అన్వేషించండి

పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?

2026లో అత్యంత పాపులర్‌ అయిన 200cc-250cc బైక్‌ల జాబితా ఇది. బజాజ్ పల్సర్ N250, హీరో ఎక్స్‌ట్రీమ్ 250R, KTM 250 డ్యూక్ సహా టాప్ 5 మోడళ్లు, వాటి ధరలు & ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.

5 Popular 200cc-250cc Bikes in 2026: మన టూవీలర్‌ మార్కెట్లో 200cc-250cc సెగ్మెంట్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నగర ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌కు కూడా అనువుగా ఉండే ఈ బైక్‌లు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. స్టైలిష్ డిజైన్, పవర్‌ఫీల్‌ ఇంజిన్, ఆధునిక ఫీచర్ల కారణంగా ఈ సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. 2026లో అత్యంత ప్రజాదరణ పొందిన ఐదు బైక్‌లు & వాటి ధరల వివరాలు ఇవే.

Bajaj Pulsar N250

ధర: రూ.1.34 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

పల్సర్ N250లో 249cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 24.5 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డైలీ యూజ్‌తో పాటు హైవే ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉండేలా పవర్ డెలివరీని బజాజ్ రూపొందించింది.

162 కిలోల బరువు, 795 మిల్లీమీటర్ల సీట్ హైట్ కారణంగా ట్రాఫిక్‌లో కూడా ఈ బైక్‌ను సులభంగా నడపవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, ABS రైడింగ్ మోడ్స్, LED లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర రూ. 44,000 నుంచి ప్రారంభం

Suzuki Gixxer 250

ధర: రూ.1.82 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

సుజుకి జిక్సర్ 250లో 249cc ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 25.77 hp పవర్‌ ఇస్తుంది. మిడ్ రేంజ్ పెర్ఫార్మెన్స్‌ & స్మూత్ ఇంజిన్ పనితీరు కారణంగా లాంగ్ రైడ్స్‌కు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

156 కిలోల బరువుతో ఈ సెగ్మెంట్‌లో తక్కువ బరువు కలిగిన బైక్‌లలో ఇది ఒకటి. స్పోర్టీ డిజైన్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ & విశ్వసనీయ పనితీరు దీని ప్రత్యేకత.

TVS Ronin

ధర: రూ.1.27 లక్షల నుంచి రూ.1.61 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్)

ఈ సెగ్మెంట్‌లో ఇతర బైక్‌లకు భిన్నంగా టీవీఎస్ రోనిన్ నియో-రెట్రో డిజైన్‌తో వస్తుంది. 225.9cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.4 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

795 మిల్లీమీటర్ల సీట్ హైట్, 159 కిలోల బరువు కారణంగా సిటీలో తిరిగేటప్పుడు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రైడింగ్ మోడ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, డ్యూయల్ ఛానల్ ABS వంటి ఫీచర్లు దీని ఆకర్షణను పెంచుతున్నాయి.

Hero Xtreme 250R

ధర: రూ.1.73 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

క్వార్టర్ లీటర్ (250cc) నేకెడ్ బైక్ సెగ్మెంట్‌లో హీరో ప్రవేశపెట్టిన మోడల్ ఎక్స్‌ట్రీమ్ 250R. ఇందులో 249cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 30 hp పవర్‌ను జనరేట్‌ చేస్తుంది.

షార్ప్ డిజైన్, మస్కులర్ లుక్, USD ఫ్రంట్ ఫోర్క్స్, డిస్క్ బ్రేక్స్, LED లైటింగ్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 167.7 కిలోల బరువు & 806 మిల్లీమీటర్ల సీట్ హైట్‌తో చాలా మంది రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: అమ్మకాలు పెరిగినా, లాభాలు ఆర్జించలేకపోతున్న Electric Scooter కంపెనీలు- కారణాలివే

KTM 250 Duke

ధర: రూ.2.22 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

ఈ సెగ్మెంట్‌లో అత్యంత శక్తివంతమైన & పనితీరు పరంగా ముందంజలో ఉండే బైక్‌లలో KTM 250 డ్యూక్ ఒకటి. ఇందులో 249cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 31 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అందుబాటులో ఉంది. TFT డిస్‌ప్లే, రైడింగ్ మోడ్స్, తక్కువ బరువు కలిగిన ఛాసిస్, 390 డ్యూక్‌ను పోలిన అగ్రెసివ్ డిజైన్ ఈ బైక్‌ను యువతలో మరింత పాపులర్‌గా మార్చాయి.

ఏ బైక్ బెస్ట్?

బడ్జెట్, రోజువారీ వినియోగం & మైలేజ్‌ను ప్రాధాన్యంగా చూసేవారికి బజాజ్ పల్సర్ N250 మంచి ఎంపిక. సౌకర్యవంతమైన రైడింగ్ కోరుకునేవారికి టీవీఎస్ రోనిన్ అనుకూలం. శక్తివంతమైన పనితీరు కావాలనుకునే వారికి హీరో ఎక్స్‌ట్రీమ్ 250R & KTM 250 డ్యూక్ బెస్ట్‌ ఆప్షన్లుగా నిలుస్తాయి. హైవే టూరింగ్ & స్మూత్ రైడింగ్ కోరుకునేవారికి సుజుకి జిక్సర్ 250 మంచి ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget