అన్వేషించండి

Bike Customization: సులభంగా కస్టమైజ్ చేయించగల టాప్ 5 బైకులివే..స్పెషల్ లుక్ ఎలా ఇవ్వాలంటే..

Bike Customization: కస్టమైజ్డ్ బైక్‌లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కాగా, భారత్‌లో చాలా బైక్‌లను సులభంగా కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా మార్చవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్‌లో తమ అభిరుచులకు తగ్గట్లు బైక్‌ల మోడిఫికేషన్ ట్రెండ్.
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, హిమాలయన్ మోడిఫికేషన్‌కు ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • ట్రయంఫ్, హార్లే, జావా, యెజ్డీలకు కస్టమైజేషన్ డిమాండ్ ఉంది.

Bike Customization | ఈ మధ్య కాలంలో కేవలం బైక్‌లు కొనడమే కాకుండా, తమ అభిరుచికి తగ్గట్టుగా వాటికి స్పెషల్ లుక్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. కొందరు తమ బైక్‌లకు కొత్త సీట్లను అమర్చుకుంటే, మరికొందరు కొత్త హ్యాండిల్‌బార్, అల్లాయ్ వీల్స్ లేదా కొత్త రంగుల ద్వారా వాటిని ప్రత్యేకంగా మారుస్తారు. దాంతో భారత్‌లోనూ కస్టమైజేషన్ చేయబడిన బైక్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. భారత్‌లో సులభంగా మార్పులు (మోడిఫై), కస్టమైజ్ చేయగల అనేక కంపెనీల బైక్‌లు ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350

ఈ జాబితాలో కనిపించే మొదటి పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350. ఈ బైక్ కస్టమైజేషన్ కోసం ఎక్కువగా ప్రయత్నిస్తారు. దీని కోసం మార్కెట్‌లో పెద్ద సంఖ్యలో యాక్సెసరీలు, మోడిఫికేషన్ పార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొత్త సీటు, వేరే లైట్లు, హ్యాండిల్‌బార్,  అనేక ఇతర మార్పులు చేయిస్తున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 సైతం కస్టమైజేషన్ విషయంలో చాలా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసేవారు ఇందులో లగేజ్ బాక్స్, అదనపు లైట్లు, అవసరమైన యాక్సెసరీలను అమర్చుకుంటారు. దీనివల్ల మీ జర్నీ మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

Also Read: Best Electric Scooters: డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఈ స్కూటర్లు నడపవచ్చు, బడ్జెట్ ధరలకే కొనేయండి

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X

స్టైల్,అడ్వెంచర్ రెండింటినీ ఇష్టపడే వారికి ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X బెస్ట్ ఆప్షన్. ఈ బైక్‌లో కంపెనీ నుంచి కూడా అనేక యాక్సెసరీలు లభిస్తాయి. వీటి సహాయంతో దీనిని తమ అవసరాలకు తగ్గట్లుగా సిద్ధం చేసుకోవచ్చు.

హార్లే డేవిడ్‌సన్ X440

హార్లే డేవిడ్‌సన్ X440 కూడా యువతలో బాగా ఫేమస్ అవుతోంది. దీని పవర్‌ఫుల్ లుక్, క్రూజర్ స్టైల్ ప్రజలను ఆకర్షిస్తుంది. ఇందులో సీటు, బ్యాక్‌రెస్ట్, అనేక ఇతర యాక్సెసరీలను అమర్చి బైకును మరింత అద్భుతంగా మార్చవచ్చు.

జావా 42

కస్టమ్ బైక్‌లను ఇష్టపడేవారికి ఇష్టమైన మోటార్‌సైకిల్ జావా 42. దీని డిజైన్ చిన్నవి, పెద్దవి అనేక మార్పులు చేయగలిగే విధంగా ఉంటుంది. చాలా మంది దీనికి రెట్రో లేదా కేఫ్ రేసర్ లుక్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు. 

Also Read: Honda Activa e vs Bajaj Chetak: హోండా యాక్టివా ఇ vs బజాజ్ చేతక్! అసలైన ఈవీ బాస్ ఎవరు?

యెజ్డీ రోడ్‌స్టర్

యెజ్డీ రోడ్‌స్టర్ కూడా కస్టమైజేషన్, మాడిఫై బైకుల జాబితాలో ఉంది. ఈ బైక్ దాని ప్రత్యేక శైలి, స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్ కోసం ఫేమస్ అయింది.  ఇందులో కూడా అనేక రకాల యాక్సెసరీలు, స్టైలింగ్ పార్ట్స్‌ను జోడించి దీనికి కొత్తగా, ఆకర్షణీయమైన లుక్ ఇవ్వవచ్చు.

Frequently Asked Questions

భారతదేశంలో బైక్ కస్టమైజేషన్ ఎందుకు పెరుగుతోంది?

ప్రజలు తమ అభిరుచికి తగ్గట్టుగా బైక్‌లకు ప్రత్యేక రూపాన్ని ఇవ్వడానికి కస్టమైజేషన్ చేస్తున్నారు. కొత్త సీట్లు, హ్యాండిల్‌బార్‌లు లేదా రంగులు మార్చడం ద్వారా తమ బైక్‌లను ప్రత్యేకంగా మార్చుకుంటున్నారు.

కస్టమైజేషన్ కోసం అత్యంత ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్ ఏది?

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కస్టమైజేషన్ కోసం చాలా ప్రజాదరణ పొందింది. మార్కెట్‌లో దీనికి పెద్ద సంఖ్యలో యాక్సెసరీలు మరియు మోడిఫికేషన్ పార్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

సుదూర ప్రయాణాలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450లో ఎలాంటి మార్పులు చేస్తారు?

సుదూర ప్రయాణాలు చేసేవారు హిమాలయన్ 450లో లగేజ్ బాక్స్, అదనపు లైట్లు మరియు ఇతర అవసరమైన యాక్సెసరీలను అమర్చుకుంటారు. ఇది వారి జర్నీని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget