అన్వేషించండి

Best Electric Scooters: డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఈ స్కూటర్లు నడపవచ్చు, బడ్జెట్ ధరలకే కొనేయండి

Scooters Without Driving License | డ్రైవింగ్ లైసెన్స్, RTO రిజిస్ట్రేషన్ లేకుండానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపవచ్చు. 60 వేల కంటే తక్కువ ధరలో లభించే ఈ టాప్ ఆప్షన్ల రేంజ్, ఫీచర్లు చూసి కొనండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ ధరలు పెరగడంతో, డ్రైవింగ్ లైసెన్స్ లేని స్కూటర్లకు డిమాండ్.
  • ఆంపియర్, ఒకినావా, లోహియా స్కూటర్లు తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇస్తాయి.
  • విద్యార్థులు, వృద్ధులకు, మహిళలకు సురక్షితం, రోజువారీ ఖర్చులు గణనీయంగా తగ్గిస్తాయి.

Electric Scooters With Low Cost | భారత్‌లో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో పాటు పర్యావరణానికి హాని కలిగించక వాహనాల వైపు ప్రజలు ఫోకస్ చేయడం మరో కారణం. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు  బైక్ నడపడం మరింత ఖరీదు అవుతోంది. జీతాలు పెరుగుతాయో లేదో కానీ పెట్రోల్ సహా ఇతరత్రా ఖర్చులు, ఇంటి ఖర్చులు పెరుగుతుంటాయి. దాంతో పెట్రోల్ సమస్య నుండి పర్మనెంట్ సొల్యూషన్ కోరుకుంటే.. ఇది మీకు నిజంగా గుడ్ న్యూస్.

భారత మార్కెట్లో కొన్ని అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని నడిపేందుకు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. RTO ఆఫీసుల చుట్టూ తిరిగి రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కొత్త వాహనదారులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. వీటి ధర ఎంత తక్కువగా ఉందంటే మీ బడ్జెట్‌లో సరిపోతాయి. ఎలాంటి చట్టపరమైన డాక్యుమెంట్లు లేకుండానే ఈ స్కూటర్లను రోడ్డుపై నడపవచ్చు. మరి ఆ స్కూటర్లు ఏంటి, వాటి ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి. 

ఆంపియర్, ఒకినావా అద్భుతమైన స్కూటర్లు

పైన పేర్కొన్న స్కూటర్ల జాబితాలో మొదటగా 'ఆంపియర్ రియో ఎలైట్' (Ampere Reo Elite) వస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఇది చాలా నమ్మకమైన ఆప్షన్. హైదరాబాద్‌లో సుమారు రూ. 42,999 ధరతో వచ్చే ఈ స్కూటర్, ఫుల్ ఛార్జ్ చేస్తే 55 నుంచి 60 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. దీని బ్యాటరీపై కంపెనీ పూర్తి 2 సంవత్సరాల వారంటీని ఇస్తోంది. తక్కువ ధరతో పాటు రోజువారీ ఆఫీసు జర్నీ, చిన్న వ్యాపార పనుల మీద వెళ్లే వారికి తక్కువ ధరతో ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Also Read: Honda Activa e vs Bajaj Chetak: హోండా యాక్టివా ఇ vs బజాజ్ చేతక్! అసలైన ఈవీ బాస్ ఎవరు?

మరోవైపు, కొంచెం స్పోర్టీగా, ప్రీమియం లుక్‌ను ఇష్టపడే వారికి 'ఒకినావా R30' ఒక మంచి ఆప్షన్ కానుంది. హైదరాబాద్‌లో సుమారు 58,992 ధరలో లభించే ఈ స్కూటర్‌లో ఎల్‌ఈడీ లైట్లు, డే-టైమ్ రన్నింగ్ లైట్లు, యాంటీ థెఫ్ట్ అలారమ్, సెంట్రల్ లాకింగ్ వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇచ్చారు. 

లోహియా ఓమా స్టార్ 

ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉండి, ఎక్కువ రేంజ్ కోరుకుంటే.. మీకోసం 'లోహియా ఓమా స్టార్' మీకు బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ధర కేవలం రూ. 40,850 మాత్రమే ఉంది. ఇది అత్యంత చౌకైన స్కూటర్లలో ఒకటి కావడంతో పాటు సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

మీకు బేసిక్ రైడింగ్ లైట్లు, షార్ప్ టర్న్ ఇండికేటర్లు, బ్యాటరీ స్థాయిని సరిగ్గా చూపే డిజిటల్ ఇండికేటర్ లభిస్తాయి. రోజువారీ ఆఫీసు జర్నీకి, ఇంటి పనుల కోసం, కూరగాయలు- రేషన్ తీసుకురావడానికి లేదా దగ్గర్లోని ప్రదేశాలకు వెళ్లడానికి ఈ స్కూటర్ సరిగ్గా సరిపోతుంది. 

స్టూడెంట్స్ కోసం మంచి ఆప్షన్లు..

ఇవన్నీ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కావడంతో పాటు, ఇంకా 18 సంవత్సరాలు నిండని, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం లేని విద్యార్థులకు వరం లాంటివి. ఇంట్లోని వృద్ధులు, మహిళలు కూడా వీటిని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. వీటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. గంటకు 25 కిలోమీటర్లు వేగం ఉండటంతో రోడ్లపై ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. 

ఈ స్కూటర్లను ఛార్జింగ్ చేయడానికి చాలా తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. మీ నెలవారీ పెట్రోల్ ఖర్చుల కంటే మంత్లీ ట్రావెలింగ్ ఖర్చు చాలా తగ్గుతుంది. కేవలం నగరం లోపలి లోకల్ కనెక్టివిటీ, తక్కువ దూరం ప్రయాణాలకు ఇవి సరిగ్గా సరిపోతాయి. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే కొనడం మంచిది.

Frequently Asked Questions

డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండా నడపగల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయా?

అవును, భారత మార్కెట్లో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా RTO రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇవి కొత్త వాహనదారులకు సులువుగా అందుబాటులో ఉంటాయి.

ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్ ధర ఎంత, ఎంత దూరం ప్రయాణిస్తుంది?

హైదరాబాద్‌లో దీని ధర సుమారు రూ. 42,999. పూర్తి ఛార్జ్‌తో 55 నుంచి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

లోహియా ఓమా స్టార్ స్కూటర్ ధర, మైలేజ్ వివరాలు ఏమిటి?

ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 40,850. సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

డ్రైవింగ్ లైసెన్స్ లేని విద్యార్థులు లేదా వృద్ధులు ఈ స్కూటర్లను ఉపయోగించవచ్చా?

అవును, ఇవి లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కాబట్టి, డ్రైవింగ్ లైసెన్స్ లేని విద్యార్థులు, వృద్ధులు, మహిళలు కూడా వీటిని సులభంగా నడపవచ్చు. వీటి వేగం గంటకు 25 కిలోమీటర్లు ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget