సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించాలని కోరుతూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలుపుతున్నారు. ఇది వినూత్న రీతిలో నిరసన తెలియజేసే మార్గం.
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Revanth Reddy Siddipet Visit | ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ సిద్దిపేటలో ఫ్లెక్సీలతో వినూత్న నిరసన తెలిపారు.

- రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనకు ముందు చర్చనీయాంశం
- ఆగిన అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఫ్లెక్సీలతో నిరసన
- వెటర్నరీ కళాశాల, శిల్పారామం, ఆసుపత్రి ప్రాజెక్టులు ప్రధానం
- పాత ప్రభుత్వ ప్రాజెక్టులు పూర్తిచేయాలని స్థానికులు విజ్ఞప్తి
Siddipet Residents Display Flexis of CM Revanth Reddys Visit | సిద్దిపేట: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన స్థానికంగా చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా నిలిచిపోయిన వెటర్నరీ కళాశాల, ఆసుపత్రి, శిల్పారామం తదితర అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించాలని కోరుతూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.
రేపు (ఈ 19న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనకు రానున్న నేపథ్యంలో, స్థానికంగా నిలిచిపోయిన, రద్దయిన అభివృద్ధి పనుల అంశం చర్చనీయాంశంగా మారింది. గత BRS ప్రభుత్వ హయాంలో మంజూరై, ప్రస్తుత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ సిద్దిపేటలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ఈ తరహా వినూత్న నిరసనలు స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ముఖ్యంగా పిల్లర్ల దశలోనే నిలిచిపోయిన వెటర్నరీ కళాశాల భవనం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమ కళాశాలను ఎప్పుడు ప్రారంభిస్తారంటూ భవనం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఒకవైపు, తమకు కళాశాలను తిరిగి కేటాయించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా మరోవైపు ఈ ఫ్లెక్సీలలో పేర్కొన్నారు.
సిద్దిపేటకు వెళ్తున్న రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న పనులతో ఫ్లెక్సీలు ఏర్పాటు శిల్పారామం, కోమటి చెరువు, వెటర్నరీ కాలేజ్, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజ్, ఇల్లంతకుంట రోడ్డు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లాంటి ఆగిపోయిన పనులను తిరిగి మొదలుపెట్టాలని ఫ్లెక్సీలతో రేవంత్ రెడ్డికి స్వాగతం
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
వెటర్నరీ కళాశాలతో పాటు శిల్పారామం, 1000 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, సిద్దిపేట- ఇల్లంతకుంట రహదారి, అలాగే మార్కెట్ నిర్మాణ పనుల వద్ద కూడా ఈ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఆగిపోయిన ఈ అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించి కొనసాగించాలని ఆయా ఫ్లెక్సీల ద్వారా స్థానికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Frequently Asked Questions
సిద్దిపేట నివాసితులు ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?
ఫ్లెక్సీలలో ఏయే ప్రాజెక్టులను హైలైట్ చేస్తున్నారు?
వెటర్నరీ కళాశాల, ఆసుపత్రి, శిల్పారామం, 1000 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, ఇల్లంతకుంట రోడ్డు, మార్కెట్ నిర్మాణం వంటి నిలిచిపోయిన పనులను ఫ్లెక్సీలలో హైలైట్ చేశారు. గత ప్రభుత్వంలో మంజూరైన ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటను ఎప్పుడు సందర్శిస్తున్నారు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న సిద్దిపేట పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటన సందర్భంగా ఈ నిరసనలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ నిరసనలో వినూత్న అంశం ఏమిటి?
స్థానికులు ఆగిపోయిన అభివృద్ధి పనులతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి సీఎంకు
ట్రెండింగ్ వార్తలు






















