అన్వేషించండి

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!

ఇటీవల హైదరాబాద్‌లో దొరికిన డ్రగ్స్ కేసులో సిటీతో పాటు బెంగళూరులోనూ పలుచోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేపట్టింది. డ్రగ్స్ కు మనీ లింకులపై ఆరా తీస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • డ్రగ్స్ కేసులలో ఈడీ బెంగళూరు, హైదరాబాద్‌లో సోదాలు.
  • అక్రమ ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్‌పై ప్రధాన దృష్టి.
  • పోలీసును తొక్కించి తప్పించుకున్న సైఫ్‌ను తర్వాత అరెస్ట్.

ED Rains In Bengaluru | బెంగళూరు: హైదరాబాద్‌లో ఇటీవల దొరికిన డ్రగ్స్ కేసుకు సంబంధించి నగరంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. NDPS కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు చేపట్టింది.  ఎన్‌డిపిఎస్ (NDPS) చట్టం కింద నమోదైన కేసు ఆధారంగా బెంగళూరులోని రెండు చోట్లతో పాటు, హైదరాబాద్‌లోని ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు హైదరాబాద్‌కు రావడం, వాటి సరఫరా వ్యవహారానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కొన్ని బృందాలుగా ఏర్పడి  తనిఖీలు చేపట్టారు.

ఈ భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించి ముందస్తుగా హైదరాబాద్ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఆ కేసు దర్యాప్తులో వెలుగుచూసిన అక్రమ ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ కోణంలోనే ఈడీ అధికారులు ఇప్పుడు బెంగళూరులోని కీలక ప్రాంతాలపై దాడులు నిర్వహించి తనిఖీలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా.. పోలీసును తొక్కించిన నిందితుడి అరెస్ట్

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో డ్రగ్స్ చేతులు మారుతున్నాయన్న సమాచారంతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం పాయల్ ఫుట్‌వేర్ వద్ద నిఘా ఉంచగా, కారులో ఉన్న మహ్మద్ సైఫ్‌కు ఓ వ్యక్తి డ్రగ్స్ ప్యాకెట్ అందించి వెళ్లడాన్ని గమనించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా, సైఫ్ తన కారును వేగంగా రివర్స్ చేసి పోలీసును తొక్కించి, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మహేందర్‌యాదవ్ కాలుకు తీవ్రగాయమవగా, ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి.

Also Read: Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?

గాయపడినప్పటికీ వెనకడగు వేయని పోలీసులు నిందితుడిని సినీఫక్కీలో 2.5 కిలోమీటర్ల దూరం వెంబడించి అఫ్జల్‌గంజ్ సమీపంలో పట్టుకున్నారు. పోలీసులపై దాడికి పాల్పడిన సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదు చేసి ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారని లింకులపై ఆరా తీస్తున్నారు.

Frequently Asked Questions

బెంగళూరు, హైదరాబాద్‌లలో ఈడీ ఎందుకు సోదాలు చేస్తోంది?

భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ కోణంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎన్‌డిపిఎస్ చట్టం కింద నమోదైన కేసు ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు.

ఈడీ అధికారులు ఏయే నగరాల్లో సోదాలు చేస్తున్నారు?

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్‌లోని ఏడు ప్రాంతాల్లో, బెంగళూరులోని రెండు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఇది డ్రగ్స్ కేసుకు సంబంధించి జరుగుతోంది.

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎవరు అరెస్టు అయ్యారు?

అబిడ్స్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా మహ్మద్ సైఫ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు పోలీసును తొక్కించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

అబిడ్స్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులకు ఏమైనా గాయాలయ్యాయా?

అవును, నిందితుడు మహ్మద్ సైఫ్ కారుతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌ కాలుకు తీవ్ర గాయమైంది. ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget