Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
Telangana ACB Raids:చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ పడుతోంది. రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు చేస్తోంది. తాజాగా దొరికిన శ్రీనివాసులే దానికి సాక్ష్యం.

Hydra attack: తెలంగాణ అవినీతి నిరోధకసాఖ (ACB) గురువారం సోదాలు నిర్వహించి, సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులును అరెస్టు చేసింది. ఈయన అవినీతి గురించి ఫిర్యాదు చేసింది ఎవరో కాదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్. గతేడాది ఆగస్టు 30న బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదు ఈ కేసుకు మూలం. ఎర్రకుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) , బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలకు అనుకూలంగా సర్వే రికార్డులు మార్చారు శ్రీనివాసులు. ఇలా అక్రమాలకు సహకరించి పెద్ద ఎత్తున లంచాలు తీసుకుని అక్రమాస్తులు కూబెట్టుకున్నాడు.
గతేడాది, HYDRAA అధికారులు ప్రగతి నగర్‌లోని ఎర్రకుంట చెరువు (సర్వే నంబర్ 134, ID 200/E/17) FTL , బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలను గుర్తించారు. 3.033 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ప్రభుత్వ ఆస్తి కానీ, నిజామ్‌పేట్ మున్సిపాలిటీ అనుమతులతో అక్రమ భవనాలు నిర్మించారు. సర్వే రికార్డుల ప్రకారం, ఈ భవనాలు చెరువు నుంచి 75 మీటర్ల దూరంలో ఉన్నట్టు తప్పుడు జియో-కోఆర్డినేట్లతో అనుమతులు జారీ చేశారు. వాస్తవానికి, ఇవి FTLలోనే ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు సర్వే నంబర్లను మార్చి, భవనాలు FTL కిందకు రాకుండా అధికారిక నివేదిక ఇచ్చాడు, బిల్డర్‌లకు అనుకూలంగా పనిచేశాడు. దీనికి సంబంధించి, HYDRAA కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు ఆగస్టు 30, 2024న నలుగురు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వారిలో శ్రీనివాసులు , పి. రామకృష్ణ రావు , నిజామ్‌పేట్ మున్సిపల్ కమిషనర్, పూల్‌సింగ్ , బాచుపల్లి మండల రెవెన్యూ ఆఫీసర్, మరొకరు ఉన్నారు. ఈ కేసు తర్వాత ACBకు బదిలీ అయింది.
ఈ అక్రమ నిర్మాణాలను HYDRAA ఆగస్టు 15, 2024న కూల్చివేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం, FTL/బఫర్ జోన్ గుర్తింపును భంగపరచకుండా నిర్మాణాలు చేయవచ్చని చెప్పినా, అధికారులు తప్పుడు డాక్యుమెంటేషన్‌తో అనుమతులు జారీ చేశారు. HYDA మెట్రోపాలిటన్ కమిషనర్ రిమైండర్లను కూడా అవగాహన చేసుకోలేదు. ఏసీబీకి దొరికిన శ్రీనివాసులు మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగా రెడ్డి జిల్లాల్లో AD సర్వే & ల్యాండ్ రికార్డ్స్‌గా పనిచేశాడు. ఈ జిల్లాల్లో చాలా చెరువుల FTLలో అక్రమ నిర్మాణాలు నమోదయ్యాయి. ముందు నల్గొండ జిల్లాలో సర్వే రికార్డులు మార్చినందుకు పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి హెచ్చరికలు కూడా అందుకున్నాడు. అయినా మారలేదు.
శ్రీనివాసులు ఎవరైనా లంచం ఇస్తే, సర్వే నంబర్లు మార్చి, అనుకూల నివేదిక ఇస్తాడు. మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగా రెడ్డి జిల్లాల అదనపు చార్జ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు పెరిగాయి. ఈ పద్ధతి ద్వారా అతను భారీ ఆస్తులు సమకూర్చుకున్నాడు. ACB అధికారులు డిసెంబర్ 4, 2025న రాయ్‌దుర్గంలోని మై హోమ్ భూజా అపార్ట్‌మెంట్స్‌లో శ్రీనివాసులు నివాసాన్ని, బంధువులు, స్నేహితులు, బెనామీలకు సంబంధించిన ఆరు చోట్ల రైడ్‌లు నిర్వహించారు. షెల్ కంపెనీలు, బెనామీ పేర్లతో రిజిస్టర్ చేసిన ఆస్తులు గుర్తించారు. హైడ్రా ఫిర్యాదులతో మరింత మంది అవినీతి అధికారుల్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.





















