అన్వేషించండి

Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?

ACB Raids On IAS IPS Officers: తెలంగాణలో ఏసీబీ అధికారులు భారీ ఆపరేషన్లు చేపట్టబోతున్నారు. ఈ సారి వందల కోట్లు వెనకేసిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల సంగతి కూడా చూడబోతున్నట్లుగా తెలుస్తోంది.

Telangana Anti Corruption Bureau Crackdown:  తెలంగాణ అవినీతి నిరోధక శాఖ   రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థాయిలో అక్రమార్కులైన అధికారులపై సమగ్ర  దోపిడీ చిట్టా ను సిద్ధం చేసి విరుచుకుపడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో లేదా సురక్షితమైన లొసుగులను వాడుకుని లంచాల ఆరోపణల నుంచి తప్పించుకున్నామని భావిస్తున్న అనేక శాఖల అధికారుల పాత ఫైళ్లను ఏసీబీ తిరిగి తోడుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, ఇంజనీరింగ్ , జీహెచ్‌ఎంసీ, ఆర్‌టీఏ, పోలీసు శాఖల్లో క్వాసి-జ్యుడీషియల్ ,  సివిల్ అధికారాలను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు గడించిన ఉన్నతాధికారులను టార్గెట్ చేస్తూ పక్కా ఆధారాలతో దాడులకు రంగం సిద్ధం చేసుకుంది.

ఐఏఎస్, ఐపీఎస్‌లపైనా దాడులు చేసే అధికారం ఉందా?

సాధారణంగా రాష్ట్ర ఏసీబీకి ఐఏఎస్ , ఐపీఎస్  వంటి అఖిల భారత సర్వీసు అధికారులపై దాడులు చేసే అధికారం ఉందా? అనే సాంకేతిక సందేహం కలగడం సహజం. చట్టపరంగా, నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం, ఐఏఎస్,ఐపీఎస్ అధికారులపై విచారణ లేదా దాడులు నిర్వహించాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి   తప్పనిసరి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి సంపూర్ణ స్వేచ్ఛను  ఇవ్వడంతో పాటు, ముఖ్య కార్యదర్శి స్థాయి నుండి అవసరమైన చట్టబద్ధ ఆమోదాలు ముందస్తుగానే లభిస్తుండటంతో ఏసీబీకి సాంకేతిక, న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. దీనివల్ల ప్రాథమిక ఆధారాలు ఉన్న ఏ స్థాయి ఉన్నతాధికారి ఇంటిపైనైనా దాడి చేసేందుకు ఏసీబీకి సర్వహక్కులు లభించాయి.

65 మందికి పైగా ఉన్నతాధికారుల జాబితా రెడీ

ఈ విడత ఏసీబీ వ్యూహం గతంలో కంటే చాలా భిన్నంగా, అత్యంత శాస్త్రీయంగా ఉంది. దాదాపు 65 మందికి పైగా ఉన్నతాధికారుల జాబితాను తయారు చేసిన ఏసీబీ, వారి ఆదాయానికి మించిన ఆస్తుల  వివరాలను ఆరు నెలల పాటు నిఘా పెట్టి సేకరించింది. ఆస్తులను బినామీల పేరిట మార్చడం, రియల్ ఎస్టేట్ రంగాలు,  విదేశీ ఖాతాల్లోకి మళ్లించడం వంటి సంక్లిష్టమైన నెట్‌వర్క్‌లను ఏసీబీ ఇంటెలిజెన్స్ ఛేదించింది. లంచం తీసుకుంటూ దొరికిపోయే "ట్రాప్" కేసులతో పాటు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపైనే ప్రధానంగా దృష్టి సారించడం వల్ల బ్యూరోక్రసీలోని కీలక స్థానాల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఏసీబీ వద్ద పూర్తి స్థాయి జాతకాలు

ముఖ్యంగా రెవెన్యూ , ల్యాండ్ సర్వే విభాగాల్లోని క్వాసి-జ్యుడీషియల్ వివాదాలను పరిష్కరించే క్రమంలో అధికారులు వందల కోట్ల విలువైన వివాదాస్పద భూములను అక్రమంగా క్రమబద్ధీకరించిన ఆధారాలు ఏసీబీ చేతికి చిక్కాయి. పాత క్వాసి-జ్యుడీషియల్ ఆర్డర్లను, సివిల్ కాంట్రాక్టుల మంజూరు ఫైళ్లను తిరగదోడుతుండటంతో గతంలో కీలక పదవుల్లో పనిచేసి, ప్రస్తుతం లూప్‌లైన్ లేదా కీలక శాఖల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా ఈ ముప్పు పొంచి ఉంది. కేవలం క్షేత్రస్థాయి సిబ్బందిపైనే కాకుండా, అవినీతి మూలాలైన ఉన్నతాధికారుల వైపు ఏసీబీ దృష్టి మళ్లడం పరిపాలనా యంత్రాంగంలో పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది.

సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు

అంతేకాకుండా, ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా నేతృత్వంలో ఈ వ్యవస్థలోనే అంతర్గత ప్రక్షాళ వేగంగా జరుగుతోంది. దాడుల సమాచారం ముందుగానే లీక్ కాకుండా ఉండేందుకు అత్యంత రహస్య బృందాలను రంగంలోకి దించడం, సోదాల సమయాన్ని డిజిటల్ సాక్ష్యాలుగా రికార్డు చేయడం వంటి సంస్కరణలు తెచ్చారు. గడిచిన కొద్ది నెలల్లోనే 190కి పైగా కేసులు నమోదు చేసి 14 ఏళ్ల రికార్డును తిరగరాయడం, ప్రభుత్వంలో రాజకీయ సంకల్పం స్పష్టంగా ఉందనడానికి నిదర్శనంగా మారుతోంది. ఈ క్రాక్‌డౌన్ కేవలం అక్రమార్కులను పట్టుకోవడానికే పరిమితం కాకుండా, రాష్ట్ర పౌర సేవల వ్యవస్థలో ఒక స్పష్టమైన హెచ్చరికను పంపడానికి  ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు మారినా, పాత అక్రమాలపై విచారణ తప్పదనే భావన అధికారుల్లో కలిగించడం ద్వారా పరిపాలనలో పారదర్శకత తేగలమని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో వెలువడే ఐఏఎస్, ఐపీఎస్‌ల అరెస్టులు లేదా దాడుల వార్తలు తెలంగాణ రాజకీయ, పాలనా వర్గాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
Hyderabad Crime News: మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
Advertisement

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
November Weather 2026: నవంబర్ 2026 వాతావరణం! భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
నవంబర్ 2026 వాతావరణం: భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Comedy Drama OTT : 50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
Embed widget