అన్వేషించండి

Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

Kavitha Telangana Rakshana Sena: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తన పార్టీకి ఓ స్థిరమైన ఓటు బ్యాంక్‌ను ఏర్పరుచుకోవాలనుకుంటున్నారు. అందు కోసం బీసీ వ్యూహం అమలు చేస్తున్నారు.

Kavitha BC Vote Bank Strategy:  తెలంగాణ రాజకీయ రంగస్థలంపై కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన  తెలంగాణ రక్షణ సేన  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనుసరిస్తున్న రాజకీయ పంథా ఒక స్పష్టమైన  లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నారు.  కేవలం సెంటిమెంట్‌పై ఆధారపడి రాజకీయం చేయడం వల్ల రాబోయే రోజుల్లో సుస్థిరమైన ఓటు బ్యాంక్‌ను నిర్మించలేమని గ్రహించిన ఆమె, రాష్ట్రంలోనే అతిపెద్ద సామాజిక వర్గమైన వెనుకబడిన తరగతుల  ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ మార్క్ తెలంగాణ అస్తిత్వ నినాదానికి  సామాజిక తెలంగాణ అనే బీసీ సాధికారత ఎజెండాను జోడించడం ద్వారా రాజకీయాల్లో తనదైన సొంత ముద్ర వేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.

బీసీ సెంటిమెంట్‌తో కవిత ప్రయత్నం

కేవలం  తెలంగాణ సెంటిమెంట్  ఒక్కదానిపైనే ఆధారపడి ఉంటే, అది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంక్‌కే పరిమితమవుతుందని, తమ వైపు మళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయని కవిత ముందే అంచనా వేశారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్‌తో పాటు  బీసీ సెంటిమెంట్ ను జతచేసి డ్యూయల్ ఇంజిన్ వ్యూహాన్ని ముందుకు తెచ్చారు. తాను అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, సామాజిక న్యాయ పోరాటం అనేది పుట్టుకతో కాదు, ఎంచుకునే ఎజెండాతోనే నిర్ణయమవుతుందనే సంకేతాన్ని బలంగా ఇస్తున్నారు. ఈ శైలి ద్వారా బిసి నాయకత్వ లోటు ఉన్న ప్రతిపక్ష శిబిరాల్లో ఒక బలీయమైన సామాజిక శబ్దంగా మారాలనేది ఆమె ప్రధాన ఆలోచన.

ఢిల్లీకి వెయ్యి కార్లతో ర్యాలీకి ప్రయత్నం

గతంలో కేసీఆర్ పార్లమెంట్ దిగ్బంధం కోసం వెయ్యి కార్ల ర్యాలీతో ఢిల్లీని కుదిపేసిన తరహాలోనే, తాను కూడా త్వరలోనే భారీ ర్యాలీతో జాతీయ స్థాయి దృష్ట్యా పోరాడేందుకు సిద్ధమవుతుండటం కేసీఆర్ మార్క్ అగ్రసివ్ మాస్ పొలిటికల్ అప్రోచ్‌ను గుర్తుచేస్తోంది. కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా, ఢిల్లీ వేదికగా ప్రదర్శించే ఈ 'పవర్ షో'ల ద్వారా బిసి సాధికారత, తెలంగాణ హక్కుల పోరాటంలో తన సీరియస్‌నెస్‌ను నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఇది కేవలం స్థానిక సభలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో తన గొంతుకను వినిపించే ప్రయత్నం.

కవిత బీసీ ఓటు బ్యాంకును ఎంతవరకు ఆకర్షించగలరు? 

కవిత  బీసీ ఓటు బ్యాంకులు ఎంత మేర ఆకర్షించగలరు అనే ప్రశ్నకు  సమాధానం చెప్పడం కష్టమే.  తెలంగాణలో జనాభా పరంగా 50 శాతానికి పైగా ఉన్న బీసీలు ఏ ఒక్క పార్టీకి పూర్తిగా సొంతం కాకపోవడం ఇక్కడ ప్రధానాంశం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు బీసీ నాయకత్వాన్ని ముందుంచేందుకు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ కుల గణన, 42% బిసి రిజర్వేషన్ల ఎజెండాతో ఉండగా, బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఇప్పటికే మార్మోగించింది. ఈ ముక్కోణపు పోటీలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీతో కవిత బీసీలను తనవైపు తిప్పుకోవడం అంత తేలికైన విషయం కాదు. మరో ప్రధాన సవాలు విశ్వసనీయత  . బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బిసి సామాజిక వర్గాలకు ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం  దక్కలేదనే అసంతృప్తి కొంతమంది బిసి నేతల్లో ఉంది. అటువంటి పరిస్థితిలో అదే కుటుంబానికి చెందిన కవిత ఇప్పుడు సడన్‌గా బీసీల కోసం పోరాడతానంటే, బిసి సంఘాలు, సగటు ఓటర్లు ఎంతమేరకు విశ్వసిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సామాజిక తెలంగాణ అనే నినాదం కొత్తది కాకపోయినా, దానిని కవిత ఎంతవరకు ఆచరణాత్మకంగా గ్రౌండ్ లెవల్‌కి తీసుకెళ్తారనే దానిపైనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

కవితకు పాజిటివ్ ఇమేజ్ 

 తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్ద కాలంగా సాంస్కృతిక వేదికలపై కవిత నిర్వహించిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల బీసీలలో, ముఖ్యంగా మహిళల్లో ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. బిఆర్ఎస్ ఓటు బ్యాంకులో చీలిక తేవడంతో పాటు, కాంగ్రెస్ లేదా బీజేపీ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న బీసీ ఓటర్లను, యువతను ఆకట్టుకోవడానికి ఆమె అనుసరిస్తున్న అగ్రెసివ్ అప్రోచ్ కొంతవరకు పనిచేసే అవకాశం ఉంది. కనీసం 5 నుండి 8 శాతం కీలకమైన ఓటు బ్యాంకును తన పార్టీ వైపు తిప్పుకోగలిగినా, తెలంగాణ రాజకీయాల్లో ఆయా నియోజకవర్గాల గెలుపోటములను శాసించే శక్త్యత్మక స్థానానికి  కవిత చేరుకోగలరు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీసుకున్న  బీసీ కార్డ్  వ్యూహాత్మకంగా సరైనదే అయినప్పటికీ, దాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో అనేక సవాళ్లు ఉన్నాయి. సాంప్రదాయ అగ్రవర్ణ మూలాలు ఉన్న నేతగా బిసి సాధికారతపై ఆమె ఇచ్చే హామీలు కార్యరూపం దాల్చాలంటే, నిలకడైన పోరాటాలు, క్షేత్రస్థాయి క్యాడర్ నిర్మాణం మరియు బిసి సామాజిక వర్గాల ద్వితీయ శ్రేణి నాయకత్వానికి తన పార్టీలో పెద్దపీట వేయడం అత్యంత ఆవశ్యకం. రాబోయే రోజుల్లో ఆమె నిర్వహించబోయే జాతీయ స్థాయి నిరసనలు, పార్లమెంట్ మార్చ్‌లే ఆమె పొలిటికల్ మైలేజ్‌ను నిర్ణయించనున్నాయి. 


  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Embed widget