అన్వేషించండి

EV vs Petrol Car.. వర్షాకాలంలో ఏది బెటర్? రెండింటి సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయి?

ఎలక్ట్రిక్ వాహనాలను అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నడిపేలా డిజైన్ చేశారు. వీటిలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రికల్ సిస్టమ్‌, హై వోల్టేజ్ వైరింగ్ లను భద్రతా ప్రమాణాల ప్రకారం తయారు చేస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈవీ బ్యాటరీ, వైరింగ్ నీటి రక్షణకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
  • వర్షంలో ఈవీ ఛార్జింగ్ సిస్టమ్ భద్రతతో కూడిన సాంకేతికతతో వస్తుంది.
  • వర్షం పెట్రోల్ కార్ల లైట్లు, రబ్బరు సీళ్లను ప్రభావితం చేస్తుంది.
  • సరైన జాగ్రత్తలతో వర్షంలో రెండు రకాల కార్లు సురక్షితమే.

EV vs Petrol Car On Monsoon: భారత్ సహా పలు దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, పర్యావరణానికి సైతం మేలు చేస్తుందన్న అవగాహన కారణంగా జనం ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, వర్షాకాలం ప్రారంభం కాగానే చాలా మంది వాహనదారులకు ఒక డౌట్ వస్తుంది. భారీ వర్షాలు, నీరు నిలిచిన రోడ్లపై ఈవీ కారు సురక్షితమా లేక పెట్రోల్ కారా? నడిపితే మంచిదా అని ఆలోచిస్తుంటారు. వర్షాకాలంలో పెట్రోల్ లేదా ఈవీ కార్లు.. వేటిని ఎక్కువగా నమ్మవచ్చు. ఈ రెండింటి సెక్యూరిటీ ఫీచర్లు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి. 

వర్షంలో ఎలక్ట్రిక్ కార్లు ఎంతవరకు సురక్షితం?
ఎలక్ట్రిక్ వాహనాలను అన్ని రకాల వెదర్ కండీషన్లను దృష్టిలో ఉంచుకునే డిజైన్ చేస్తారు. వీటిలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్, హై వోల్టేజ్ వైరింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్‌లను ప్రత్యేక భద్రతా ప్రమాణాల ప్రకారమే కంపెనీలు తయారు చేస్తాయి. ఈవీ బ్యాటరీ లోపలికి నీరు కానీ, దుమ్ము  ప్రవేశించకుండా ఉండేలా దానిని పూర్తిగా సీల్ చేస్తారని తెలిసిందే. చాలా వరకు ఎలక్ట్రిక్ కార్లు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ స్థాయిని తెలిపే ఐపీ (IP) రేటింగ్‌తో వస్తాయి. అందుకే సాధారణ వర్షంలో రోడ్లపై ఈవీ నడపడం పూర్తిగా సురక్షితంగా భావించవచ్చు. మరోవైపు, ప్రపంచంలోని పలు దేశాలలో భారీ వర్షాలు, మంచు కురిసే ప్రాంతాలలో కూడా ఎలక్ట్రిక్ కార్లను ఏ ఇబ్బంది లేకుండా ఉపయోగిస్తున్నారు. ఏ వాహనమైనా సరే.. నీరు ఎక్కువగా నిలిచిన ప్రాంతాల్లోకి తీసుకెళ్లకూడదు. వాహనం నీళ్లలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది.

వర్షంలో ఈవీని ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రజల్లో ఛార్జింగ్ గురించి అపోహలు ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు ఛార్జింగ్ పెడితే కరెంట్ షాక్ కొడుతుందేమోనని చాలా మంది అనుకుంటారు. ఆధునిక ఛార్జింగ్ సిస్టమ్‌లు అనేక రకాల భద్రతా సాంకేతికతలతో వస్తాయి. సాధారణ వర్షం లేదా తేమ ఉన్న సమయంలో కూడా భద్రత ఉండేలా ఛార్జింగ్ పోర్ట్, కనెక్టర్‌లను డిజైన్ చేస్తారు. ఇళ్ల వద్ద, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా నిర్ణీత భద్రతా ప్రమాణాల ప్రకారమే ఏర్పాట్లు చేస్తారు. అయినప్పటికీ, వర్షంలో ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. 

Also Read: Bike Customization: సులభంగా కస్టమైజ్ చేయించగల టాప్ 5 బైకులివే..స్పెషల్ లుక్ ఎలా ఇవ్వాలంటే..

పెట్రోల్ కార్లకు సైతం వర్షాకాలం కొంచెం ఇబ్బందే
ఒకవైపు వాహనదారులు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆందోళన చెందుతుంటే, మరోవైపు వర్షాకాలం పెట్రోల్, డీజిల్ కార్లకు కూడా సవాళ్లను తెచ్చిపెడుతుంది. నిరంతరం తేమ, బురద, నీటిలో తడవడం, కాంటాక్ట్ ఉండటం వల్ల వాహనంలోని అనేక భాగాలపై ప్రభావం పడుతుంది.  ముందుగా కార్ లైట్లపై దృష్టి పెట్టాలి. హెడ్‌లైట్, ఫాగ్ లైట్, టెయిల్ లైట్ కేసింగ్‌లలో ఏవైనా పగుళ్లు లేదా లీకేజీలు ఉంటే నీరు లోపలికి వెళ్లి, లైటింగ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. వర్షాకాలంలో రబ్బర్ సీల్స్ కూడా చాలా ముఖ్యమే. ఒకవేళ డోర్లు, కిటికీల రబ్బర్ సీల్స్ పాడైపోతే, నీరు కేబిన్ లోపలికి వచ్చి కారు ఇంటీరియర్‌ను దెబ్బతీస్తుంది.

వర్షాకాలంలో దేనిని నమ్మవచ్చు?
భద్రత పరంగా చూస్తే.. వర్షంలో ఈవీ మరియు పెట్రోల్ కార్లు రెండూ సురక్షితమైనవే. ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ మరియు ఛార్జింగ్ సిస్టమ్‌ను కాపాడటానికి అడ్వాన్స్డ్ వాటర్‌ప్రూఫ్, ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ ఇస్తారు. అదే సమయంలో పెట్రోల్ కార్లలో ఇంజన్, బ్రేకులు, లైట్లు మరియు అండర్ బాడీని క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Frequently Asked Questions

వర్షంలో ఎలక్ట్రిక్ కార్లు ఎంతవరకు సురక్షితం?

ఎలక్ట్రిక్ వాహనాలు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల కోసం రూపొందించబడ్డాయి. వీటి బ్యాటరీ, వైరింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్‌లు నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం సీల్ చేయబడి ఉంటాయి. సాధారణ వర్షంలో ఈవీలు నడపడం పూర్తిగా సురక్షితం.

వర్షం పడుతున్నప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

ఆధునిక ఛార్జింగ్ సిస్టమ్‌లు అనేక భద్రతా సాంకేతికతలతో వస్తాయి. ఛార్జింగ్ పోర్ట్ మరియు కనెక్టర్‌లు సాధారణ వర్షం లేదా తేమ ఉన్నప్పుడు కూడా భద్రంగా ఉండేలా రూపొందించబడ్డాయి.

వర్షాకాలంలో పెట్రోల్ కార్లకు ఎలాంటి సమస్యలు రావచ్చు?

వర్షాకాలంలో తేమ, బురద వల్ల పెట్రోల్ కార్లలో లైట్లు, రబ్బర్ సీల్స్ వంటి భాగాలు దెబ్బతినవచ్చు. లైట్లలో పగుళ్లు లేదా సీల్స్ పాడైతే నీరు లోపలికి ప్రవేశించవచ్చు.

వర్షాకాలంలో భద్రత పరంగా ఈవీలు, పెట్రోల్ కార్లలో ఏవి మెరుగు?

భద్రత పరంగా, వర్షంలో ఈవీ మరియు పెట్రోల్ కార్లు రెండూ సురక్షితమైనవే. ఈవీలలో బ్యాటరీకి వాటర్ ప్రూఫ్ రక్షణ ఉంటుంది, పెట్రోల్ కార్లలో మాత్రం ఇంజిన్, బ్రేకులు వంటి వాటిని తనిఖీ చేయడం ముఖ్యం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget