అన్వేషించండి

Ampere Reo VYB Electric Scooter: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.. హైదరాబాద్‌లో ఈవీ స్కూటర్ ధర ఎంత

Ampere Reo Electric Scooter | భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో యాంపేర్ సంస్థ Reo VYB అనే కొత్త లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంపియర్ రియో VYB: లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేని కొత్త స్కూటర్.
  • రూ.69,499 ధరతో 80 కి.మీ. పరిధి, 25 కి.మీ/గంట వేగం.
  • విద్యార్థులు, వృద్ధుల కోసం రూపొందించిన మోడ్రన్ ఎలక్ట్రిక్ వాహనం.
  • కీలెస్ గో, 24 లీటర్ల స్టోరేజ్ వంటి సౌకర్యాలున్నాయి.

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నందున వాహనదారులు ఖర్చులు తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లకు మారుతున్నారు. ఈ క్రమంలో Ampere Reo VYB అనే కొత్త లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఈ EV ప్రత్యేకత ఏంటంటే, దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే స్కూటర్‌కు RTO రిజిస్ట్రేషన్ సైతం అవసరం లేదు. ఈ స్కూటర్‌ను విద్యార్థులు, వృద్ధులు, తొలిసారి వాహనం కొనుగోలు చేసే కస్టమర్‌లు ఈజీగా నడపవచ్చు. 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత?
హైదరాబాద్‌లో Ampere Reo VYB ఎలక్ట్రిక్ స్కూటర్ బేసిక్ మోడల్ ధర రూ. 69 వేల 499గా ఉంది.  ఇది కంపెనీ ప్రీమియం వెర్షన్, ఇందులో డిజైన్, ఫీచర్లు, లుక్ పరంగా మార్పులు చేసింది. గత మోడల్ కంటే ఇది మరింత మోడ్రన్, స్పోర్టీగా ఉంది. ఈ ఈవీ ముందు భాగంలో LED DRL, సైడ్ బాడీపై యాంబియంట్ లైట్ ఇచ్చారు. ఈ స్కూటర్ వార్మ్ వైట్, పేస్టర్ పర్పుల్, డార్క్ గ్రే, ఆక్వా మెటాలిక్ 4 రంగులలో విక్రయాలు జరుగుతున్నాయి.  

Ampere Reo VYB స్కూటర్‌లో 1.44 kWh సామర్థ్యం గల LFP బ్యాటరీ ఇచ్చారు. మీరు కనుక ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని Ampere కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. సిటీ రోడ్లపై ఇది సరిపోతుందని వాహనదారులు కొందరు చెబుతున్నారు. ఈ స్కూటర్‌ను నడపడానికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం ప్లస్ పాయింట్ అవుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric scooter) ఛార్జ్ అవ్వడానికి 5 గంటల 30 నిమిషాల టైం పడుతుంది. 

Also Read: SUV కొనాలని ఆలోచిస్తున్నారా? త్వరలో మార్కెట్లోకి రానున్న 6 పవర్‌ఫుల్ వెహికల్స్

ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చాలా ఫీచర్లు ఇచ్చారు. స్కూటర్‌లో కీలెస్ గో సిస్టమ్, ప్రీమియం కీ ఫాబ్, రివర్స్ మోడ్, LED లైటింగ్, మెయిన్ స్టాండ్, LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 24 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ సౌకర్యాలు ఉన్నాయి.

పనితీరు విషయానికి వస్తే, ఇందులో 0.25 kW హబ్ మోటార్ ఇచ్చారు. ఇది 35 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ముందు భాగంలో 12 అంగుళాల అల్లాయ్ వీల్, డిస్క్ బ్రేక్ ఇచ్చారు.  వెనుక భాగంలో 10 అంగుళాల వీల్ లభిస్తుంది. ఇందులో 140 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 1310 మిమీ వీల్‌బేస్ ఉన్నాయి. సిటీ రోడ్లపై సౌకర్యవంతంగా, బ్యాలెన్స్‌డ్ రైడింగ్‌ను అందించడంలో హెల్ప్ అవుతుంది. ఈవీని ముఖ్యంగా సిటీ రోడ్లపై, రోజువారీ చిన్న చిన్న పనుల మీద బయటకు వెళ్లే వారి కోసం రూపొందించారు. దీంతో పాటు ఇది లాస్ట్ మైల్ డెలివరీ సేవలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 

Also Read: Is Ethanol Cheaper than Petrol: పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌ వాడకంతో ఖర్చు పెరుగుతుందా ? మైలేజ్‌లోనూ వ్యత్యాసం

Frequently Asked Questions

Ampere Reo VYB స్కూటర్‌ను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరమా?

లేదు, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. దీనికి RTO రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.

Ampere Reo VYB ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత?

హైదరాబాద్‌లో Ampere Reo VYB బేసిక్ మోడల్ ధర రూ. 69,499గా ఉంది. ఇది కంపెనీ ప్రీమియం వెర్షన్.

Ampere Reo VYB స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుంది?

1.44 kWh LFP బ్యాటరీతో, ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే.

Ampere Reo VYB ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?

Ampere Reo VYB ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అవ్వడానికి 5 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఇది 1.44 kWh LFP బ్యాటరీని కలిగి ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget