Robin Uthappa about Team India | ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
టీమ్ఇండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ( Robin Uthappa ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై, ఢిల్లీ, పంజాబ్ నుంచి ఉన్న ప్లేయర్స్ కు మాత్రమే టీమ్ఇండియాలో స్టేబులే ప్లేస్ ఉంటుందని తెలిపారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా భారత్ బరిలోకి దిగనుంది. ఈ సిరీస్ కోసం టీమ్ ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే అందులో రుతురాజ్ గైక్వాడ్ ( Rutrturaj Gaikwad ) కు స్థానం దక్కలేదు.
ఇక ఇదే విషయంపై రాబిన్ ఉతప్ప స్పందించాడు. రుతురాజ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అతడు దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమేనని అన్నాడు. అయినప్పటికి కూడా తను హార్డ్ వర్క్‌ను కొనసాగించాలని సలహా ఇచ్చారు. భారత క్రికెట్‌లో ఉన్న సవాళ్లలో ఇది ఒకటన్నాడు. ముంబై, ఢిల్లీ లేదా పంజాబ్ వంటి ప్రధాన క్రికెట్ కేంద్రాల నుంచి రాకపోతే భారత జట్టులో స్టేబుల్ ప్లేస్ సంపాదించుకోవడానికి ప్లేయర్లు కష్టపడాల్సి ఉంటుందన్నాడు.





















