అన్వేషించండి

Kavitha Vs KTR: కవిత పోరాటాలతో కేటీఆర్‌కు చిక్కులు - రోడ్డెక్కి చేసే రాజకీయాలు ఎప్పటి నుండి ?

TRS Vs BRS: బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టిన కవిత క్షేత్రస్థాయిలో దూసుకుపోతుంటే, కేటీఆర్ సోషల్ మీడియాకే పరిమితమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ వెనుకబడ్డారా?

KTR BRS Working President Strategy :  తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలకమైన, అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నట్లు  బీఆర్ఎస్  ఇంకా పూర్తిస్థాయి ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు అనే అసంతృప్తి నిజమేనని నిరూపిస్తూ.. గులాబీ గూటిలో పెద్ద చీలికే వచ్చేసింది. కేటీఆర్ లీడర్‌షిప్ స్టైల్ నచ్చక, పార్టీ అంతర్గత విభేదాలతో బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత.. ఏకంగా తెలంగాణ రక్షణ సేన  పేరుతో సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించి  జోరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు.   కేటీఆర్ కేవలం సోషల్ మీడియా వేదికగా, ఏసీ రూముల్లో ప్రెస్ మీట్లు పెడుతూ డిజిటల్ పోరాటాలు చేస్తుంటే.. సొంత పార్టీ పెట్టుకున్న కవిత మాత్రం పాత  ఉద్యమ  శైలిని అందిపుచ్చుకుని నేరుగా రోడ్లెక్కి వీధి పోరాటాలు   చేస్తుండటం గులాబీ కేడర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గ్రౌండ్‌లోకి దిగిపోయిన కవిత 

కార్పొరేట్ తరహాలో సాగే కేటీఆర్ హైటెక్ పాలిటిక్స్‌కు కాలం చెల్లిందని భావించిన కవిత.. గ్రౌండ్ లెవెల్‌లో కరడుగట్టిన తెలంగాణ సెంటిమెంట్‌ను, నిరుద్యోగుల సమస్యలను ఎజెండాగా మార్చుకున్నారు. ఇటీవల బోడుప్పల్ పరిధిలో ప్రభుత్వ భూముల కేటాయింపు, ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఆమె నేరుగా రంగంలోకి దిగి, పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించి అరెస్టయ్యారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఇలా లాఠీలకు ఎదురునిలిచి అరెస్ట్ అయిన దాఖలాలు లేకపోవడంతో.. బీఆర్ఎస్ కిందిస్థాయి కేడర్  ఇప్పుడు కవిత నాయకత్వం గురించి చర్చించుకుంటున్నారు.  సమస్యల పై పోరాడే అసలైన వారసురాలు కవితే అనే నరేటివ్‌ను ఆమె క్షేత్రస్థాయిలో బలంగా నిర్మిస్తున్నారు. అయితే కవితకు సమస్యలు సమస్యలు వస్తున్నాయి.  ఆమె ప్రతిపాదించిన  తెలంగాణ రక్షణ సేన  TRS  అనే సంక్షిప్త నామంపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో.. 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని, లేదంటే అప్లికేషన్ క్లోజ్ చేస్తామని ఈీ స్పష్టం చేసింది. అయితే, పేరు మార్చే ప్రసక్తే లేదని, అవసరమైతే న్యాయపోరాటం  చేస్తానని కవిత సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ క్యాడర్ కవిత వైపు వెళ్తుందా? 

ఈ విప్లవాత్మక పోరాటాలు, కొత్త పార్టీ స్థాపన కవిత రాజకీయ భవిష్యత్తుకు ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్‌గా మారేలా కనిపిస్తున్నాయి. కేసీఆర్ స్థాపించిన పాత  తెలంగాణ రాష్ట్ర సమితి ని  భారత్ రాష్ట్ర సమితి  గా మార్చడం వల్లే తెలంగాణలో పార్టీ అధికారం కోల్పోయిందని నమ్మే పాత ఉద్యమకారులంతా ఇప్పుడు కవిత వెంటే నడవడానికి సిద్ధమవుతున్నారు. తాము రక్తం, చెమట చిందించి నిర్మించుకున్న  TRS  అనే ఐడెంటిటీని తానే కాపాడుకుంటానని కవిత చెప్పడం సెంటిమెంట్‌గా కేడర్‌ను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ కొత్త పొలిటికల్ ఈక్వేషన్ కేటీఆర్‌ను తీవ్ర రక్షణలో పడేస్తోంది.  ఒకవైపు అధికార కాంగ్రెస్‌ను ట్విట్టర్‌లో ఢీకొట్టడం కంటే.. సొంత చెల్లెలు పెట్టిన పార్టీ వైపుకు తమ కేడర్ వలస వెళ్లకుండా చూసుకోవడమే కేటీఆర్‌కు ఇప్పుడు పెద్ద టాస్క్‌గా మారింది. కవిత రోడ్లెక్కి మైలేజ్ పెంచుకుంటుంటే.. బీఆర్ఎస్ ఇంకా కేవలం ట్వీట్లకే పరిమితమైతే, భవిష్యత్తులో తెలంగాణలో అసలైన ప్రతిపక్ష హోదాను కూడా కవిత కొత్త పార్టీ చేజిక్కించుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముగింపుగా చూస్తే.. అన్న 'డిజిటల్ వాట్సాప్' పాలిటిక్స్ చేస్తుంటే, చెల్లెలు మాత్రం 'రోడ్ పాలిటిక్స్' తో తెలంగాణ అసెంబ్లీ సమీకరణాలను మార్చడానికి దూసుకుపోతున్నారు. ఈ అన్నదమ్ముల, అన్నాచెల్లెళ్ల పొలిటికల్ వార్ రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget