IND vs WI T20 World Cup: భారత్ సెమీఫైనల్ రేసుకు వెస్టిండీస్ గండం.. హెడ్ టు హెడ్ రికార్డ్స్‌లో కరేబియన్లదే హవా
India vs west Indies | భారత్ టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో తలపడుతుంది. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. లేకపోతే ఇంటిదారి పడుతుంది.

IND vs WI T20 World Cup Head-To-Head: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భారత్ ఈ మ్యాచ్ తదుపరి మ్యాచ్ వెస్టిండీస్‌తో ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియాకు నేటి మ్యాచులో విజయం సెమీఫైనల్ కు చేరుస్తుంది. ఈ మ్యాచ్ భారత జట్టుకు చావోరేవో. ఎందుకంటే ఈ టోర్నమెంట్‌లో భారత్‌పై వెస్టిండీస్ రికార్డు మెరుగ్గా ఉంది. కానీ గత రెండేళ్లుగా భారత్ ఏ జట్టునైనా సరే, చివరి క్షణంలోనైనా సరే ఓడించి విజయాలు అందుకుంటోంది.
ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 4 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో వెస్టిండీస్ 3 సార్లు గెలిచింది. అయితే భారత్ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. హెడ్-టు-హెడ్ రికార్డు 3-1తో కరేబియన్ జట్టుకు అనుకూలంగా ఉంది. కానీ టీ20 మ్యాచులో ఒక్క ఓవర్, ఒక్క బంతి ఫలితాలను మార్చేస్తాయి. జోరుమీదున్న సూర్య సేన పవర్ హాట్టర్స్, ఆల్ రౌండర్స్ ఉన్న వెస్టిండీస్ పై విజయం సాధించడం అంత తేలిక కాదు. ఈ మ్యాచ్ నెగ్గితే దక్షిణాఫ్రికా, తరువాత భారత్ ఈ గ్రూప్ నుంచి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్తుంది.
📍 Kolkata#TeamIndia turning up the heat ahead of a crucial contest 🔥#T20WorldCup | #MenInBlue | #INDvWI pic.twitter.com/t6Hkh9rBZT
— BCCI (@BCCI) March 1, 2026
2009, 2010లో వెస్టిండీస్ ఆధిపత్యం
భారత్-వెస్టిండీస్ తొలిసారిగా 2009లో ఇంగ్లాండ్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ సాధారణ స్కోరు చేసింది. దాంతో వెస్టిండీస్ సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత 2010లో కరేబియన్ గడ్డపై ఇరు జట్లు మళ్లీ తలపడగా.. ఆ మ్యాచ్‌లో కూడా వెస్టిండీస్ బలమైన బ్యాటింగ్‌తో, స్థిరమైన బౌలింగ్‌తో భారత్‌ను ఓడించింది.
2014లో భారత్ ప్రతీకారం
ఆ తర్వాత 2014 టీ20 ప్రపంచకప్‌లో భారత్ తొలిసారిగా వెస్టిండీస్ జట్టును ఓడించింది. అద్భుతమైన బౌలింగ్‌తో భారత్ ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత భారత బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని సులభంగా ఛేజ్ చేశారు. ఈ విజయం భారత్‌కు చాలా కీలకమైంది. విండీస్ పై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో లంక చేతిలో ఓటమిపాలైంది.
2016 సెమీ-ఫైనల్
అత్యంత చిరస్మరణీయమైన మ్యాచ్ 2016 సెమీ-ఫైనల్‌లో భారత్, విండీస్ జట్ల మధ్య జరిగింది. భారత్ భారీ స్కోరు చేసినా.. వెస్టిండీస్ అద్భుతమైన బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఆ ఓటమి భారత అభిమానులకు షాక్ ఇచ్చింది వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఈసారి సెమీ-ఫైనల్ కోసం పోటీ
ప్రస్తుత టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే ఈ గ్రూప్ నుండి సెమీ-ఫైనల్‌కు చేరుకోగా, రెండో స్థానం కోసం ఇప్పుడు భారత్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ కీలకంగా మారింది. సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ తప్పనిసరిగా గెలవాలి.
చరిత్ర వెస్టిండీస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్, బ్యాలెన్సింగ్ టీంతో ఈసారి రికార్డును సమం చేయడానికి భారత్‌కు గొప్ప అవకాశం ఉంది. క్రికెట్ అభిమానులు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6.30కి టాస్ వేస్తారు. కోల్‌కతాలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కాళికా మాతను దర్శించుకుని పూజలు చేసి, ప్రసాదం స్వీకరించారు.





















