అన్వేషించండి

LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్‌ను ఎట్టకేలకు భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సోమవారం ఎన్‌కౌంటర్ నుండి తప్పించుకున్న లతీఫ్ భట్ హతం.
  • కుల్గామ్‌లో సీఆర్పీఎఫ్ దాడి ప్రధాన నిందితుడిని బలగాలు మట్టుబెట్టాయి.
  • మసీదులో దాక్కున్న భట్ లొంగిపోవడానికి నిరాకరించడంతో కాల్పులు.
  • సైన్యం, CRPF సంయుక్త ఆపరేషన్‌లో రివార్డున్న ఉగ్రవాది మృతి.

కుల్గామ్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపు మీద కాల్పులు జరిపి ఉగ్రదాడికి పాల్పడిన మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మసీదు(దర్గా)లో దాక్కున్న ఉగ్రవాదికి లొంగిపోవాలని వీడియో కాల్ చేసినా వినకపోవడంతో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. మొదట సోమవారం నాడు లారూ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో LeT కమాండర్ లతీఫ్‌ భట్ బుల్లెట్‌ గాయాలతో తప్పించుకున్నాడు. అయితే ఆ ఎన్‌కౌంటర్‌లో ఉమర్‌ నసీర్‌ దార్‌ అనే మరో టెర్రరిస్ట్ హతమయ్యాడు. 

రూ.15 లక్షల రివార్డు ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ను సైన్యం, CRPF దళాలు సంయుక్త ఆపరేషన్‌లో హతమార్చాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత అతడి ఆచూకీ పసిగట్టిన భద్రతా బలగాలు ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని అధికారులు వీడియో కాల్ ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, లతీఫ్ అందుకు నిరాకరించాడు. దీంతో తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. కొన్ని గంటలపాటు శ్రమించిన సీఆర్పీఎఫ్ బలగాలు, ఆర్మీ కాల్పులు జరిపి ఓ ప్రార్థనా మందిరంలో నక్కిన టెర్రరిస్టును మట్టుబెట్టాయి. నవంబర్ 11న సీఆర్పీఎఫ్ దళాలపై దాడికి ముందు లతీఫ్ భట్ కుల్గాంలోని మీర్ బజార్, అక్రాన్ హబ్లిస్, కిలామ్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ద్వారా సైన్య గుర్తించింది. పలు హైప్రొఫైల్ ఉగ్రదాడుల్లో అతడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 

వీడియో కాల్ చేసినా వెనక్కి తగ్గలేదు..

లతీఫ్ భట్ ఒక మసీదులోకి ప్రవేశించి తలదాచుకున్నాడు. అక్కడ దాక్కుని సైతం భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాడు. అయితే మసీదుకు ఏమాత్రం నష్టం కలగకుండా బలగాలు అత్యంత సంయమనంతో వ్యవహరించి, అతడిని బయటకు వచ్చి లొంగిపోవాలని కోరాయి. ఎస్పీతో పాటు 9 రాష్ట్రీయ రైఫిల్స్ అధికారులు అతడికి ఫోన్ అందించి, వీడియో కాల్ ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. లౌడ్ స్పీకర్ల ద్వారా కూడా పలుమార్లు హెచ్చరికలు చేసినా.. అతడు లొంగిపోవడానికి నిరాకరించి కాల్పులు జరిపాడు. బలగాలు సంయుక్తంగా జరిపిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ లతీఫ్ భట్ హతమయ్యాడు. ఈ ఆపరేషన్‌లో మసీదుకు ఎలాంటి నష్టం జరగకుండా టెర్రరిస్ట్‌ను అంతమొందించారని  కుల్గామ్ ఎస్పీ అనాయత్ అలీ చౌదరి తెలిపారు.

నవంబర్ 11న సీఆర్‌పీఎఫ్ బలగాలపై దాడికి ముందు టెర్రరిస్ట్ లతీఫ్ భట్ కుల్గామ్‌లో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది. నవంబర్ 10న మీర్ బజార్, కిలామ్ ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించిన బలగాలు.. పలు హైప్రొఫైల్ ఉగ్రదాడుల్లో పాల్గొన్న లతీఫ్ మీద రూ. 15 లక్షల రివార్డ్ ఉందని, అతడి కోసం వేట కొనసాగుతోందని తెలిపాయి.

పోలీసులపై దాడులు చేసి పారిపోవడంలో లతీఫ్‌ దిట్ట అని తెలిసిందే. షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడని బలగాలు తెలిపాయి. ఓసారి అనంత్‌‌నాగ్‌లో ఓ పోలీసు హత్య, కుల్గాం జిల్లాలో ఇద్దరు వలస కార్మికుల హత్య కేసుల్లోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది అనంత్‌నాగ్‌‌లో దాడుల తర్వాత కూలీగా వేషం మార్చుకుని, ఓ ప్యాసింజర్‌ బస్సు ఎక్కి అతడు తప్పించుకున్నాడు.

Frequently Asked Questions

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది ఎవరు?

కుల్గామ్‌లో లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇతను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అతనిపై రూ.15 లక్షల రివార్డు ఉంది.

లతీఫ్ భట్‌ను లొంగిపొమ్మని భద్రతా బలగాలు ఎలా ప్రయత్నించాయి?

భద్రతా బలగాలు అతనికి వీడియో కాల్ చేసి, లౌడ్ స్పీకర్ల ద్వారా పలుమార్లు హెచ్చరికలు చేశాయి. అయితే, అతను లొంగిపోవడానికి నిరాకరించి కాల్పులు జరిపాడు.

లతీఫ్ భట్ ఏ ఉగ్రదాడులలో నిందితుడు?

అతను సీఆర్పీఎఫ్ క్యాంపు మీద కాల్పులు, పలు హైప్రొఫైల్ ఉగ్రదాడుల్లో ప్రధాన నిందితుడు. నవంబర్ 11న సీఆర్పీఎఫ్ దళాలపై దాడికి రెక్కీ నిర్వహించాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డిసెంబర్ 1 లోగా రాహుల్ కీలక నిర్ణయం! మోదీ ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతాయా?
డిసెంబర్ 1 లోగా రాహుల్ కీలక నిర్ణయం! మోదీ ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతాయా?
ప్రధాని మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన!125 ఏళ్ల పురాతన ఖల్సా దివాన్ గురుద్వారా రూపు మారబోతోందా?
ప్రధాని మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన!125 ఏళ్ల పురాతన ఖల్సా దివాన్ గురుద్వారా రూపు మారబోతోందా?
Pamban Rail Bridge suicides: పాంబన్ రైల్వే వంతెనపై విషాదాలు.. సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, మహిళ పరిస్థితి విషమం
పాంబన్ రైల్వే వంతెనపై వరుస విషాదాలు.. సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, మహిళ పరిస్థితి విషమం
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Embed widget