అన్వేషించండి

ACB Raids: జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !

Hyderabad Crime News | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జీఎం అనంత లక్ష్మి కుమార్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 8 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జలమండలి జనరల్ మేనేజర్ కుమార్‌పై ఏసీబీ దాడులు.
  • రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు.
  • కోటి 10 లక్షల నగదు, 1 కిలో బంగారం స్వాధీనం.
  • రూ.100 కోట్ల ఆస్తులు, 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లు గుర్తింపు.

హైదరాబాద్: తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి లక్ష్యంగా యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు దాడులు చేపట్టారు. రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మిక దాడులు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 విభిన్న ప్రాంతాలలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లాపూర్‌లోని జీఎం కుమార్ స్వగృహంలో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి ఈ తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు.


ACB Raids: జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !

జలమండలి జీఎం కుమార్ నివాసంతో పాటు ఆయనకు అత్యంత సమీప బంధువుల ఇళ్లలోనూ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తనిఖీల్లో అధికారులకు భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఇంట్లో కుప్పలుగా పడి ఉన్న నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. స్వాధీనం చేసుకున్న నగదు అత్యధికంగా ఉండటంతో, దానిని ఖచ్చితంగా లెక్కించేందుకు అధికారులు ప్రత్యేకంగా క్యాష్ కౌంటింగ్ మెషీన్లను (Cash Counting Machines) తెప్పించారు. 


ACB Raids: జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !

Also Read: Hyderabad Traffic: హైదరాబాద్‌కు ఏమైంది? ప్రణాళిక లేని పనులతో ట్రాఫిక్ నరకం.. బయటపడేదెలా?

రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..
జలమండలి మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసాల్లో ఏసీబీ అధికారులు తనికీల్లో 100 కోట్ల  ( మార్కెట్ విలువ ప్రకారం ) ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మల్లాపూర్ తో పాటు బంధువుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇంట్లో కోటి 10 లక్షల నగదుతో పాటు సుమారు 1 KG బంగారు ఆభరణాలు గుర్తించారు. లభ్యమైన డాక్యుమెంట్స్ ప్రకారం హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటిలలో 3 ఫ్లాట్స్.. 6 ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి.  నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి అందులో ఏముందో చెక్ చేయనున్నారు. 

పట్టుబడిన ఈ భారీ నగదు, ఇతర ఆస్తుల వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లపై దర్యాప్తు బృందం ప్రస్తుతం ఆరా తీస్తోంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, లభించిన మొత్తం ఆస్తుల విలువ ఎంత అనేది సోదాలు ముగిసిన అనంతరం అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు. జీఎం కుమార్ స్థిర, చరాస్తుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

 

Frequently Asked Questions

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఎవరిపై దాడులు చేశారు?

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.

ఏసీబీ సోదాల్లో ఎంత నగదు, బంగారం పట్టుబడ్డాయి?

సోదాల్లో కోటి 10 లక్షల నగదుతో పాటు సుమారు 1 KG బంగారు ఆభరణాలు గుర్తించారు. నగదును లెక్కించడానికి ప్రత్యేకంగా క్యాష్ కౌంటింగ్ మెషీన్లను తెప్పించారు.

ఏసీబీ అధికారులు కుమార్ వద్ద దాదాపు ఎంత విలువైన ఆస్తులను గుర్తించారు?

ఏసీబీ అధికారులు కుమార్ వద్ద మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

కుమార్ నివాసాలతో పాటు ఏ ఇతర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి?

కుమార్ నివాసంతో పాటు ఆయనకు అత్యంత సమీప బంధువుల ఇళ్లలోనూ, మల్లాపూర్, నిజామాబాద్ లోనూ సోదాలు జరిగాయి. హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీలలో ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ కూడా గుర్తించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Railway Board Rejects Free MMTS: ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Embed widget