అన్వేషించండి

అమ్మకాలు పెరిగినా, లాభాలు ఆర్జించలేకపోతున్న Electric Scooter కంపెనీలు- కారణాలివే

Electric Vehicle Profit Challenge: భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీ సంఖ్యలో కనిపిస్తున్నప్పటికీ, EV కంపెనీలు లాభాలు ఆర్జించలేకపోతున్నాయి? ఈ వ్యాపారం వెనుక ఉన్న వాస్తవాలు ఇలా ఉన్నాయి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలు భారీగా పెరిగినా, కంపెనీలు నష్టాల్లో.
  • తయారీ ఖర్చులు, దిగుమతి చేసుకునే బ్యాటరీలే నష్టాలకు ప్రధాన కారణం.
  • మౌలిక వసతులు, పరిశోధన ఖర్చులు కంపెనీలపై భారం పెంచుతున్నాయి.
  • దేశీయ ఉత్పత్తితోనే ఈవీ కంపెనీలకు భవిష్యత్తు లాభాలు సాధ్యం.

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు వేగంగా షిఫ్ట్ అవుతున్నారు. నాలుగేళ్ల కిందటి వరకూ భారత రోడ్లపై పెట్రోల్ బైకులు, స్కూటర్ల హవా నడిచింది. ఇటీవల కాలంలో ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పలు దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 14 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలు జరిగాయంటే వీటి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఇంత భారీ స్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ కంపెనీలు మాత్రం నష్టాల్లోనే ఉన్నట్లు చెబుతున్నాయి. 

ఈ మాట చెబితే ఎవరూ నమ్మరు. కానీ స్వయంగా మార్కెట్ డేటానే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓలా (OLA), ఏథర్ నుంచి బజాజ్, హీరో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు భారీగా విక్రయాలు చేస్తున్నప్పటికీ ఈ సెగ్మెంట్ నుండి లాభాలను రాబట్టడం మాత్రం కంపెనీలకు ప్రశ్నార్థకంగా మారింది. అసలేం జరుగుతోంది, కంపెనీలు ఎందుకు లాభాలు పొందడం లేదో ఇక్కడ తెలుసుకోండి. 

బ్యాటరీ, ఇంపోర్ట్స్ వల్ల లాభాలపై ప్రతికూల ప్రభావం 
ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు నష్టాల్లో ఉండటానికి అతి పెద్ద కారణం వాటి తయారీ ఖర్చులు. ఏదైనా ఒక ఈవీ స్కూటర్ తయారీకి అయ్యే మొత్తం ఖర్చులో దాదాపు 50 శాతం కేవలం దాని బ్యాటరీ సెల్స్ కోసం అవుతుంది. అయితే ఈ బ్యాటరీ సెల్స్ భారత్‌లో తయారు కావని తెలిసిందే. వీటిని భారీ ఎత్తున విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

Also Read: Bike Customization: సులభంగా కస్టమైజ్ చేయించగల టాప్ 5 బైకులివే..స్పెషల్ లుక్ ఎలా ఇవ్వాలంటే..

దాంతోపాటు మోటార్ పార్ట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం కూడా ఆటో మేకర్ కంపెనీలు విదేశీ సప్లయర్లపైనే ఆధారపడక తప్పడం లేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం,  కస్టమ్స్ డ్యూటీల (పన్నుల) వల్ల కంపెనీల బడ్జెట్ తలకిందులై, తయారీ ఖర్చు అనూహ్యంగా పెరిగిపోతోంది. దీనివల్ల కంపెనీలు భారీ సంఖ్యలో స్కూటర్లను విక్రయిస్తున్నప్పటికీ లాభాల్లోకి రాలేకపోతున్నాయి.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం విపరీతమైన ఖర్చు
రోడ్లపై ఈవీ స్కూటర్ల సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ, దశాబ్దాల నుంచి మార్కెట్లో ఇప్పటికీ పెట్రోల్ వాహనాలదే హవా నడుస్తోంది. వాటితో పోలిస్తే ఈవీల ప్రొడక్షన్ వాల్యూమ్ ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంది. ఈవీల తయారీ చాలా పెద్ద ఎత్తున జరగనంత వరకు.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D), సాఫ్ట్‌వేర్ కోసం పెట్టే భారీ ఖర్చులను కంపెనీలు రికవరీ చేయలేవు.  దీనికి తోడు కొత్త ఈవీ కంపెనీలు షోరూమ్‌లు, ఛార్జింగ్ స్టేషన్లు, సర్వీస్ నెట్‌వర్క్‌లను జీరో నుంచి మొదలుపెట్టాల్సి వస్తోంది. దీనికోసం అధికంగా ఖర్చులు అవుతున్నా, ఆ స్థాయిలో ఈవీల తయారు చేయకపోవడం, అధిక ఉత్పత్తి ఖర్చులు, విదేశాల నుంచి బ్యాటరీ దిగుమతి చేసుకోవడం తగ్గి ఇక్కడే ఉత్పత్తి చేస్తే ఖర్చులు తగ్గితే కంపెనీలు లాభాల బాట పడతాయి. 

Also Read: EV vs Petrol Car.. వర్షాకాలంలో ఏది బెటర్? రెండింటి సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయి?

భవిష్యత్తుపైనే ఆశలు
ప్రస్తుతం నష్టాల్లో సాగుతున్నప్పటికీ, క్రమంగా పరిస్థితులు మెరుగవుతున్న సూచనట్లు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, తమ 'చేతక్' స్కూటర్ల పోర్ట్‌ఫోలియో యూనిట్ ఎకనామిక్స్ ఇప్పుడు నెమ్మదిగా ట్రాక్‌లోకి వస్తోందని బజాజ్ ఆటో స్వయంగా తెలిపింది. దీర్ఘకాలంలో లాభాలు రావాలంటే భారత్ లో మొత్తంగా ఉత్పత్తి చేయడం మాత్రమే అని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లోనే బ్యాటరీ సెల్స్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ తయారీ మొదలైతే దిగుమతి ఖర్చులు తగ్గిపోతాయి. ప్రభుత్వ పీఎల్ఐ (PLI) స్కీమ్, అలాగే కంపెనీలు సొంతంగా టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఈ నష్టాలు క్రమంగా లాభాలుగా మారే అవకాశం ఉంది.

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలు భారీగా జరుగుతున్నా కంపెనీలు ఎందుకు నష్టాల్లో ఉన్నాయి?

అధిక తయారీ ఖర్చులు, బ్యాటరీ సెల్స్ వంటి విడిభాగాల కోసం విదేశాలపై ఆధారపడటం, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక వ్యయం వెచ్చించాల్సి వస్తుండటమే నష్టాలకు ప్రధాన కారణం.

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీలో అత్యధిక ఖర్చు దేనికి అవుతుంది?

ఒక ఈవీ స్కూటర్ తయారీ ఖర్చులో దాదాపు 50 శాతం కేవలం బ్యాటరీ సెల్స్ కోసమే అవుతుంది. వీటిని భారీగా విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది.

EV కంపెనీలు లాభాల్లోకి రావడానికి నిపుణులు ఏమని సూచిస్తున్నారు?

భారత్‌లోనే బ్యాటరీ సెల్స్, అధునాతన ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడం ద్వారా దిగుమతి ఖర్చులు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ పీఎల్ఐ స్కీమ్ కూడా తోడ్పడుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు
2026 Toyota Glanza Facelift లుక్‌ అదిరిపోయింది.. కొత్త ఇంజిన్, ADAS ఫీచర్లు, CNG ఆటోమేటిక్ కూడా!
2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌.. ధర రూ.6.99 లక్షలే! కేవలం రూ.11,000తో బుక్‌ చేసుకోవచ్చు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget