Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Dasoju Sravan: తెలంగాణ శాసనమండలిలో దాసోజు శ్రవణ్ మంత్రి శ్రీధర్ బాబుపై ప్రసంశల వర్షం కురిపించారు. ఆయన సీఎం సీట్లో కూర్చోవాలని ఆకాంక్షించారు.

Dasoju Sravan praises on Minister Sridhar Babu: రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక్కో సారి విపక్ష సభ్యులు అధికార పార్టీ వారిని పొగుడుతూ ఉంటారు. అయితే అవన్నీ రాజకీయ వ్యూహాల్లో భాగమే అనుకోవచ్చు. శాసనసభను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించారు. కానీ శాసనమండలి సభ్యులు మాత్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చలో దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
శ్రీధర్ బాబు గారు అత్యంత సంస్కారవంతుడని, వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తన పనిపైనే దృష్టి పెడతారని శ్రవణ్ గారు కొనియాడారు. సభలో గానీ, బయట గానీ ఆయన మాట్లాడే తీరు చాలా హుందాగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన సీఎం సీటులో కూర్చోవాలని ఆకాంక్షించారు. ఆయన ప్రసంగాన్ని సభ్యులంతా నవ్వుతూ విన్నారు.
— Captain Fasak 2.0🎯 (@2Captainparody) January 3, 2026
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో , ఐటీ రంగాన్ని విస్తరించడంలో శ్రీధర్ బాబు గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని శ్రవణ్ గారు అభినందించారు. రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించే అరుదైన నాయకుల్లో శ్రీధర్ బాబు ఒకరని శ్రవణ్ గారు అన్నారు. ప్రజా సమస్యల విషయంలో స్పందించే తీరులో ఆయనకు ఉన్న అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.





















