష్టం ఏమైనా ఉందా?
రెండు ఫ్లాట్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి, భారీ ఆస్తినష్టం వాటిల్లింది. అయితే, నివాసితులు సకాలంలో బయటకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది.
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దీపాల పక్కన కర్టెన్లు, పేపర్లు, ప్లాస్టిక్ వంటి త్వరగా మండే వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు దీపాలను ఆర్పివేయాలి.
ట్రెండింగ్ వార్తలు






















